Asianet News TeluguAsianet News Telugu

దేశంలోని చిన్న రైల్వే స్టేషన్‌లపై కేంద్రం ఫోకస్.. కొత్తగా పథకం, 200 స్టేషన్లలో ఆధునికీకరణ పనులు

దేశంలోని చిన్న రైల్వే స్టేషన్ల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కొత్త పథకాన్ని అందుబాటులోకి తెచ్చింది. అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్ పేరిట దేశంలోని 68 రైల్వే డివిజన్ల పరిధిలోని 200 ప్రధాన రైల్వే స్టేషన్లను ఆధునికీకరించనుంది. 
 

Indian Railways launches Amrit Bharat scheme for development of small stations
Author
First Published Dec 28, 2022, 2:29 PM IST

మారుతున్న దేశ కాలమాన పరిస్ధితులకు అనుగుణంగా రైల్వే స్టేషన్‌లను ఆధునికీకరిస్తూ ముందుకు సాగుతోంది రైల్వే శాఖ. ఇప్పటి వరకు ప్రధాన నగరాల్లోని రైల్వే స్టేషన్‌లపైనే దృష్టి సారించిన భారతీయ రైల్వేలు.. ఇకపై చిన్నా చితకా రైల్వేస్టేషన్ల అభివృద్ధిపైనా ఫోకస్ పెట్టింది. దీనిలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఓ కొత్త పథకానికి శ్రీకారం చుట్టింది. ‘‘అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్’’ పేరుతో దేశంలోని వెయ్యి ముఖ్యమైన చిన్న రైల్వే స్టేషన్లను ఆధునికీకరించాలని నిర్ణయించింది.

ఇప్పటికే ఈ పథకంలో భాగంగా ఒడిషాలోని కుర్దా రైల్వే స్టేషన్‌ను అభివృద్ధి చేసినట్లు రైల్వే శాఖ తెలిపింది. దేశంలోని 68 రైల్వే డివిజన్ల పరిధిలోని 200 ప్రధాన రైల్వే స్టేషన్లను ఆధునికీకరించేందుకు గాను రూ.10 కోట్ల నుంచి రూ.20 కోట్ల వరకు కేటాయించనుంది కేంద్రం. దశల వారీగా సదుపాయల కల్పన, హై లెవల్ ఫ్లాట్‌ ఫామ్‌ల ఏర్పాటు, వెయిటింగ్ రూమ్‌లు, పార్కింగ్, లైటింగ్ వ్యవస్థను మెరుగుపరచడం, వికలాంగులకు అవసరమైన సౌకర్యాలను కల్పించడం వంటివి చేయనుంది రైల్వే శాఖ. 

ఇదిలావుండగా.. రైల్వే ప్రాజెక్టుల అవినీతి కేసులో లాలూ ప్రసాద్ యాదవ్, ఆయన కుటుంబ సభ్యులపై సీబీఐ దర్యాప్తును తిరిగి ప్రారంభించింది. యూపీఏ -1 ప్రభుత్వంలో లాలూ యాదవ్ రైల్వే మంత్రిగా ఉన్నప్పుడు రైల్వే ప్రాజెక్టుల కేటాయింపులో అవినీతి ఆరోపణలు రావడంతో 2018 లో ఈ విషయంపై సీబీఐ ప్రాథమిక దర్యాప్తు ప్రారంభించింది.ఆరోపణలపై ఎలాంటి కేసు నమోదు కాలేదని సీబీఐ వర్గాలు చెప్పడంతో మే 2021లో దర్యాప్తు ముగిసింది. కానీ ఇప్పుడు మళ్లీ ఈ కేసును సీబీఐ ఓపెన్ చేసింది. అయితే ఈ కేసులో లాలూతో పాటు ఈ సారి ఆయన కుమారుడు, బీహార్ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్, కుమార్తెలు చందా యాదవ్, రాగిణి యాదవ్ లను సీబీఐ నిందితులుగా చేర్చింది. 

Also REad: తెలంగాణలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ సాధ్యం కాదు : మరోసారి తేల్చిచెప్పిన కేంద్రం

ముంబైలోని బాంద్రాలో రైల్వే ల్యాండ్ లీజ్ ప్రాజెక్టులు, న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ పునరుద్ధరణకు ఆసక్తి ఉన్న డీఎల్ఎఫ్ గ్రూప్ నుంచి లాలూ యాదవ్ దక్షిణ ఢిల్లీలోని ఆస్తిని లంచంగా తీసుకున్నారని సీబీఐ కేసు పేర్కొంది. కాగా.. బీహార్ లో కొంత కాలం కిందట రాజకీయ పరిణామాలు మొత్తం వేగంగా మారిపోయాయి. బీహార్ లో నితీష్ కుమార్ జేడీ(యూ),బీజేపీలు ఎన్డీఏ కుటమిగా ఏర్పడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. అయితే రెండు పార్టీలకు మధ్య విభేదాలు ఏర్పడటంతో నితీష్ కుమార్ ఎన్డీఏ నుంచి బయటకు వచ్చారు. రోజుల వ్యవధిలోనే లాలూ ప్రసాద్ యాదవ్ కు చెందిన ఆర్జేడీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. నితీష్ కుమార్ సీఎంగా, లాలూ కుమారుడు తేజస్వీ డిప్యూటీ సీఎంగా ప్రమాణస్వీకారం చేశారు. ఈ నేపథ్యంలో తాజాగా సీబీఐ కేసు మళ్లీ రీ ఓపెన్ చేయడం రాజకీయంగా ప్రధాన్యత సంతరించుకుంది.

కాగా.. ఈ ఏడాది ఆగస్టులో లాలూ ప్రసాద్‌ యాదవ్‌ కుటుంబసభ్యులు, ఆర్‌జేడీకి సంబంధించిన వ్యక్తుల స్థలాలన్నింటిపై సీబీఐ దాడులు చేసింది. బీహార్, ఢిల్లీ, హర్యానాలోని 25 ప్రాంతాల్లో దాడులు నిర్వహించారు. ఈ కేసులో అవినీతి నిరోధక చట్టం, ఐపీసీ సెక్షన్ 120బీ కింద సీబీఐ 2022 మే 18న ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసింది. ఇందులో లాలూ ప్ర‌సాద్ యాదవ్‌, ఆయన భార్య రబ్రీ దేవి, కుమార్తెలు మిసా భారతి, హేమా యాదవ్‌లతో సహా 12 మందిపై కూడా లాలూ కుటుంబానికి భూములిచ్చి ఉద్యోగాలు తీసుకున్నారని ఆరోపణలు వచ్చాయి

Follow Us:
Download App:
  • android
  • ios