ముస్లిం డెలీవరీ బాయ్ నుండి సరుకులు తీసుకొనేందుకు నో చెప్పిన వ్యక్తి అరెస్ట్
మహారాష్ట్రలోని థానే జిల్లాలో కాశ్మీర ప్రాంతంలో గజానన్ చతుర్వేది ముస్లిం వ్యక్తి నుండి వస్తువులు డెలీవరీ తీసుకొనేందుకు నిరాకరించడంతో పోలీసులు అరెస్ట్ చేశారు.
థానే:మహారాష్ట్రలోని థానే జిల్లాలో కాశ్మీర ప్రాంతంలో గజానన్ చతుర్వేది ముస్లిం వ్యక్తి నుండి వస్తువులు డెలీవరీ తీసుకొనేందుకు నిరాకరించడంతో పోలీసులు అరెస్ట్ చేశారు.
గజానన్ చతుర్వేదిపై పోలీసులు ఐపీసీ 295 ఐపీసీ సెక్షన్ (ఏ) ప్రకారంగా కేసు నమోదు చేసినట్టుగా పోలీసులు తెలిపారు.
చతుర్వేది కొన్ని వస్తువులను ఆన్‌లైన్ లో బుక్ చేశారు. ఈ వస్తువులను డెలీవరీ చేసేందుకు ముస్లిం వ్యక్తి చతుర్వేది ఇంటికి మంగళవారం నాడు ఉదయం వచ్చాడు. వస్తువులు డెలీవరీ చేసేందుకు వచ్చిన వ్యక్తిని చతుర్వేది పేరు అడిగాడు.ఈ పేరు ముస్లిం పేరుగా గుర్తించిన చతుర్వేది తీవ్రంగా స్పందించారు.
తాను ముస్లింల నుండి తాను ఏమీ తీసుకోనని చతుర్వేది చెప్పాడు.దీంతో డెలీవరీ బోయ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఫిర్యాదు మేరకు చతుర్వేదిపై కేసు నమోదు చేసినట్టుగా సీనియర్ ఇన్స్‌పెక్టర్ సంజయ్ హాజారే చెప్పారు. ఈ ఘటనకు సంబంధించిన ఇంకా వివరాలు అందాల్సి ఉంది.
also read:ఇండియాపై కరోనా దెబ్బ: 21,393కి చేరిన మొత్తం కేసులు
దేశంలో గురువారం నాటికి 23,393కి కరోనా కేసులు చేరుకొన్నాయి. మహారాష్ట్రలో కరోనా కేసులు 5,221కి చేరాయి. కరోనా వైరస్ వ్యాప్తి చేసేందుకు కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నాయి.