శ్రీనగర్‌లో జరిగిన G-20 సమావేశం సందర్భంగా బ్రిటీష్-అరేబియన్ ఇన్‌ఫ్లుయెన్సర్ అజ్మద్ తాహా.. జమ్మూ, కాశ్మీర్‌లోని పిల్లలతో ఇంటరాక్ట్ అయి.. తన అనుభవాన్ని పంచుకున్నారు. ఇందుకు సంభవించిన ఓ వీడియో నెట్టింట్లో తెగ వైరలవుతోంది. కేవలం గంట వ్యవధిలోనే వేలాది వ్యూస్ వచ్చాయి.
శ్రీనగర్‌లో జరిగిన G-20 సమావేశం సందర్భంగా బ్రిటీష్-అరేబియన్ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ అజ్మద్ తాహా జమ్మూ కాశ్మీర్‌లో పర్యటించారు. ఈ జమ్మూ కాశ్మీర్‌లో ఏదో ప్రత్యేకత కనిపిస్తుందంటూ.. చాలా ప్రశంసించారు. ఆర్టికల్ 370ని రద్దు చేసిన తర్వాత భూమిపై స్వర్గంగా పిలుచుకునే జమ్మూకాశ్మీర్ పరిస్థితి ఎలా ఉందో చూడడానికి అమ్జద్ తాహా గతంలో జమ్మూ కాశ్మీర్ పర్యటనకు వచ్చారు. ఇందుకు సంబంధించి తహా చేసిన పోస్ట్‌లు లేదా వీడియోలు సోషల్ మీడియాలో సందడి చేస్తున్నాయి. నెట్టింట్లో వైరల్ గా మారాయి. తాజాగా.. ఆయన జమ్మూ కాశ్మీర్‌లో పిల్లలతో సంభాషించిన ఓ వీడియోను పోస్టు చేశారు. ఇందుకు సంబంధించిన కూడా తెగవైరల్ అవుతుంది. ఆర్టికల్ 370ని రద్దు అనంతర తనకు ఎదురైన అనుభవాలను పంచుకున్నారు. ఇందుకు సంబంధించిన ఓ వీడియో కేవలం ఒక గంటలో వేలాది మంది చూశారు.
వైరల్ అవుతున్న వీడియోలొ ఇంతకీ ఏముందంటే.. బ్రిటిష్-అరబ్ ఇన్‌ఫ్లుయెన్సర్ అమ్జద్ తాహా తన పర్యటన సందర్భంగా జమ్మూ కాశ్మీర్ పిల్లలతో సంభాషించిన వీడియోను పోస్టు చేస్తూ.. ఇలా రాసుకొచ్చారు.'ఎక్కడ నుండి వచ్చారని పిల్లలను నేను అడిగాను. అందుకు బదులిస్తూ.. తాను కాశ్మీర్‌లో నివసిందే భారతీయ ముస్లింలమని వారు గర్వంగా చెప్పారు.అలాగే.. జీ20కి కాశ్మీర్‌ను ఎంపిక చేసినందుకు భారత్‌ను అభినందిస్తున్నాను. వైవిధ్యాన్ని ఆలింగనం చేసుకోవడం, భవిష్యత్తు కోసం నిర్మించడం, మతోన్మాదులకు ధీటుగా నిలబడడంలో భారత ఆదర్శంగా నిలుస్తోంది. కశ్మీర్ వేదికగా జరిగే G20 ప్రకృతి, మానవత్వాన్ని రక్షించడంలో భారత్ కు ప్రత్యేక ఉందని అన్నారు. తన పోస్ట్‌తో పాటు జమ్మూ కాశ్మీర్‌లో నివసిస్తున్న పలువురు పిల్లల చిత్రాన్ని కూడా ఉంచారు.
అంతముందుకు.. మే ప్రారంభంలో జమ్మూ కాశ్మీర్‌లో జరిగిన G20 టూరిజం వర్కింగ్ గ్రూప్ సమావేశానికి అమ్జద్ తాహా హాజరయ్యారు. అమ్జద్ తాహా.. బ్రిటీష్-బహ్రెయిన్ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్. మే ప్రారంభంలో జమ్మూ కాశ్మీర్‌లో జరిగిన G20-టూరిజం వర్కింగ్ గ్రూప్ సమావేశానికి ఆయన హాజరయ్యారు. సమావేశానికి ముందు ఆయన కాశ్మీర్‌లోని హిందువులు, ముస్లింలు, సిక్కులు, క్రైస్తవులతో మాట్లాడారు. సామాజిక మాధ్యమాల్లో తమ శాంతియుత సహజీవనం, పరస్పర సోదరభావం గురించి మాట్లాడుకున్నారు. అంతే కాదు కాశ్మీర్ అందాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ.. ఈ ప్రదేశం ప్రపంచాన్ని కాపాడుతోందని తెలిపాడు. వాతావరణ మార్పులకు జమ్మూ కాశ్మీర్ ఒక ముఖ్యమైన ఉదాహరణ అని పేర్కొన్నారు.
