తనను, తన బిడ్డను పట్టించుకోకుండా పరాయి స్త్రీతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని  ఓ మహిళ కట్టుకున్న భార్యను చంపేసింది. అనంతరం పోలీస్ స్టేషన్ కి వెళ్లి లొంగిపోయింది. ఈ సంఘటన ఒడిశా రాష్ట్రం భువనేశ్వర్ లో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... బరిపద సదర్ స్టేషన్ పరిధిలోని సిరిసొబొని గ్రామానికి చెందిన సీతా హేంబ్రమ్ కి చాలా సంవత్సరాల క్రితం బొడొ మరాండితో వివాహమైంది. వీరికి ఓ కొడుకు కూడా ఉన్నాడు. 

 భర్త తనను  నిరాకరించి మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఆ స్త్రీ మోజులో పడి తనను, బిడ్డను అంగీకరించకుండా వేధించడంతో భరించలేక పోయింది. దీంతో మనోవేదనకు గురై భర్తను హత్య చేసింది. ఈ విషయాన్ని ఆమె పోలీసుల ముందు అంగీకరించింది.  

భర్తను కత్తితో నరికి చంపేసి బాలాసోర్‌ రైల్వేస్టేషన్‌ నుంచి రైలులో బయల్దేరి రుప్సా వరకు ప్రయాణించింది. అక్కడి నుంచి మరో రైలులో బరిపద రైల్వేస్టేషన్‌కు చేరి నడుచుకుంటూ బరిపద సదర్‌ స్టేషన్‌కు చేరుకుని తాను భర్తను హత్య చేశానని లొంగిపోతున్నానని పోలీసులకు తెలిపింది.