Asianet News TeluguAsianet News Telugu

భారత్ తలుచుకొంటే ఏదైనా సాధ్యమే: ఐఎన్ఎస్ విక్రాంత్ ను జాతికి అంకితం చేసిన మోడీ

ఐఎన్ఎన్ విక్రాంత్ ను ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారం నాడు జాతికి అంకితం చేశారు. కేరళ రాష్ట్రంలోని కొచ్చిన్ లో ఐఎన్ఎస్ విక్రాంత్ భారత నావికాదళంలోకి ప్రవేశించింది

INS Vikrant is the pride of every Indian, says PM
Author
First Published Sep 2, 2022, 10:33 AM IST

తిరువనంతపురం:ఐఎన్ఎస్ విక్రాంత్ ను చూసి ప్రతి భారతీయుడు గర్వపడాలన్నారు.ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ శుక్రవారం నాడు ఐఎఎన్ఎస్  విక్రాంత్ నౌకను జాతికి అంకితం చేశారు. భారత నౌకదళంలోకి ఐఎన్ఎస్ విక్రాంత్  ఇవాళ ప్రవేశించింది. కొచ్చిన్ లో నిర్వహించిన కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ ఐఎన్ఎస్ విక్రాంత్ ను జాతికి అంకితం చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ  ప్రసంగించారు.

భారత్ తలుచుకుంటే సాధ్యం కానిది ఏదీ ఉండదని ఆయన అభిప్రాయపడ్డారు. కేరళ తీరంలో ఇవాళ నవశకం ప్రారంభమైందని మోడీ చెప్పారు.అభివృద్ది చెందిన దేశాలే ఐఎన్ఎస్ విక్రాంత్ వంటి వాహన నౌకలను  తయారు చేసే సరిస్థితి ఉండేదన్నారు. కానీ భారత్ మాత్రం ఈ పరిస్థితిని మార్చిందని  ప్రధాని చెప్పారు.ఐఎన్ఎస్ విక్రాంత్ లో ఉపయోగించిన ప్రతి భాగం స్వదేశంలోనే తయారైన విషయాన్ని మోడీ గుర్తు చేశారు. భారత నైపుణ్యాలకు ఈ నౌక తయారే ప్రతీకగా ప్రధాని మోడీ పేర్కొన్నారు.

మౌర్యుల నుండి గుప్తుల కాలం వరకు భారత దేశ నావిక దళం చారిత్రక కాలంలో కూడా ప్రసిద్ది చెందిందని మోడీ ప్రస్తావించారు. చత్రపతి శివాజీ అద్భుతమైన నావికాదళాన్ని నిర్మించారన్నారు.బ్రిటీష్ పాలన సమయంలో భారత్ కు చెందిన నావికాదళాన్ని బలహీన పర్చారన్నారు.ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో భాగంగా వలస రాజ్యాల కాలంలో క్లోల్పోయిన శక్తిని భారత్ పునరుద్దరించుకుంటుందని మోడీ తెలిపారు. స్వంత శక్తితో విక్రాంత్ ను తయారు  చేయడం ద్వారా చరిత్రను తిరగరాశామని మోడీ అభిప్రాయపడ్డారు. ఐఎన్ఎస్ విక్రాంత్ తో భారత నావికాదళం కొత్త శిఖరాలకు చేరుతుందని మోడీ ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.

ఐఎన్ఎస్ విక్రాంత్ మన నారీ శక్తిని కూడా ఉపయోగించుకుంటుందన్నారు. సముద్రానికి పరిమితి లేదు,మన మహిళలకు కూడా ఎలాంటి ఆంక్షలుండవని ప్రధాని చెప్పారు. మన నూతన భారత్ లో మహిళల అన్ని సంకెళ్లను తెంచామన్నారు.భారత నావికా దళంలోని అన్ని విభాగాల్లో మహిళలకు అవకాశాలు కల్పించిన విషయాన్ని ప్రధాని మోడీ ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఒక ఏడాది క్రితం ఇండియన్ నేవీ మహిళా అధికారులు ఐఎన్ఎస్‌వీ తారిణి భూమి చుట్టూ సముద్ర యానం నిర్వహించారన్నారు. సాయుధ దళాలలోని మహిళా అధికారులకు సాధికారిత కల్పించామన్నారు.

ఆత్మ నిర్భర్ భారత్  దేశాభివృద్దిలో మూలస్థంభంగా మారిందన్నారు. ఐఎన్ఎస్ విక్రాంత్ నుండి తేజాస్ వరకు మేకిన్ ఇన్ ఇండియా ద్వారా మన టెక్నాలజీని బలోపేతం చేసుకున్నామని ప్రధాని చెప్పారు. తమిళనాడు, ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రాలకు రెండు కొత్త రక్షణ కారిడార్లు వస్తాయని ప్రధాని మోడీ ప్రకటించారు. దీంతో కొత్త ఉపాధి అవకాశాలను కూడా కల్పించనుందన్నారు.

చిన్న నీటి బిందువులు సముద్రాన్ని సృష్టించినట్టే దేశంలో ప్రతి పౌరుడు ఆత్మ నిర్భర్ భారత్ లక్ష్యం కోసం పనిచేయాలన్నారు.భారత నౌక దళాన్ని బలోపేతం చేసేందుకు అంకిత భావంతో పనిచేస్తున్నామని మోడీ చెప్పారు. బడ్జెట్ లో నిధుల కేటాయింపుతో పాటు ఆత్మనిర్భర్ అత్యాధునిక టెక్నాలజీ అభివృద్ది చేయడం వరకు అనేక చర్యలు చేపట్టిన విషయాన్ని మోడీ గుర్తు చేశారు.ఆఫ్ షోర్ గస్తీ నౌకలు, జలాంతర్గాముల నుండి విమాన వాహన నౌకల వరకు భారత నావిక దళం శరవేగంగా బలపడుతుందని ప్రధాని మోడీ చెప్పారు.భారతదేశం బలంగా ఎదుగుతున్న కొద్దీ మానవవాళికి పరిష్కారాలను అందిస్తుందని మోడీ  ధీమాను వ్యక్తం చేశారు. లక్ష్యం ఎంత కష్టమైనా ఎంత పెద్ద సవాల్ ఎదురైనా భారత్ నిర్ణయించినప్పుడు లక్ష్యానని సాధించడం అసాధ్యమన్నారు.


 


 

 


 

Follow Us:
Download App:
  • android
  • ios