Asianet News TeluguAsianet News Telugu

క్రైమ్ సీరియల్స్ చూసి ప్రేరణ‌.. డెంటిస్టు ఇంట్లో నుంచి రూ.12 ల‌క్ష‌లు చోరీ చేసిన ముగ్గురు యువ‌కులు.. ఎక్క‌డంటే

సీరియల్స్ చూసి ప్రేరణ పొందిన ముగ్గురు యువకులు ఓ డాక్టర్ ఇంట్లో దొంగతనానికి పాల్పడ్దారు. రూ.12 లక్షల నగదు, విలువైన అభరణాలు ఎత్తుకెళ్లారు.

Inspired by crime serials.. Three youths stole Rs. 12 lakhs from a dentist's house..
Author
First Published Sep 24, 2022, 3:35 PM IST

క్రైమ్ సీరియల్స్ చూసి ప్రేరణ పొందిన ముగ్గురు యువ‌కులు చోరీకి పాల్ప‌డ్డారు. ఓ ప్ర‌ముఖ డాక్ట‌ర్ ఇంటి నుంచి రూ.12 ల‌క్ష‌లు దోపిడి చేసి ప‌రార‌య్యారు. కానీ పోలీసులు రంగ ప్ర‌వేశం చేసి వారిని అరెస్టు చేశారు. ఈ ఘ‌ట‌న మ‌హారాష్ట్ర‌లోని బాంద్రాలో జ‌రిగింది.

ఎన్నికల బరిలో ఓడిన అభ్యర్థి.. కోర్టు తీర్పుతో ఎంపీ అయ్యాడు.. ఇంతకీ ఏం పిటిషన్ వేశాడంటే?

బాంద్రాలోని ఓ ప్రముఖ డెంటిస్ట్ నివాసంలో రూ.12 లక్షల విలువైన బంగారు, వజ్రాభరణాలు చోరీకి గురయ్యాయి. అయితే ఈ ఘ‌ట‌న జ‌రిగిన దాదాపు పదిరోజుల త‌రువాత చోరికి పాల్ప‌డిన ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. నగరంలో క్యాటరర్‌లో పనిచేస్తున్న ముగ్గురూ టీవీలో క్రైమ్ షో చూసి దొంగ‌తనం ఎలా చేయాలో నేర్చుకున్నారు. ఓ డాక్ట‌ర్ ఇంట్లో చోరికి ప్లాన్ చేశారు.

పరీక్షలో కాపీయింగ్, టీచర్ కొట్టాడని.. ఉరేసుకుని ఏడో తరగతి విద్యార్థి ఆత్మహత్య..

సెప్టెంబరు 11, 12వ తేదీ మ‌ధ్య రాత్రి డాక్టర్ సందేశ్ మాయేకర్ ఇంట్లోకి చొర‌బ‌డిన యువ‌కులు బంగారం, వజ్రాలు పొదిగిన నగలు, విలువైన వాచీలు దోచుకెళ్లారు.ఆ స‌మ‌యంలో డాక్ట‌ర్ కుటుంబం మొత్తం గాఢ నిద్ర‌లో ఉంది. డాక్ట‌ర్ మాయేక‌ర్ కూడా తిరుప‌తి తీర్థయార్థత్రకు వెళ్లారు. కాగా.. తెల్ల‌వారు జామున నిద్ర‌లేచిన కుటుంబ స‌భ్యుల‌కు ఇళ్లంతా గంద‌ర‌గోళంగా క‌నిపించింది. బీరువా తలుపులు కూడా ప‌గులగొట్టి ఉండ‌టంతో పాటు విలువైన వ‌స్తువులు క‌నిపించ‌క‌పోవ‌డంతో చోరీ జ‌రిగింద‌ని తెలుసుకున్నారు. దీంతో డాక్ట‌ర్ కుమార్తె పోలీసుల‌కు ఫిర్యాదు చేసింది.

ప్ర‌ధాని మోడీ అన్ని పార్టీల నాయక‌త్వాన్ని క‌లవాలి - మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు  

ఆమె ఫిర్యాదు మేరకు ముంబై పోలీసులు కేసు న‌మోదు చేసుకొని ద‌ర్యాప్తు ప్రారంభించారు. బృందాలుగా ఏర్పడి నిందితుల కోసం గాలించ‌డం మొద‌లుపెట్టారు. దాదాపులో భాగంగా 500 సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించారు. అనంత‌రం ఓ నిందితుడు అయిన షామల్ గోప్‌ను డార్జిలింగ్‌లో పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ తర్వాత సురేంద్ర ఛెత్రీని నేపాల్ సరిహద్దు దగ్గర పట్టుకోట్టుగా, ఇంద్రజిత్ సైనీని గోరేగావ్ లో అరెస్టు చేశారు. ముగ్గురిపై నిందితుల‌పై  భారతీయ శిక్షాస్మృ తి (ఐపీసీ)లోని సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేశామ‌ని పోలీసులు తెలిపారు. 

Follow Us:
Download App:
  • android
  • ios