వీడియో కాన్పరెన్స్ ద్వారా దేశంలో మొదటి మొబైల్ వైరాలజీ ల్యాబ్ ప్రారంభం

భారత్‌లో తొలి సారిగా రూపొందించిన మొబైల్ వైరాలజీ ల్యాబ్ ను  కేంద్ర మంత్రులు రాజ్ నాథ్ సింగ్, సంతోష్ గంగ్వార్, కిషన్ రెడ్డి, రాష్ట్ర మంత్రి కిషన్ రెడ్డిలు గురువారం నాడు ప్రారంభించారు.

Indias First Mobile Virology Lab Launched by ministers through video conference

హైదరాబాద్: భారత్‌లో తొలి సారిగా రూపొందించిన మొబైల్ వైరాలజీ ల్యాబ్ ను  కేంద్ర మంత్రులు రాజ్ నాథ్ సింగ్, సంతోష్ గంగ్వార్, కిషన్ రెడ్డి, రాష్ట్ర మంత్రి కిషన్ రెడ్డిలు గురువారం నాడు ప్రారంభించారు.

గురువారం నాడు మధ్యాహ్నం వీడియో కాన్పరెన్స్ ద్వారా మొబైల్ వైరాలజీ ల్యాబ్ ను ప్రారంభించారు మంత్రులు. డీఆర్‌డీఓ, ఈఎస్ఐలు సంయుక్తంగా ఈ ల్యాబ్ ను ప్రారంభించాయి.

వైరాలజీ ల్యాబ్ ను సంయుక్తంగా డెవలప్  చేసిన మెయిల్ అనుబంధ సంస్థ ఐకాన్.  తెలంగాణకు చెందిన చెందిన డాక్టర్ మధు మోహన్ రావు రూపకల్పనలో మొబైల్ వైరాలజీ ల్యాబ్ ఏర్పాటు చేశారు.

ఈ సందర్భంగా వీడియో కాన్పరెన్స్ ద్వారా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడారు.ప్రపంచ వ్యాప్తంగా కరోనాతో  విపత్కర పరిస్థితులు నెలకొన్నాయన్నారు కిషన్ రెడ్డి. కరోనాను సమర్థవంతంగా ఎదుర్కొంటున్నట్టుగా చెప్పారు. కరోనాను ఎదుర్కోనేందుకు డీఆర్‌డీఓ తన వంతు పాత్ర పోషించడాన్ని ఆయన అభినందించారు. వైరాలజీ ల్యాబ్ ఏర్పాటులో కృషి చేసిన  శాస్త్రవేత్తలను కేంద్ర మంత్రి అభినందించారు.

ఈ ల్యాబ్ ద్వారా రోజుకు రెండు వేలకు పరీక్షలు చేసేందుకు అవకాశం ఉందన్నారు. పది రోజుల్లో ఈ ల్యాబ్ ను అంతర్జాతీయ ప్రమాణాలతో తయారు చేయడాన్ని ఆయన అభినందించారు.

దేశంలో 304 టెస్టింగ్ ల్యాబ్స్ అందుబాటులోకి వచ్చిన విషయాన్ని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గుర్తు చేశారు.దేశంలో ప్రత్యేకంగా 755 కరోనా ఆసుపత్రులను ఏర్పాటు చేశామన్నారు.

దేశానికి అవసరమైన పీపీఈ కిట్స్ ను తయారు చేస్తున్నట్టుగా చెప్పారు. వెంటిలేటర్లను కూడ దేశంలోనే తయారు చేస్తున్న విషయాన్ని ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు. దేశంలోని పలు రాష్ట్రాల్లో తబ్లీగీ జమాత్ కారణంగా  ఎక్కువ కేసులు నమోదయ్యాయన్నారు.

also read:ముస్లిం డెలీవరీ బాయ్ నుండి సరుకులు తీసుకొనేందుకు నో చెప్పిన వ్యక్తి అరెస్ట్

గ్రామీణ ప్రాంత ప్రజలు కరోనాను ఎదుర్కొనేందుకు ఐక్యంగా ముందుకు వస్తున్నారన్నారు. పట్టణ ప్రాంత ప్రజలు రోడ్లపైకి రాకుండా ఉండాలని కేంద్ర మంత్రి సూచించారు.

తెలంగాణ రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ రెండు వారాల్లో లోపుగానే  ఈ వైరాలజీ ల్యాబ్ ను తయారీలో కృషి చేసిన  ప్రతి ఒక్కరిని ఆయన అభినందించారు.

కరోనాపై సాగుతున్న సమయంలో రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంతో సమన్వయంతో పనిచేస్తోందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం త్రిముఖ వ్యూహాంతో కరోనాను ఎదుర్కొనే చర్యలు తీసుకొందన్నారు.

లాక్ డౌన్ కారణంగా  పేదలకు ఇతర రాష్ట్రాల నుండి వచ్చిన వలసకూలీలకు బియ్యంతో పాటు రూ. 1500 నగదును ఇచ్చినట్టుగా కేటీఆర్ చెప్పారు.గచ్చిబౌలిలో 1500 పడకలతో కరోనాకు ప్రత్యేక ఆసుపత్రిని ఏర్పాటు చేశామన్నారు. రాష్ట్రంలోని 8 చోట్ల కూడ కరోనా కోసం ప్రత్యేక ఆసుపత్రులను ఏర్పాటు చేశామన్నారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios