జమ్మూలోని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ స్థావరంపై డ్రోన్లతో దాడితో ఇండియన్ నేవి అప్రమత్తమైంది. విశాఖ కేంద్రంగా పనిచేస్తున్న తూర్పు నౌకా దళ స్ధావరాల చుట్టూ డ్రోన్ల వినియోగంపై ఆంక్షలు విధించింది. నావికా దళ స్థావరాల నుంచి 3 కిలోమీటర్ల పరిధిని ‘‘నో ఫ్లై జోన్‌గా’’ ప్రకటించారు.

జమ్మూలోని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ స్థావరంపై డ్రోన్లతో దాడితో ఇండియన్ నేవి అప్రమత్తమైంది. విశాఖ కేంద్రంగా పనిచేస్తున్న తూర్పు నౌకా దళ స్ధావరాల చుట్టూ డ్రోన్ల వినియోగంపై ఆంక్షలు విధించింది. నావికా దళ స్థావరాల నుంచి 3 కిలోమీటర్ల పరిధిని ‘‘నో ఫ్లై జోన్‌గా’’ ప్రకటించారు. డ్రోన్లు, యూఏవీలు సహా వైమానిక వస్తువులు ఎగరవేయడం నిషేధించింది. ఆంక్షలు ఉల్లంఘించి ప్రవేశించే డ్రోన్లను ధ్వంసం చేయడంతో పాటు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది ఇండియన్ నేవి. 

కాగా, జమ్మా కశ్మీర్‌లోని భారత సైనిక స్థావరాలే లక్ష్యంగా గత కొన్ని రోజులుగా డ్రోన్ దాడులు జరుగుతున్న సంగతి తెలిసిందే. తాజాగా మరోసారి డ్రోన్ల సంచారం కలకలం సృష్టించింది. శుక్రవారం అంతర్జాతీయ సరిహద్దు వెంబడి పాకిస్థాన్‌ వైపు నుంచి ఓ డ్రోను భారత భూభాగంలోకి ప్రవేశించేందుకు యత్నించింది. అయితే భద్రతా సిబ్బంది అప్రమత్తమై దానిపై కాల్పులు జరపడంతో ఆ డ్రోన్‌ వెనుదిరిగినట్లు సైన్యం తెలిపింది. 

Also Read:జమ్మూలో మరోసారి డ్రోన్ల కలకలం..!

శుక్రవారం తెల్లవారుజామున 4.25 గంటల ప్రాంతంలో జమ్మూశివారులోని అర్నియా సెక్టార్‌లో ఓ చిన్న క్వాడ్‌కాప్టర్‌ అంతర్జాతీయ సరిహద్దును దాటేందుకు ప్రయత్నించింది. అప్రమైన బీఎస్ఎఫ్.. ఈ డ్రోన్‌ను గుర్తించి ఆరు రౌండ్లు కాల్పులు జరిపింది. దీంతో ఆ డ్రోన్‌ పాకిస్థాన్‌ వైపు వెళ్లిపోయిందని సైన్యం తెలిపింది.