ఫేస్ బుక్ ఫ్రెండ్ కోసం.. సరిహద్దు దాటి పాకిస్తాన్ వెళ్లిన భారత మహిళ
35 ఏళ్ల భారతీయ మహిళ.. తన ఫేస్‌బుక్ స్నేహితుడు(Facebook friend) నస్రుల్లా ఖాన్ కలవడానికి పాకిస్తాన్‌కు చేరుకుంది.

పాకిస్థానీ మహిళ సీమ హైదర్ విషయం దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. పాకిస్తాన్ కి చెందిన సీమా హైదర్ అనే మహిళ తన నలుగురు పిల్లలతో నేపాల్ మీదుగా ఇండియాకు వచ్చింది. ఈ విషయంలో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అదే సమయంలో రాజస్థాన్‌లోని అల్వార్ జిల్లా నుండి ఇలాంటి షాకింగ్ కేసు వెలుగులోకి వచ్చింది.అల్వార్ జిల్లాలోని భివాడి ప్రాంతానికి చెందిన అంజు అనే 35 ఏళ్ల భారతీయ మహిళ రాజస్థాన్‌లోని పాకిస్థాన్‌కు వెళ్లినట్లు సమాచారం. అంజు అసలు ఉత్తరప్రదేశ్‌కు చెందినదని చెబుతున్నారు. అంజు, ఆమె భర్త అరవింద్ అల్వార్‌లో ప్రైవేట్ ఉద్యోగాలు చేసేవారు. అంజు పాకిస్థాన్‌లోని ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్ లోని దీర్ సిటీకి చేరుకుంది.
భారతీయ మహిళ తన స్నేహితుడిని కలవడానికి పాకిస్థాన్‌లోని వాయువ్య ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌కు వచ్చినట్లు సమాచారం. ఈ మేరకు ఆదివారం పోలీసులు సమాచారం అందించారు. అంజు అనే మహిళ, 29 ఏళ్ల పాకిస్థాన్ వ్యక్తి నస్రుల్లాతో ఫేస్‌బుక్‌లో స్నేహం చేసి, ఆపై అతనితో ప్రేమలో పడిందని పోలీసులు తెలిపారు. అంజు (34) ఉత్తరప్రదేశ్‌లోని కైలోర్ గ్రామంలో జన్మించింది. ఆమె రాజస్థాన్‌లోని అల్వార్ జిల్లాలో నివసించింది. అతను ఇప్పుడు తన పాకిస్తానీ స్నేహితుడు నస్రుల్లాను కలవడానికి పాకిస్తాన్‌లోని ఖైబర్ పఖ్తుంక్వాలోని అప్పర్ దిర్ జిల్లాకి జులై 21న వెళ్లిందని సమాచారం.
వైద్య రంగంలో పనిచేస్తున్న నస్రుల్లా , అంజు కొన్ని నెలల క్రితం సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఫేస్‌బుక్‌లో స్నేహితులయ్యారని పలు మీడియా నివేదికలు చెబుతున్నాయి. అంజు ఒక నెల పాటు పాకిస్తాన్ పర్యటనలో ఉంది. ఆమె నస్రుల్లాను వివాహం చేసుకోవడానికి ఇక్కడకు రాలేదు. దాని ప్రకారం.. భారతీయ మహిళ మొదట పాకిస్తాన్ పోలీసుల అదుపులో ఉంది, అయితే ఆమె ప్రయాణ పత్రాలను జిల్లా పోలీసులు ధృవీకరించిన తర్వాత విడుదల చేశారు.
'అన్ని ప్రయాణ పత్రాలు సరైనవిగా గుర్తించిన తర్వాత ఆమె వెళ్లడానికి అనుమతించారు. దేశానికి చెడ్డపేరు తెచ్చే ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఆమెకు భద్రత కల్పించారు.సీనియర్ పోలీసు అధికారి ముష్తాక్ ఖాబ్, స్కౌట్స్ మేజర్ ఆమోదం పొందిన తర్వాత అంజు, ఆమె స్నేహితుడిని విడుదల చేసినట్లు దిర్ పోలీస్ స్టేషన్‌కు చెందిన అధికారి ఒకరు తెలిపారు. ఈ నివేదికల నేపథ్యంలో రాజస్థాన్ పోలీసుల బృందం విచారణ నిమిత్తం భివాడిలోని అంజు ఇంటికి చేరుకుంది.
జైపూర్‌కు వెళ్లే నెపంతో గురువారం ఇంటి నుంచి వెళ్లిపోయారని, అయితే ఆమె పాకిస్థాన్‌లో ఉన్నట్లు కుటుంబసభ్యులకు తెలిసిందని మహిళ భర్త అరవింద్ పోలీసులకు తెలిపారు. తన స్నేహితుడిని కలవాలని చెప్పి ఇంటి నుంచి వెళ్లిపోయిందని అరవింద్ పోలీసులకు తెలిపాడు. కొన్ని రోజుల క్రితం వాట్సాప్‌లో మాట్లాడి తాను లాహోర్‌లో ఉన్నాడని తెలిపిందంట.
తాము 2007లో పెళ్లి చేసుకున్నామని, అప్పటి నుంచి సహజీవనం చేస్తున్నామని చెప్పారు. భివాడి అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ సుజిత్ శంకర్ మీడియాతో మాట్లాడుతూ.. 'గురువారం ఇంటి నుంచి వెళ్లిపోయినట్లు అంజు భర్త తెలిపాడు. ఆమె చెల్లుబాటు అయ్యే పాస్‌పోర్ట్ ఉంది. ఈ విషయమై కుటుంబ సభ్యులు ఎలాంటి ఫిర్యాదు చేయలేదని తెలిపారు. భివాడిలోని ఓ ప్రైవేట్ సంస్థలో పనిచేస్తున్న ఈ దంపతులకు 15 ఏళ్ల బాలిక, ఆరేళ్ల కుమారుడు ఉన్నారని తెలిపారు.