అయోధ్యలో అట్టహాసంగా దీపావళి.. 24 లక్షల ప్రమిదలతో దీపోత్సవం, రామమందిరం లోపలి దృశ్యాలు చూశారా

ఈ దీపావళికి అయోధ్యలో మరో గిన్నిస్ రికార్డు నమోదుకానుంది. పండగ నాడు సరయూ నదీ తీరంలో దాదాపు 24 లక్షల మట్టి దీపాలను వెలిగించి.. ఘనంగా దీపోత్సవం నిర్వహించనున్నారు. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, కేబినెట్ మంత్రులు, 50కి పైగా దేశాల హైకమీషనర్లు, రాయబారులు కూడా ఈ వేడుకల్లో పాల్గొననున్నారు. 

Inside visuals of under-construction Ram Mandir in Ayodhya on Deepotsav ksp

జనవరి 22, 2024న అయోధ్యలో జరగనున్న రామ లల్లా పవిత్రోత్సవానికి ముందు దీపావళి సందర్భంగా నగరంలో దీపోత్సవ వేడుకలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న రామమందిరం లోపలి దృశ్యాలకు సంబంధించిన వీడియో బయటకు వచ్చింది. నిర్మాణంలో ఉన్న రామమందిరాన్ని 'దీపోత్సవం' కోసం అలంకరించినట్లు వీడియోలో చూడవచ్చు. అయోధ్య పర్యటనలో ఉన్న ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ దీపోత్సవ వేడుకల సందర్భంగా 'హారతి' నిర్వహించారు. 

 

 

మరోవైపు.. ఈ దీపావళికి అయోధ్యలో మరో గిన్నిస్ రికార్డు నమోదుకానుంది. పండగ నాడు సరయూ నదీ తీరంలో దాదాపు 24 లక్షల మట్టి దీపాలను వెలిగించి.. ఘనంగా దీపోత్సవం నిర్వహించనున్నారు. ఈ దీపాలన్నింటిని ఒకే సమయంలో వెలిగించేందుకు గాను వేల సంఖ్యలో వాలంటీర్లు అయోధ్య చేరుకుంటున్నారు . వీరిలో అవథ్ యూనివర్సిటీ నుంచి దాదాపు పాతిక వేల మంది విద్యార్ధులు కూడా వెళ్తున్నారు. తద్వారా గతేడాది అయోథ్యలో అత్యధిక దీపాలను వెలిగించి నమోదు చేసిన రికార్డును బద్ధలు కొట్టనున్నారు. ఈ రికార్డును నమోదు చేసేందుకు గిన్నిస్ బుక్ ప్రతినిధులు కూడా ఆదివారం అయోధ్యకు చేరుకోనున్నారు. 

 

 

ఈ దీపోత్సవంతో పాటు దీపావళి వేడుకలు ఆదివారం మధ్యాహ్నం 3 గంటల నుంచి ప్రారంభంకానున్నాయి. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, కేబినెట్ మంత్రులు, 50కి పైగా దేశాల హైకమీషనర్లు, రాయబారులు కూడా ఈ వేడుకల్లో పాల్గొననున్నారు. దీపోత్సవంలో భాగంగా సరయూ నదీ తీరంలో వున్న 51 ఘాట్లపై 24 లక్షల మట్టి ప్రమిదలను వెలిగించనున్నారు. అత్యవసర పరిస్థితిని ఎదుర్కోనేందుకు గాను అన్ని ఆసుపత్రులను అప్రమత్తంగా వుంచామని ప్రభుత్వం తెలిపింది. అలాగే దీపోత్సవంలో పాల్గొనేందుకు గాను జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన 48 మంది గిరిజనులు చెప్పులు లేకుండా అయోధ్యకు చేరుకున్నారు. 

 

 

దీనితో పాటు రామ్ కీ పౌరీలో లైట్ అండ్ సౌండ్ షో నిర్వహించనున్నారు. ఇది వచ్చే ఐదేళ్ల పాటు కొనసాగుతుందని ప్రభుత్వం తెలిపింది. అయోధ్య, ఉత్తరప్రదేశ్‌ చరిత్రను ప్రదర్శించడానికి అతిపెద్ద డిజిటల్ స్క్రీన్‌ను ఏర్పాటు చేయనున్నారు. దీపాలను వెలిగించడం, వాటి నిర్వహణపై ఇప్పటికే వాలంటీర్లకు శిక్షణ ఇచ్చారు. మొత్తం 27 కళాశాలలు, అయోధ్యలోని 19 ఇంటర్మీడియట్ కాలేజీలు ఈ కార్యక్రమంలో భాగస్వాములయ్యాయి. దీపాలను లెక్కించేందుకు గాను 196 చొప్పున మొత్తం 12,500 బ్లాకులలో వీటిని అమర్చారు. 

 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios