న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసులు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. గత 24 గంటల్లో దేశంలో 86, 507 కరోనా కేసులు నమోదయ్యాయి.దీంతో దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 57 లక్షల 32 వేల 518కి చేరింది.

దేశంలో ఇప్పటివరకు కరోనా సోకి 46 లక్షల 74 వేల మంది కోలుకొన్నట్టుగా కేంద్ర ప్రభుత్వం గురువారం నాడు ప్రకటించింది.ఇంకా 9 లక్షల 86 వేల యాక్టివ్ కేసులున్నట్టుగా ప్రభుత్వం తెలిపింది. 

నిన్న ఒక్క రోజే 86 వేల మంది కరోనా నుండి కోలుకొన్నారు. కరోనా సోకి మరణిస్తున్న వారి సంఖ్య ఏ మాత్రం తగ్గడం లేదు.  కరోనా సోకి మరణించిన వారి సంఖ్య గత 24 గంటల్లో వెయ్యి కి చేరింది. కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య దేశంలో 91,149కి చేరింది.కరోనాతో మరణిస్తున్నవారిలో అత్యధికంగా ఇతర సమస్యలు ఉన్నవారేనని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. 

మరో వైపు దేశంలో కరోనా రోగుల రికవరీ రేటు రోజు రోజుకు పెరిగిపోతోంది. రికవరీ రేటు పెరగడంతో వైద్య నిపుణులు ఊపిరి పీల్చుకొంటున్నారు. దేశంలో కరోనా బాధితుల రికవరీ రేటు  81.55 శాతం ఉంది. మరో వైపు మరణాల రేటు 1.50 శాతంగా ఉన్నట్టుగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.