భారత నావికా దళం రేపు ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలను నిర్వహించనుంది. ఓషియన్ రింగ్ ఆఫ్ యోగా పేరిట హిందూ మహాసముద్రానికి ఆవలి తీరంలోని మిత్ర దేశాల పోర్టుల్లో యోగా దినోత్సవ వేడుకలు నిర్వహించనుంది.
న్యూఢిల్లీ: జూన్ 21వ తేదీన ఐరాస సాధారణ సభ అంతర్జాతీయ యోగా దినోత్సవంగా గుర్తించింది. 2015 నుంచి ప్రపంచవ్యాప్తంగా యోగా దినోత్సవం జరుపుకుంటున్నారు. సముద్ర తీరాలకు ఆవాల దేశాల్లో యోగాకు అంబాసిడర్‌గా భారత నావికా దళం ఉన్నది. ఈ ఏడాది యోగా దినోత్సవాలను కూడా ఘనంగా నిర్వహించడానికి ఇండియన్ నేవీ ప్రణాళికలు వేసుకుంది. ఈ సారి ఐక్యతకు, సంఘీభావానికి సూచికగా ఓషియన్ రింగ్ ఆఫ్ యోగా కార్యక్రమం చేపడుతున్నది. రక్షణ మంత్రిత్వ శాఖ సహా ఇతర కేంద్ర ప్రభుత్వ శాఖలతో సమన్వయంలో ఈ కార్యక్రమం చేపడుతున్నది. ఈ కార్యక్రమం ప్రకారం, హిందూ మహాసముద్రంలో మోహరించి ఉన్న పడవలు మనతో సన్నిహితంగా ఉండే మిత్ర దేశాల పోర్టుల్లో యోగా శుభ సందేశాన్ని వ్యాపింపచేసే నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది యోగా దినోత్సవ థీమ్ వసుధైవ కుటుంబకం సందేశాన్ని ఇండియన్ నేవీ విదేశాల పోర్టుల్లో వ్యాప్తి చేయనుంది.
యోగా ద్వారా కలిగే లాభాలు, ఆరోగ్యవంతమైన జీవన విధానం గురించి ఇండియన్ నేవీ ఆ దేశాల్లో అవగాహన తేనుంది. ఈ ఏడాది యోగా దినోత్సవాల్లో భాగంగా బంగ్లాదేశ్‌లోని చత్తోగ్రామ్, ఈజిప్ట్‌లోని సఫాగా, ఇండోనేషియాలోని జకర్తా, కెన్యాలోని మొంబాసా, మడగాస్కర్‌లోని తొమాసినా, ఒమన్‌లోని మస్కట్, శ్రీలంకలోని కొలంబో, థాయ్‌ల్యాండ్‌లోని ఫుకెట్, యూఏఈలోని దుబాయ్ తీర ప్రాంతాలు, పోర్టుల్లో ఇండియన్ నేవీ యోగా దినోత్సవ వేడుకలను నిర్వహించనుంది. ఇందుకోసం ఐఎన్ షిప్స్ కిల్తన్, చెన్నై, శివాలిక్, సునైనా, త్రిషుల్, తర్కష్, వగిర్, సుమిత్ర, బ్రహ్మపుత్రలు వెళ్లనున్నాయి.

ఈ ఏడాది ఇండియన్ నేవీ నిర్వహిస్తున్న ఓషియన్ రింగ్ ఆఫ్ యోగా కార్యక్రమంలో భాగంగా సుమారు 3,500 నేవీ సిబ్బంది 19 పడవల్లో 35 వేల కిలోమీటర్లు యోగా అంబాసిడర్లుగా దేశ, అంతర్జాతీయ జలాల్లో ప్రయాణం చేయనున్నారు. అంతేకాదు, ఓవర్సీస్ మిషన్‌ల ద్వారా 1200 మంది విదేశీ నేవీ సిబ్బందితో విదేశీ నావల్లోనూ యోగా దినోత్సవ కార్యక్రమాలు నిర్వహించడానికి ప్లాన్ వేసుకున్నారు.
Also Read: Opposition Unity: విపక్షాల కూటమిలోకి బీఆర్ఎస్? అసెంబ్లీ ఎన్నికల కోసం నిర్ణయం వాయిదా!
విదేశీ పోర్టులో నిర్వహించే యోగా దినోత్సవ వేడుకల్లో ఆ దేశ నావికా దళ సిబ్బందినీ ఇన్వాల్వ్ చేయనుంది. కామన్ యోగా ప్రోటోకాల్‌పై ఫోకస్ పెట్టనుంది. తద్వార యోగా ద్వారా భౌతిక, మానసిక, ఎమోషనల్ కోణాల్లో కలిగే ప్రయోజనాలపై అవగాహన తీసుకురానుంది.
మన దేశంలోని అన్ని పోర్టులు, బేస్‌లు, షిప్‌లు, ఎస్టాబ్లిష్‌మెంట్లలో యోగా దినోత్సవ వేడుకలను ప్రారంభించారు. ఇందులో కామన్ యోగా ప్రోటోకాల్ కూడా ఉంటుంది. యోగా సంబంధ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమాల్లో నావికా దళం, రక్షణ సిబ్బంది, వారి కుటుంబాలు కూడా పాల్గొనడానికి నిర్ణయాలు తీసుకున్నారు. యోగా గురించి మాస్ క్యాంప్‌లు, వర్క్ షాపులు, పోస్టర్ తయారీ పోటీలు, క్విజ్‌లు, ఉపన్యాసాలు కూడా రేపు నిర్వహించనున్నారు.
