Coronavirus: కరోనా థర్డ్ వేవ్.. దేశంలో నాలుగు కోట్లు దాటిన కోవిడ్ కేసులు
Coronavirus: భారత్ కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. పలు రాష్ట్రాల్లో కోవిడ్-19 విలయతాండవం చేస్తున్నది. కరోనా మహమ్మారి థర్డ్ వేవ్ లో ఇప్పటికే 50 లక్షలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. మొత్తంగా దేశంలో కరోనా కేసులు 4 కోట్ల మార్కును దాటాయి.
Coronavirus: కరోనా మహమ్మారి కొత్త వేరియంట్ ఒమిక్రాన్ విజృంభణ కొనసాగుతున్నది. దీని కారణంగా ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. కోవిడ్-19 కారణంగా ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య కూడా అధికమవుతున్నది. చాలా దేశాల్లో నిత్యం లక్షల్లో కొత్త కేసులు నమోదవుతున్నాయి. భారత్ లోనూ కరోనా ప్రభావం పెరుగుతోంది. రోజువారీ కేసులు మూడు లక్షల మార్కును దాటాయి. చాలా రాష్ట్రాల్లో కొత్తగా కరోనా వైరస్ (Coronavirus) బారినపడుతున్న వారి సంఖ్య అధికంగా పెరుగుతున్నది. పలు రాష్ట్రాల్లో కోవిడ్-19 విలయతాండవం చేస్తున్నది. కరోనా మహమ్మారి థర్డ్ వేవ్ లో ఇప్పటికే 50 లక్షలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. మొత్తంగా దేశంలో కరోనా కేసులు 4 కోట్ల మార్కును దాటాయి.
అత్యంత వేగంగా విస్తరిస్తున్న కరోనా వేరియంట్ ఒమిక్రాన్ కారణంగా దేశంలో కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. కరోనా థర్డ్ వేవ్ ప్రారంభమైన గత మూడు వారాల వ్యవధిలోనే 50 లక్షల మంది కరోనా మహమ్మారి బారినపడటం దేశంలో కరోనా విజృంభణకు అద్దం పడుతున్నది. ఈ క్రమంలో దేశంలో మొత్తం కోవిడ్-19 పాజిటివ్ కేసులు నాలుగు కోట్ల మార్కును దాటాయి. దీంతో ప్రపంచంలోనే అత్యధిక కేసులు నమోదైన రెండో దేశంగా భారత్ నిలిచింది. ఇక ప్రపంచంలో అత్యధిక కేసులు నమోదైన దేశంలో అమెరికా ఉంది. అక్కడ ఇప్పటివరకు మొత్తం 7.3 కోట్ల కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి. 2021 జూన్ 22 దేశంలో కరోనా మహమ్మారి సెకండ్ వేవ్ తగ్గుముఖం పట్టినప్పుడు భారతదేశం మొత్తం కేసుల సంఖ్య 3 కోట్లకు చేరుకుంది. కరోనా సెకండ్ వేవ్ సమయంలో దేశంలో ఒక కోటి కేసులు వేగంగా పెరిగాయి. ఈ సంఖ్య కేవలం 40 రోజుల్లో 2 కోట్ల నుండి 3 కోట్లకు పెరిగింది.
ప్రస్తుతం రోజువారి కరోనా కేసులు సైతం క్రమంగా పెరుగుతూనే ఉన్నాయి. మంగళవారం నాడు దేశంలో 571 కరోనా మరణాలు నమోదయ్యాయి.రోజువారీ మరణాలు ఒక రోజులో 27% పెరిగాయి. 2021 ఆగస్టు 25 అధికంగా 603 మరణాలు నమోదైన ఐదు నెలల్లో అత్యధిక రోజువారీ మరణాలు ఇవే కావడం గమనార్హం. గత 24 గంటల్లో కరోనా కొత్త మరణాల మరింతగా పెరిగాయి. కొత్తగా 2.85 లక్షల కోవిడ్-19 కేసులు నమోదయ్యాయి. అలాగే, 665 మంది వైరస్ తో పోరాడుతూ ప్రాణాలు కోల్పోయారు. అంతకు ముందు రోజుతో పోలిస్తే కోవిడ్ కేసులు, మరణాలు 11 శాతానికి పైగా పెరిగాయి. దేశంలో కరోనా రికవరీ రేటు (India's recovery rate) 93.23 శాతంగా ఉంది. కరోనా మరణాల రేటు 1.23 శాతంగా ఉంది. దేశంలో ఇప్పటివరకు మొత్తం 4,00,85,116 కరోనా కేసులు నమోదయ్యాయి. అలాగే, 4,91,127 మరణాలు సంభవించాయి. ప్రస్తుతం మహరాష్ట్ర, కర్నాటక, కేరళ, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, గుజరాత్, రాజస్థాన్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో కరోనా కేసులు అధికంగా నమోదవుతున్నాయి.
దక్షిణాది రాష్ట్రమైన కేరళలో కరోనా పంజా విసురుతోంది. గత 24 గంటల్లో అక్కడ 50 వేలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. మరణాలు సైతం అక్కడే అధికంగా వెలుగుచూస్తున్నాయి. మొత్తంగా కరోనా కేసులు, మరణాలు అధికంగా నమోదైన రాష్ట్రాల జాబితాను గమనిస్తే.. మహారాష్ట్ర, కేరళ, కర్నాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, వెస్ట్ బెంగాల్, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, ఒడిశా, ఛత్తీస్‌గఢ్, గుజరాత్ లు టాప్‌లో ఉన్నాయి.