ఉరీ సెక్టార్‌లో చొరబాటు యత్నం.. ఇద్దరు ఉగ్రవాదులను మట్టుబెట్టిన భారత బలగాలు..
జమ్మూ కాశ్మీర్ బారాముల్లా జిల్లాలోని ఉరీ సెక్టార్‌లో నియంత్రణ రేఖ (ఎల్‌ఓసీ) వెంబడి చొరబాటుకు యత్నించిన ఇద్దరు ఉగ్రవాదులను భద్రతా బలగాలు మట్టుబెట్టాయి.
జమ్మూ కాశ్మీర్ బారాముల్లా జిల్లాలోని ఉరీ సెక్టార్‌లో నియంత్రణ రేఖ (ఎల్‌ఓసీ) వెంబడి చొరబాటుకు యత్నించిన ఇద్దరు ఉగ్రవాదులను భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. అయితే ఉగ్రవాదుల మృతదేహాలను చొరబాటు బృందం నియంత్రణ రేఖకు అవతలి వైపుకు తీసుకెళ్లిందని ఆర్మీ ఒక ప్రకటనలో తెలిపింది. ఘటన స్థలం నుంచి ఆరు పిస్టల్స్, నాలుగు హ్యాండ్ గ్రెనేడ్లు స్వాధీనం చేసుకున్నట్టుగా తెలిపింది. ఉరీ సెక్టార్‌లోకి భారీగా ఆయుధాలతో ఉగ్రవాదులు ఎల్‌ఓసీ మీదుగా చొరబడవచ్చనే ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు, జమ్మూ కశ్మీర్ పోలీసుల నుంచి వచ్చిన నిర్దిష్ట ఇన్‌పుట్‌ల ఆధారంగా భద్రతా బలగాలు అప్రమత్తమైనట్టుగా ఆర్మీ వర్గాలు తెలిపాయి.
భద్రతా బలగాలు హై అలర్ట్‌లో ఉండి.. ఉగ్రవాదుల చొరబాటు యత్నాలపై నిఘా ఉంచాయి. ఈ క్రమంలోనే చొరబాటు మధ్యాహ్నం సమయంలో ఉగ్రవాదుల చొరబాటు యత్నాన్ని భద్రతా బలగాలు గుర్తించాయి. దీంతో భద్రతా బలగాలకు, ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎదురుకాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులను భద్రతా బలగాలు మట్టుబెట్టాయి.
‘‘అక్టోబర్ 21న భారత సైన్యం, జమ్మూ కాశ్మీర్ పోలీసులు, ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు ప్రారంభించిన సంయుక్త ఆపరేషన్‌లో.. బారాముల్లాలోని ఉరీ సెక్టార్‌లోని నియంత్రణ రేఖ వెంబడి చొరబాటు ప్రయత్నాన్ని విఫలం చేశాయి’’ అని భారత సైన్యానికి చెందిన చినార్ కార్ప్స్ ఎక్స్ (ట్విట్టర్)లో పేర్కొంది.