ఇండియన్ రైల్వే యువతకు ఒక శుభవార్త చెప్పింది. 'ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్' పేరుతో  ఒక కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి ప్రయాణించే యువతీయువకులకు రైలు టికెట్ల బేసిక్ ధరపై 50% రాయితీని ప్రకటించింది. నెలకు రూ.5,000 కన్నా తక్కువ సంపాదిస్తున్నవారికి మాత్రమే ఈ రాయితీ వర్తిస్తుంది.

also read  అక్కడ బలవంతపు మతమార్పిడులు సర్వసాధారణం...

సెకండ్ క్లాస్, స్లీపర్ క్లాస్ రైలు టికెట్లపై ఈ రాయితీని ఉపయోగించుకోవచ్చు. అది కూడా సాధారణ రైలు సర్వీసులకు మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది. ప్రత్యేక రైళ్లు, ప్రత్యేక కోచ్‌లకు ఈ రాయితీ వర్తించదు. ఒక స్టేషన్ నుంచి మరో స్టేషన్‌కు 300 కిలోమీటర్ల కంటే దూరం ప్రయాణించే  సెకండ్, స్లీపర్ క్లాస్ మెయిల్, ఎక్స్‌ప్రెస్ రైళ్లల్లో ప్రయాణించే వారికి రాయితీతో టికెట్లను ఆఫర్ చేయనుంది భారతీయ రైల్వే.

రాయితీ కేవలం బేసిక్ ఫేర్‌పైన మాత్రమే వర్తిస్తుంది. రిజర్వేషన్ ఛార్జీలు, ఇతర ఛార్జీలు ఎప్పటిలాగే యథాతథంగా ఉంటాయి అని తెలిపింది.ఆయా రాష్ట్రాలకు చెందిన మానవ వనరుల అభివృద్ధి శాఖ సెక్రెటరీ నుంచి సూచించిన ఫార్మాట్‌లో సర్టిఫికెట్ పొందినవారు మాత్రమే రాయితీపై టికెట్లను పొందొచ్చు.

also read భర్త వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని...భార్య ఏం చేసిందంటే...

ఆ సర్టిఫికెట్‌ను చీఫ్ కమర్షియల్ మేనేజర్, డివిజనల్ కమర్షియల్ మేనేజర్ లాంటి రైల్వే అధికారులకు సమర్పించాల్సి ఉంటుంది. ఆ తర్వాత టికెట్ పై రాయితీని కల్పిస్తూ ఆదేశాలు ఇస్తారు. ఆ తర్వాత రైళ్లల్లో ప్రయాణం చేయడానికి  టికెట్ల పై రాయితీ తీసుకోవచ్చు. అయితే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, స్థానిక సంస్థలు, చట్టబద్ధమైన సంస్థలు, కార్పొరేషన్లు, ప్రభుత్వ పరిధిలోని విశ్వవిద్యాలయాల రవాణా ఖర్చులతో ప్రయాణించేవారికి ఈ రాయితీ వర్తించదు అని కూడా తెలిపింది.