ఫేస్ బుక్ లో ఓ బాలికకు పరిచయం అయిన స్నేహితుడు, మరి కొందరితో కలిసి ఆమెపై దారుణానికి పాల్పడ్డాడు. ఆమెను కిడ్నాప్ చేసి, 28 రోజుల పాటు బంధించి సామూహిక అత్యాచారానికి పాల్పడ్దాడు. అనంతరం బాలిక అనారోగ్యానికి గురికావడంతో తల్లికి అప్పగించారు.
మహిళలకు భద్రత కరువయ్యింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మహిళల రక్షణ కోసం ఎన్ని చట్టాలు తెచ్చినా కామాంధులకు భయం వేయడం లేదు. నిత్యం ఎక్కడో ఒక చోట స్త్రీలపై అఘాయిత్యాలు జరిగిన ఘటనలు వెలుగులో వస్తూనే ఉన్నాయి. చిన్నారులు, ముసలివాళ్లు అని కూడా చూడకుండా మగాళ్లు మృగాళ్లలా ప్రవర్తిస్తున్నారు. మైనర్లు అని జాలి కూడా చూపకుండా అత్యాచారాలకు ఒడిగడుతున్నారు. తాజాగా బీహార్ లో కూడా ఇలాంటి ఘటనే ఒకటి వెలుగులోకి వచ్చింది. ఓ 13 ఏళ్ల బాలికను 28 రోజుల పాటు దుండగులు బంధించి, సామూహిక అత్యాచారానికి ఒడిగట్టారు.
పోలీసులు, బాధితురాలి తల్లి ఫిర్యాదు ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. ముజఫర్‌పుర్ పట్ణణంలోని సరైయా పోలీసు స్టేషన్ పరిధిలో ఓ 13 ఏళ్ల బాలిక తన తల్లితో కలిసి నివసిస్తోంది. తల్లి కూలి పనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తోంది. ఈ క్రమంలో బాలికకు ఫేస్ బుక్ లో ఓ వ్యక్తి పరిచయం అయ్యాడు. ఈ క్రమంలో ఎప్పటిలాగే ఇంటి సమీపంలో జూలై 9వ తేదీన ఆ బాలిక ఏవో పనులు చేసుకుంటోంది. ఈ సమయంలో పలువురు ఆమె ఫేస్ బుక్ ఫ్రెండ్ తో పాటు మరో 5 గురు వచ్చి బాలికను కారులో కిడ్నాప్ చేశారు.
అనంతరం ఆమెను ఓ పాడుపడిన బంగ్లాకు తీసుకెళ్లారు. అక్కడ ఆమెను 28 రోజుల పాటు బంధించారు. ఫేస్ బుక్ స్నేహితుడి మిగితా వారితో కలిసి సామూహిక అత్యాచారానికి ఒడిగట్టాడు. కాగా.. బాలిక కిడ్నాప్ పై ఆమె తల్లి జూలై 9వ తేదీనే ఫిర్యాదు చేసింది. కానీ అది ప్రేమ వ్యవహారం కావచ్చని పోలీసులు సరిగా స్పందించలేదు. ఇదిలా ఉండగా.. బాలిక ఆరోగ్యం క్షీణించడంతో దుండగులు ఆగస్టు 5వ తేదీన బాధితురాలి తల్లికి ఫోన్ చేశారు. బాలికను నగరంలోని సారయ్య చౌక్‌లో వదిలివేస్తున్నామని, వచ్చి తీసుకెళ్లాలని చెప్పారు.
దీంతో ఆమె ఆందోళన చెందుతూ దుండగులు చెప్పిన ప్రదేశానికి వెళ్లింది. అక్కడ కూతురిని గుర్తించి, వెంటనే హాస్పిటల్ కు తీసుకెళ్లింది. ఏం జరిగిందని ఆరా తీయడంతో బాధితురాలు తనపై జరిగిన అఘాయిత్యాన్ని వివరించింది. దీంతో ఆమె మళ్లీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు కేసు దర్యాప్తు ప్రారంభించారు. బాధితురాలిని వైద్య పరీక్షల కోసం సదర్ ఆసుపత్రికి తీసుకువెళ్లారు. ఆమె స్టేట్‌మెంట్‌ను ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 164 ప్రకారం రికార్డ్ చేశారు. నిందితులను త్వరలో పట్టుకుంటామని పోలీసులు తెలిపారు.
