#boycottmaldives : భారతీయులను అవమానించిన మాల్దీవ్స్ ... భారీ మూల్యం చెల్లించుకుంటోందిగా..!

భారత ప్రధాని నరేంద్ర మోదీ లక్షద్వీప్ పర్యటన దేశ పర్యాటక రంగానికి మరింత ఊపు తెచ్చింది. ఇదే క్రమంలో మాల్దీవ్స్ మంత్రి ఒకరు భారతీయులను అవమానించేలా మాట్లాడి ఆ దేశ పర్యాటకరంగాన్నే చిక్కుల్లోకి నెట్టాడు. 

 Indians cancel their holiday trip to Maldives AKP

హైదరాబాద్ : భారతదేశాన్ని తక్కువచేస్తూ అవమానించే మాట్లాడిన మాల్దీవ్స్ మంత్రి తమ దేశ టూరిజాన్ని ప్రమాదంలోకి నెట్టాడు. దేశంలో టూరిజాన్ని ప్రోత్సహించే ఉద్దేశ్యంతో ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల లక్షద్వీప్ లో పర్యటించి అక్కడి ప్రకృతి, సముద్ర తీర అందాలను ప్రపంచానికి చూపించాడు. దీంతో ఎక్కడ తమ పర్యాటక రంగం దెబ్బతింటుందోనని భయపడిపోయిన మాల్దీవ్స్ మంత్రి జాహిద్ రమీజ్ భారతదేశంపై అనుచిత వ్యాఖ్యలు చేసాడు. ఈ వ్యాఖ్యలతో మాల్దీవ్స్ కు ఎలాంటి లాభం జరక్కపోగా పర్యాటక రంగం దెబ్బతినే పరిస్థితి నెలకొంది. 

భారతీయులను అవమానించేలా మాల్దీవ్స్ మంత్రి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. దీంతో ఇప్పటికే సరదాగా మాల్దీవ్స్ పర్యటనకు వెళ్లాలని భావించిన భారతీయులు పునరాలోచన చేస్తున్నారు. ఆ దేశ మంత్రి అహంపూరిత కామెంట్స్ కు సమాధానంగా తమ హాలిడే ట్రిప్ ను క్యాన్సిల్ చేసుకుంటున్నారు. అంతేకాదు మాల్దీవ్స్ కు బదులు లక్షద్వీప్ కు వెళుతున్నామని సోషల్ మీడియా ద్వారా తెలియజేస్తున్నారు. #boycottmaldives హ్యాష్ ట్యాగ్ ను ఉపయోగించడంతో ఇదికాస్త సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ఇలా భారతీయులను అవమానించేలా వ్యవహరించిన మాల్లీవ్స్ కు భారతీయులు తగిన గుణపాఠం చెబుతున్నారు. 

 

భారత దేశంలోనే అద్భుతమైన సముద్ర అందాలుండగా మాల్దీవ్స్ కు వెళ్లడం ఎందుకు? అందుకే లక్షద్వీప్ కు హాలిడే ట్రిప్ ప్లాన్ చేసినట్లు కొందరు సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా వెల్లడిస్తున్నారు. మరికొందరయితే మాల్దీవ్స్ ట్రిప్ ను రద్దుచేసుకున్న వివరాలను సైతం పెడుతున్నారు. ఆత్మాభిమానం కలిగినవారు ఇకపై మాల్దీవ్స్ వైపు కన్నెత్తి చూడకూడదని సూచిస్తున్నారు. దేశంలోనే అనేక అందమైన ప్రాంతాలు వున్నాయని... కుటుంబం, స్నేహితులతో కలిసి వెళ్ళి ఆ  అందాలను ఆస్వాదించాలని సూచిస్తున్నారు. 

అసలు మాల్దీవ్స్ మంత్రి ఏమన్నాడంటే : 

ఇటీవల లక్షద్వీప్ పర్యటనలో అక్కడి ప్రకృతి అందాలకు ముగ్దుడైన ప్రధాని కొన్ని ఫోటోలను సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. ముఖ్యంగా సముద్ర ఒడ్డున అందాలను, సముద్రంలో స్వయంగా చేసిన సాహసాలను పోస్ట్ చేసారు. ఇలా మన దేశంలో పర్యాటక రంగం అభివృద్దికి ప్రధాని చేసిన పని మాల్దీవ్స్ సర్కార్ కు నచ్చనట్లుంది. దీంతో దేశంపై అక్కసు వెల్లగక్కుతూ.... ప్రజలను అవమానిస్తూ ఆ దేశ మంత్రి రమీజ్ సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేసారు. పర్యాటక రంగంలో భారత్ తమతో పోటీ పడలేదని... ఇది వారి భ్రమ అంటూ రాసుకొచ్చాడు. మాల్దీవ్స్ అందించే సేవలకు భారత ప్రజలు అదించలేరని... వాళ్లు ఇంత శుభ్రంగా వుండలేరని అన్నాడు.  భారత ప్రజల ఇళ్లలో ఎప్పుడూ దుర్వాసన వస్తుంటుంది అంటూ అవమానకరంగా కామెంట్స్ చేసాడు. ఇలా మాల్దీవ్స్ మంత్రి వ్యాఖ్యలపై గరం అవుతున్న భారతీయుులు ఆ దేశ పర్యటనను రద్దు చేసుకుంటున్నారు. 

Also Read  మోడీ లక్షద్వీప్ పర్యటన.. మాల్దీవ్స్ అధికార పార్టీ నేత జాత్యహంకార వ్యాఖ్యలు , మా పవర్ చూపిస్తామన్న భారతీయులు

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios