వీసా లేకుండానే భారతీయులు ఖతార్, ఒమన్ సహా 55 దేశాలకు ప్రయాణించవచ్చు..
Indian passport: హెన్లీ పాస్‌పోర్ట్ ఇండెక్స్ 2023 లో భారత్ తన ర్యాంకును మరింత మెరుగుపర్చుకుంది. ఇప్పుడు భారతీయ పౌరులు 57 దేశాలకు వీసా లేకుండా ప్రయాణించవచ్చు. 57 గమ్యస్థానాలకు వీసా రహిత ప్రయాణాన్ని అనుమతిస్తూ పాస్ పోర్టు ర్యాంకింగ్ ను మెరుగుపర్చుకుని 80వ స్థానంలో నిలిచింది.

Henley Passport Index 2023: భారత పాస్‌పోర్ట్ హోల్డర్లు ఇకపై ఒమన్, ఖతార్ సహా 57 దేశాలకు వీసా లేకుండా ప్రయాణించవచ్చు. ఈ గమ్యస్థానాలు భారతీయులకు వీసా-ఫ్రీ ఎంట్రీ లేదా వీసా-ఆన్-అరైవల్ ను అందిస్తాయి. ఇటీవల విడుదలైన హెన్లీ పాస్‌పోర్ట్ ఇండెక్స్ 2023 ప్రకారం, భారతీయ పాస్‌పోర్ట్ ఇప్పుడు 80 వ స్థానంలో ఉంది. ఇది 57 దేశాలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రయాణ సౌకర్యాలను అందిస్తుంది.
ప్రపంచంలోనే అత్యంత బలమైన పాస్ పోర్టు..
ప్రపంచంలోనే టాప్ ర్యాంక్ పాస్ పోర్టు లేదా బలమైన పాస్ పోర్టు సింగపూర్ కు చెందినదనీ, దాని హోల్డర్లు అత్యధిక గ్లోబల్ యాక్సెస్ ను అనుభవిస్తున్నారని హెన్లీ పాస్ పోర్టు ఇండెక్స్ వెల్లడించింది. సింగపూర్ పాస్‌పోర్ట్ హోల్డర్లు వీసా ఫ్రీ లేదా వీసా ఆన్ అరైవల్ ఆప్షన్లతో 192 దేశాలకు ప్రయాణించవచ్చని తెలిపింది. 190 దేశాలకు వీసా ఫ్రీ లేదా వీసా ఆన్ అరైవల్ ఆప్షన్లతో జర్మనీ ఈ జాబితాలో రెండో స్థానంలో ఉంది. ఇటలీ, స్పెయిన్ లతో ఆ దేశం రెండో ర్యాంకును పంచుకుంటోంది. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఈ జాబితాలో ఎనిమిదో స్థానంలో ఉంది.
ప్రపంచంలోని టాప్ 22 స్ట్రాంగ్ పాస్‌పోర్ట్ లు ఇవే..
- సింగపూర్
- జర్మనీ
- ఇటలీ
- స్పెయిన్,
- ఆస్ట్రియా
- ఫిన్లాండ్
- ఫ్రాన్స్
- జపాన్
- లక్సెంబర్గ్
- దక్షిణ కొరియా
- స్వీడన్
- డెన్మార్క్
- ఐర్లాండ్
- నెదర్లాండ్స్
- యునైటెడ్ కింగ్ డమ్
- బెల్జియం
- చెక్ రిపబ్లిక్
- మాల్టా
- న్యూజిలాండ్
- నార్వే
- పోర్చుగల్
- స్విట్జర్లాండ్
ఈ దేశాలకు భారతీయ పాస్‌పోర్ట్ హోల్డర్లకు వీసా రహిత ప్రయాణం..
- అల్బేనియా
- బార్బడోస్
- భూటాన్
- బొలీవియా
- బ్రిటిష్ వర్జిన్ ఐలాండ్స్
- బురుండి
- కంబోడియా
- కేప్ వెర్డే దీవులు
- కొమోరో దీవులు
- కుక్ ఐలాండ్స్
- డొమినికా
- ఎల్ సల్వడార్
- ఫిజీ
- గాబన్
- Grenada
- గినియా-బిస్సావు
- హైతీ
- ఇండోనేషియా
- ఇరాన్
- జమైకా
- జోర్డాన్
- కజకిస్తాన్
- లావోస్
- మకావు (ఎస్ఏఆర్ చైనా)
- మడగాస్కర్
- మాల్దీవులు
- మార్షల్ దీవులు
- మౌరిటానియా
- మారిషస్
- మిక్రోనేషియా
- మాంటెస్సార్రాస్
- మొజాంబిక్
- మయన్మార్
- నేపాల్
- న్యూవ్
- ఒమన్
- పలావు దీవులు
- ఖతార్
- రువాండా
- సామావో
- సెనెగల్
- సీషెల్స్
- సియెర్రా లియోన్
- సోమాలియా
- శ్రీలంక
- సెయింట్ కిట్స్ అండ్ నెవిస్
- సెయింట్ లూసియా
- సెయింట్ విన్సెంట్
- టాంజానియా
- థాయిలాండ్
- తైమూర్-లెస్టే
- టోగో
- ట్రినిడాడ్ అండ్ టొబాగో
- ట్యునీషియా
- తువాలు
- వన్వాతు
- జింబాబ్వే