Asianet News TeluguAsianet News Telugu

రిషి సునాక్ యూకే పీఎం కావడంపై మామ నారాయణ మూర్తి ఫస్ట్ రియాక్షన్ ఇదే

యూకే పీఎంగా రిషి సునాక్ అయిన తర్వాత ఆయన మామా ఇన్ఫోసిస్ వ్యవస్థాపకులు నారాయణ మూర్తి స్పందించారు. ఆయన పట్ల తాము గర్విస్తున్నాం అంటూ కామెంట్ చేశారు.
 

infosys narayana murthy first reaction on rishi sunak becoming UK PM
Author
First Published Oct 25, 2022, 7:49 PM IST

న్యూఢిల్లీ: భారత సంతతి రిషి సునాక్ యూకే నూతన ప్రధానమంత్రి అయ్యారు. ఆయన ఇన్ఫోసిస్ వ్యవస్థాపకులు నారాయణ మూర్తికి అల్లుడు. నారాయణ మూర్తి కూతురు అక్షతను రిషి సునాక్ వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు ఇద్దరు కుమార్తెలు. రిషి సునాక్ యూకే పీఎం కావడంపై భారత దేశంలో సంబురాలు వెల్లివిరుస్తున్నాయి. ఈ నేపథ్యంలో రిషి సునాక్ యూకే పీఎం కావడంపై మామ నారాయణ మూర్తి కూడా రియాక్ట్ అయ్యారు. ఆయన ఫస్ట్ రియాక్షన్ ఇలా ఉన్నది.

‘రిషి నీకు అభినందనలు. ఆయన పట్ల మేం గర్విస్తున్నాం. ఆయనకు జయం కలుగాలని కోరుకుంటున్నాం’ అని నారాయణ మూర్తి తన ఫస్ట్ రియాక్షన్ ఇచ్చారు. యూకే ప్రజల కోసం ఆయన తన శాయశక్తుల కృషి చేస్తారని తాము సంపూర్ణ విశ్వాసంతో ఉన్నామని తెలిపారు.

Also Read: యూకేను చూసి నేర్చుకోవాలి.. మైనార్టీలను ప్రస్తావిస్తూ చిదంబరం, శశిథరూర్ కామెంట్లు.. కాంగ్రెస్ వివరణ

అక్షతా మూర్తికి ఇన్ఫోసిస్‌లో భారీగా షేర్లు ఉన్నాయి. దీంతో 2022  లో అక్షతా మూర్తి తన వాటాలపై డివిడెండ్‌ రూపంలో రూ.126.61 కోట్ల ఆదాయం సొంతం చేసుకున్నారు. వివరాలు.. స్టాక్ ఎక్స్ఛేంజీలకు ఇన్ఫోసిన్ కంపెనీ దాఖలు చేసిన సమాచారం ప్రకారం అక్షతా మూర్తి కంపెనీ లో  0.93 శాతం వాటా లేదా  3.89 కోట్ల షేర్లు కలిగి ఉన్నారు. బీఎస్‌ఈలో మంగళవారం ట్రేడింగ్ ధర రూ. 1,527.40 వద్ద ఆమె హోల్డింగ్ విలువ రూ. 5,956 కోట్లు (దాదాపు $721 మిలియన్లు)కు సమానం.

ఇన్ఫోసిస్ ఈ ఏడాది మే 31న 2021-22 ఆర్థిక సంవత్సరానికి ఒక్కో షేరు కు రూ. 16 తుది డివిడెండ్ చెల్లించింది. ప్రస్తుత సంవత్సరానికి.. రూ. 16.5 మధ్యంతర డివిడెండ్‌ను చెల్లించనున్నట్టుగా సంస్థ ఈ నెలలో ప్రకటించింది. ఈ రెండు డివిడెండ్‌ లను కలుపుకుంటే.. ఒక్కో షేరుపై రూ.32.5 లభించాయి. ఈ లెక్కన డివిడెండ్‌ల రూపంలోనే అక్షతా మూర్తి రూ.126.61 కోట్లను సంపాదించారు.

Follow Us:
Download App:
  • android
  • ios