New Delhi: ద్రవ్యోల్బణం, నిరుద్యోగం వంటి అంశాలను ప్రధాని న‌రేంద్ర మోడీ పట్టించుకోవడం లేదని కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్య‌క్షుడు, వ‌య‌నాడ్ పార్ల‌మెంట్ స‌భ్యులు రాహుల్ గాంధీ ఆరోపించారు. కేవలం తన మిత్రుడి వ్యాపారం, పురోగతిపైనే ఆసక్తి చూపుతున్నారని కూడా ఆయ‌న పరోక్షంగా అదానీ అంశాన్ని ప్రస్తావిస్తూ  విమర్శించారు.  

Congress leader Rahul Gandhi: ప్రధాన‌మంత్రి న‌రేంద్ర మోడీకి త‌న మిత్రుల అభివృద్ధిపైనే ఆసక్తి ఎక్కువ‌గా ఉంద‌ని అదానీ అంశాన్ని లేవ‌నెత్తుతూ కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్య‌క్షుడు, వ‌య‌నాడ్ పార్లమెంట్ స‌భ్యులు రాహుల్ గాంధీ విమ‌ర్శ‌లు గుప్పించారు. ద్రవ్యోల్బణం, నిరుద్యోగం వంటి అంశాలను ప్రధాని న‌రేంద్ర మోడీ పట్టించుకోవడం లేదని ఆరోపించారు. కేవలం తన మిత్రుడి వ్యాపారం, పురోగతిపైనే ఆసక్తి చూపుతున్నారని కూడా ఆయ‌న పరోక్షంగా విమర్శించారు. 

వివ‌రాల్లోకెళ్తే.. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్ర‌భుత్వం, ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ టార్గెట్ గా మ‌రోసారి కాంగ్రెస్ పార్టీ తీవ్ర స్థాయిలో విమ‌ర్శ‌ల దాడి చేసింది. ద్రవ్యోల్బణం, నిరుద్యోగం వంటి అంశాలను ప్రధాని మోడీ పట్టించుకోవడం లేదనీ, కేవలం తన మిత్రుడి వ్యాపారం, పురోగతిపైనే ఆసక్తి చూపుతున్నారని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పరోక్షంగా అదాని అంశాన్ని ప్ర‌స్తావిస్తూ విమర్శించారు. కాంగ్రెస్ నేతృత్వంలోని రాజస్థాన్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ పై తన అభిప్రాయాలను పంచుకున్న రాహుల్ గాంధీ, భారత్ జోడో యాత్ర సందర్భంగా దేశంలోని యువత, మహిళలు, రైతులు, కార్మికులతో చర్చించానని, వారిని వేధిస్తున్న సమస్యలపై అవగాహన పొందానని చెప్పారు. ద్రవ్యోల్బణం, నిరుద్యోగ నిర్మూలన, మంచి విద్య, వైద్య సదుపాయాలు కల్పించడం వంటి సమస్యల నుంచి బయటపడేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోందన్నారు. రాజస్థాన్ లో ప్రవేశపెట్టిన బడ్జెట్ లో కాంగ్రెస్ విజన్ కనిపిస్తోందన్నారు.

రాహుల్ గాంధీ తన ఫేస్ బుక్ ఖాతాలో కేంద్ర బడ్జెట్ ను రాజస్థాన్ ప్రభుత్వ బడ్జెట్ తో పోలుస్తూ కేంద్రంపై నిప్పులు చెరిగారు. ఒకవైపు కేంద్ర ప్రభుత్వ బడ్జెట్, మరోవైపు దేశంలో ఒక రాష్ట్ర బడ్జెట్ ను చూపుతూ.. ద్రవ్యోల్బణం, నిరుద్యోగం గురించి కేంద్ర ప్రభుత్వం తన బడ్జెట్లో కనీసం ఒక్క‌మాట కూడా మాట్లాడలేదన్నారు. పార్లమెంట్ ప్రసంగంలో అదానీ గ్రూప్ స్టాక్ రూట్ వ్యవహారంపై ప్రధాని నరేంద్ర మోడీ మౌనం వహించడాన్ని రాహుల్ ప్రస్తావించారు. "ప్రధానికి ద్రవ్యోల్బణం గానీ, నిరుద్యోగం గానీ కనిపించడం లేదు. అతను ఏదైనా చూస్తే, అది అతని 'స్నేహితుడి వ్యాపారం-అతని పురోగతి మాత్ర‌మే" అంటూ విమ‌ర్శించారు. 'ప్రధానిగారూ, ఇప్పుడు మీ మిత్రుడి జేబు నింపడం మానేసి దేశ ప్రజల గురించి ఆలోచించండి' అని రాహుల్ గాంధీ అన్నారు.

ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ప్రవేశపెట్టిన బడ్జెట్ లో రాజస్థాన్ ప్రభుత్వం ప్రకటించిన ప్రధాన ఉపశమన అంశాల గురించి మాట్లాడుతూ, "ప్రజలకు ఉపశమనం కలిగించడానికి, రాజస్థాన్ లోని కాంగ్రెస్ ప్రభుత్వం రూ.1100 విలువైన ఎల్పీజీ సిలిండర్ ను కేవలం రూ.500 కు ఇస్తుంది. ప్రతి కుటుంబానికి 100 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, చిరంజీ-5 పథకం కింద రూ.25 లక్షల వరకు బీమా, లక్ష మంది యువతకు ఉద్యోగాలు, రైతులకు 2000 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, కరువు నివారణ ప్యాకేజీ, 12వ తరగతి వరకు ఉచిత విద్య వంటి చర్యలు తీసుకుంటామన్నారు. "బస్సు ఛార్జీల చెల్లింపు నుంచి మహిళలకు మినహాయింపు ఇచ్చామనీ, కొవిడ్ -19 వ్యాప్తితో అనాథలుగా మారిన వారిని గుర్తించి ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. వీటన్నింటితో పాటు అనేక ఇతర ప్రజా సంక్షేమ పథకాలు రాజస్థాన్ ప్రజలకు ద్రవ్యోల్బణం, నిరుద్యోగం వంటి సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తాయి" అని రాహుల్ గాంధీ అన్నారు.