స్తంభించిన ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ సేవలు. ఫేస్‌బుక్ పేజీలు లోడ్ కావడం లేదని యూజర్లు చెబుతున్నారు. మెటా ఇంకా స్పందించలేదు. 

ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ యూజర్లు సర్వర్ సమస్యలు ఎదుర్కొంటున్నారు. పేజ్ లోడింగ్‌లో సమస్య వస్తున్నదని చాలా మంది యూజర్లు చెబుతున్నారు. అయితే.. ఈ సమస్యపై మెటా ఇంకా ఎలాంటి ప్రకటన వెలువరించలేదు. ఈ సమస్య అంతర్జాతీయంగా ఉన్నట్టు తెలిసింది.

అంతర్జాతీయంగా లక్షలాది మంది మెటా యూజర్లు ఫేస్‌బుక్‌లోకి లాగిన్ కాలేకపోయారు. తమ ప్రొఫైల్‌ను, ఇతర సేవలను యాక్సెస్ చేయలేకపోతున్నారని చెప్పారు. ఈ సమస్య కేవలం ఫేస్‌బుక్ మాధ్యమానికే పరిమితం కాలేదు. ఇన్‌స్టాగ్రామ్‌లోనూ ఇదే సమస్య యూజర్లకు ఎదురైంది. ఈ దెబ్బతో కోట్లాది మంది ఫేస్‌బుక్ యూజర్లు అనివార్యంగా లాగౌట్ కావాల్సి వచ్చింది. మళ్లీ రీఫ్రెష్ చేసినా పేజ్ కావడం లేదు. ఇన్‌స్టాగ్రామ్‌లో నుంచీ కూడా లాగౌట్ అయ్యారు.

ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లు డౌన్ అయినట్టు ట్రాకర్ డౌన్ డిటెక్టర్ సైట్ పేర్కొంది. అంతేకాదు, యూట్యూబ్ స్ట్రీమింగ్‌ కూడా పని చేయడం లేదనే కంప్లైంట్స్ వచ్చినట్టు వివరించింది. సుమారు మూడు లక్షల ఔటేజీ రిపోర్టులు వచ్చాయని, 20 వేల ఇన్‌స్టాగ్రామ్ ఔటేజీ రిపోర్టులు వచ్చినట్టు పేర్కొంది.

Scroll to load tweet…

Also Read: Sandeshkhali: బెంగాల్‌లో రాష్ట్రపతి పాలన విధించండి: రాష్ట్రపతికి జాతీయ మహిళా కమిషన్ చైర్మన్ విజ్ఞప్తి

ఈ రెండు సోషల్ మీడియాలు ఔటేజ్ కావడంతో చాలా మంది యూజర్లు ఎక్స్‌లోకి వెళ్లారు. అక్కడ ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ల డౌన్ గురించి అనేక మీమ్స్ వైరల్ అవుతున్నాయి. గతంలో వైరల్ అయిన మీమ్స్ కూడా మళ్లీ ట్రెండింగ్‌లోకి వస్తున్నాయి. ఇందులో ఎక్స్ చీఫ్ ఎలన్ మస్క్, మార్క్ జుకర్‌బర్గ్‌లను పోలుస్తున్న మీమ్స్ కూడా ఉన్నాయి.