Asianet News TeluguAsianet News Telugu

ఢిల్లీ హాస్పిటల్‌లో హోమం నిర్వహణ.. ఫొటో వైరల్.. ఆ హాస్పిటల్ ఏమన్నదంటే?

సెంట్రలీ ఎయిర్‌ కండీషన్డ్ హాస్పిటల్‌ లోపల హోమం నిర్వహించారు. ఢిల్లీలోని మణిపాల్ హెల్త్ హాస్పిటల్‌లో లాబీలోపల హోమాన్ని నిర్వహించిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
 

Inside delhi hospital havan conducted, receives criticism in social media after photo went viral kms
Author
First Published Mar 26, 2023, 3:38 PM IST

న్యూఢిల్లీ: ఢిల్లీలోని ఓ హాస్పిటల్ లోపల హోమం నిర్వహించారు. నలుగురు వ్యక్తులు హోమ గుండం చుట్టూ కూర్చొని హవన్ చేస్తున్న ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ ఫొటో ఆదివారం వైరల్ అయింది. అనేక మంది యూజర్లు ఈ ఫొటోపై స్పందించారు. చాలా మంది విమర్శలు చేశారు.

ఈ ఫొటోను ది హిందూ పత్రిక రెసిడెంట్ ఎడిటర్ ఆఫ్ వర్గీస్ కే జార్జ్ పోస్టు చేశారు. హాస్పిటల్ లాబీలా కనిపిస్తున్న ప్రదేశంలో ఈ హోమాన్ని నిర్వహించినట్టు అర్థం అవుతున్నది. ఆ ఫొటోలో ఎంట్రెన్స్ గేట్ల వద్ద వీల్ చైర్లు కనిపిస్తున్నాయి.

ఈ ఫొటోను ట్వీట్ చేసి వర్గీస్ కే జార్జ్ ఓ కామెంట్ చేశారు. మనల్ని ఇక దేవుడే రక్షించాలని పేర్కొన్నారు. ద్వారకాలోని మణిపాల్ హెల్త్ హాస్పిటల్ సెంట్రల్లీ ఎయిర్ కండీషన్డ్ ఆస్పత్రిలో హోం నిర్వహిస్తున్నారనే అర్థంలో వ్యాఖ్యానించారు.

ఈ పోస్టు వెంటనే వైరల్ అయింది. 6 లక్షల వ్యూస్ వచ్చాయి. హాస్పిటల్ లోపల హోమం నిర్వహించడాన్ని తప్పు పట్టారు. మరికొందరు ఈ హోమం ద్వారా హాస్పిటల్‌లోని ఎందరో పేషెంట్ల ఆరోగ్యాన్ని రిస్క్‌లో పెట్టారని, ఫైర్ సేఫ్టీ నిబంధనలను ఉల్లంఘించారని ఊహించారు. 

స్మోక్ అలారమ్‌లను ఆఫ్ చేశారని, అందుకే హోమం మంటలు వస్తున్నా ఎలాంటి అలారమ్‌లు రాలేవని అర్థం అవుతున్నదని మరికొందరు యూజర్లు కామెంట్ చేశారు. ఆ హోమం నుంచి వచ్చే హవనం.. లేదా పొగ అక్కడ చికిత్స పొందుతున్న పేషెంట్ల ఆరోగ్యానికి ప్రమాదంగా ఉండొచ్చని పేర్కొన్నారు.

Also Read: భారత్‌ కు ఆస్కార్, నారీ శక్తి, అవయవదానం: ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ‘మన్‌ కీ బాత్‌’ లో కీలక అంశాలు

మరొక యూజర్ డెల్టా స్ట్రెయిన్ కరోనా వైరస్ విజృంభించినప్పుడు కూడా ఇదే హాస్పిటల్ ఇలాగే హోమాన్ని నిర్వహించిందని ఓ ఫొటోను షేర్ చేశాడు.

కాగా, వర్గీస్ కే జార్జ్ పోస్టు చేసిన ఫొటోపై ఆ హాస్పిటల్ స్పందించింది. వర్గీస్ గారు.. మీరు ఎదుర్కొన్న సమస్యలను దృష్టిలో పెట్టుకుని క్షమాపణలు చెబుతున్నామని మణిపాల్ హాస్పిటల్స్ రెస్పాండ్ అయింది. ‘మీ వివరాలు తమకు డైరెక్ట్ మెస్సేజ్ చేస్తే మా టీమ్ మిమ్మల్ని సంప్రదిస్తుంది’ అని పేర్కొంది.

Follow Us:
Download App:
  • android
  • ios