బడ్జెట్ 2024 హైలెట్స్ : పన్ను రేట్లు యథాతథం.. పీఎం స్వానిధి ద్వారా మరో 2.3 లక్షల మందికి లోన్లు..
2024-2025 ఆర్థిక సంవత్సరం కోసం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (union finance minister nirmala sitharaman) గురువారం లోక్ సభ (Lok sabha) లో మధ్యంతర బడ్జెట్ (Interim Budget 2024) ను ప్రవేశపెట్టారు. ఇందులో పన్ను రేట్లను యథాతథంగా ఉంచారు. అభివృద్ధిపైనే ఈ బడ్జెట్ దృష్టి సారించింది.
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మాలా సీతా రామన్ గురువారం 2024-2025 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన మధ్యంతర బడ్జెట్ ను ప్రవేశ పెట్టారు. వరుసగా ఆరో సారి లోక్ సభలో బడ్జెట్ ను ప్రవేశ పెట్టిన ఆర్థిక మంత్రిగా ఆమె రికార్డు నెలకొల్పారు. దీంతో ఆమె దివంగత, మాజీ ఆర్థిక మంత్రి మొరార్జీ దేశాయ్ తో సమానంగా నిలిచారు. లోక్ సభ ఎన్నికల కు ముందు ప్రవేశ పెట్టిన ఈ బడ్జెట్ లో అభివృద్ధి మంత్రంపైనే ఫొకస్ పెట్టారు. ఎలాంటి ప్రజాకర్షక చర్యలను ప్రకటించలేదు.
జీడీపీకి ఆర్థిక మంత్రి చెప్పిన కొత్త అర్థం ఇదే
2047 నాటికి విక్షిత్ భారత్ లక్ష్యంగా దార్శనికత, ప్రకృతితో మమేకమై, ఆధునికంగా సుసంపన్నమైన భారత్, మౌలిక సదుపాయాలు, అందరికీ అవకాశాలు అనే నినాదంతో ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్ లో ప్రత్యక్ష, పరోక్ష పన్నుల పన్ను రేట్లలో మార్పులు చేయలేదు. రూ.47.66 లక్షల కోట్లుగా ఉన్న ఈ బడ్జెట్.. రాబోయే ఐదేళ్లలో అపూర్వమైన వృద్ధిని అంచనా వేస్తూ రాబోయే సంవత్సరాలకు ఒక విజన్ నిర్మలా సీతారామన్ వివరించారు. 11.11 లక్షల కోట్ల మూలధన వ్యయ లక్ష్యాన్ని ప్రభుత్వం నిర్దేశించుకుందని తెలిపారు.బడ్జెట్ ప్రసంగంలో నిర్మలా సీతారామన్.. గత దశాబ్దంలో భారత ఆర్థిక వ్యవస్థ సాధించిన గణనీయమైన పరివర్తనను నొక్కి చెప్పారు.
బడ్జెట్ లోని హైలెట్స్..
1.సవరించిన ద్రవ్యలోటు 2023-24 (ఆర్థిక సంవత్సరం 2024) జీడీపీలో 5.8 శాతంగా ఉంది. 2025 ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యలోటు జీడీపీలో 5.1 శాతంగా ఉండొచ్చని అంచనా. 2025-26 (ఆర్థిక సంవ్సతరం 2026)లో ద్రవ్యలోటును జీడీపీలో 4.5 శాతం కంటే తక్కువకు తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకుంది.
2. ఆదాయపు పన్ను శ్లాబుల్లో ఎలాంటి మార్పులు లేవు.
Budget 2024: 'గేమ్-ఛేంజర్' ఇండియా-మిడిల్ ఈస్ట్-యూరోప్ కారిడార్ కథేంటో తెలుసా?
3. పన్ను చెల్లింపుదారుల సంఖ్య 2.4 రెట్లు పెరిగిందని నిర్మలా సీతారామన్ తెలిపారు. 2014 నుంచి ప్రత్యక్ష పన్నుల వసూళ్లు మూడు రెట్లు పెరిగాయి. 2024-25లో పన్ను రాబడులు రూ.26.02 లక్షల కోట్లుగా అంచనా వేశారు.
4. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన - గ్రామీణ్ కింద మరో 2 కోట్ల ఇళ్లను ఆర్థిక మంత్రి ప్రకటించారు.
5. 50 ఏళ్ల వడ్డీ లేని రుణంతో రూ.లక్ష కోట్ల కార్పస్ ఏర్పాటు. ఈ కార్పస్ తక్కువ వడ్డీ రేట్లతో దీర్ఘకాలిక ఫైనాన్సింగ్ ను అందిస్తుంది.
లఖ్ పతి దీదీ పథకం అంటే ఏమిటి? ఎలా అప్లై చేసుకోవాలి? ఎవరు అర్హులు?
6. మన యువత శక్తిని, సాంకేతిక పరిజ్ఞానాన్ని మేళవించే కార్యక్రమాలకు ఊతం. రక్షణ అవసరాల కోసం డీప్ టెక్ టెక్నాలజీని బలోపేతం చేయడానికి, ఆత్మనిర్భరతను వేగవంతం చేయడానికి కొత్త పథకం ప్రారంభించనున్న కేంద్రం.
7. పీఎం స్వానిధి ద్వారా మరో 2.3 లక్షల మందికి కొత్త రుణాలు.
గుడ్ న్యూస్ చెప్పిన కేంద్రం.. నెలకు 300 యూనిట్ల ఉచిత విద్యుత్
8. గడిచిన పదేళ్లలో ఉన్నత విద్యలో 28 శాతం పెరిగిన మహిళల నమోదు. ట్రిపుల్ తలాక్ ను చట్టవిరుద్ధం చేయడం, లోక్ సభ, రాష్ట్రాల అసెంబ్లీల్లో మహిళలకు 1/3వ వంతు రిజర్వేషన్లు కల్పించడం, గ్రామీణ ప్రాంతాల్లో పీఎం ఆవాస్ యోజన కింద 70 శాతానికి పైగా ఇళ్లను మహిళలకు కేటాయించడం వల్ల వారి గౌరవం పెరిగిందని ఆర్థిక మంత్రి తెలిపారు.
9. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి (ఎన్ఆర్ ఈజీఎస్) ఆర్థిక మంత్రి రూ. 86 వేల కోట్లు కేటాయించారు.
10. ఆరోగ్య భద్రత కల్పించే ఆయుష్మాన్ భారత్ పథకానికి రూ. 7,500 కోట్లు కేటాయించారు. ఈ పథకాన్ని ఆశా వర్కర్లు, అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లందరికీ వర్తింపజేస్తామని ఆర్థిక మంత్రి వెల్లడించారు.
భారత్ ప్రపంచ శక్తిగా ఎదుగుతోంది.. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్
11. పారిశ్రామిక రంగానికి ప్రోత్సాహకాలు అందించేందుకు రూ. 6,200 కోట్లు కేటాయించారు. అలాగే సెమీ కండక్టర్స్, డిస్‌ప్లే ఎకో వ్యవస్థల తయారీ రంగానికి రూ. 6,903 కోట్లును ఆర్థిక మంత్రి కేటాయించారు. సోలార్ ఎలక్ట్రిసిటీ గ్రిడ్ కోసం రూ. 8,500 కోట్లు కేటాయించగా.. గ్రీన్ హైడ్రోజన్ మిషన్ కోసం రూ. 600 కోట్లను కేంద్ర ఆర్థిక మంత్రి కేటాయించారు.
12. దేశంలో 7 కొత్త IITలు మరియు 7 కొత్త IIMల ప్రారంభం. దేశంలో 15 కొత్త ఎయిమ్స్ ఏర్పాటు.
13. గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ నివారణకు వ్యాక్సినేషన్.
14.3 రైలు కారిడార్లను ప్రారంభం.వందేభారత్ తరహాలో 40 వేల రైల్వే బోగీలను తయారీ.
15. లక్షద్వీప్‌కు ప్రత్యేక పథకాలు
16. ఎలక్ట్రిక్ వాహనాలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి.
ఆర్థిక మంత్రి బడ్జెట్ ప్రసంగంలో చెప్పిన ప్రజ్ఞానంద ఎవరు?
17. యూరియా సబ్సిడీకి రూ.164000 కోట్లు ప్రకటన.
18. మత్స్య సంపద యోజన కింద 55 లక్షల మందికి ఉపాధి
19. వచ్చే 50 ఏళ్లకు లక్ష కోట్ల రూపాయల వడ్డీ లేని రుణాలు ఇవ్వాలని ప్రభుత్వ లక్ష్యం.
20. బ్లూ ఎకానమీ 2.0 కింద కొత్త పథకం ప్రారంభం.