9/11 తర్వాత పశ్చిమ దేశాల్లోని ముస్లింలు తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొన్నారు. వారు దానికి కౌంటర్‌గా ఒక నెరేటివ్ విజయవంతంగా రూపొందించగలిగారు. 20 ఏళ్ల తర్వాత ఇప్పుడు అది అక్కడ అందరి అవగాహనలోకి వచ్చింది. ఉగ్రవాదులు, సాధారణ ముస్లింలు వేరు. ఇస్లాం సహనాన్ని, శాంతిని బోధిస్తుందని వారు బలంగా ప్రచారం చేయగలిగారు. 

9/11 తర్వాత పశ్చిమ దేశాల్లోని ముస్లింలు ఆటుపోటులకు గురయ్యారు. కొంతమంది ఉగ్రవాదుల దుశ్చర్యల వల్ల ముస్లిం సమాజంపై ఏర్పడే పక్షపాతానికి తాము గురవుతున్నామని గుర్తించారు. అమెరికా పెంటగాన్‌లో ట్విన్ టవర్స్ పై ఉగ్రదాడి తర్వాత పశ్చిమ దేశాల ముస్లింలు ఈ పక్షపాతాన్ని ఎదుర్కోవడానికి ఒక అభిప్రాయాన్ని తయారు చేయాలని సంకల్పించారు. ఆ ఉగ్రవాదుల నుంచి తమను తాము వేరు చేసుకోవడానికి ఒక నెరేటివ్‌ను రూపొందించారు.

ఈ గ్రహింపు అక్కడి ముస్లింలు, ముస్లిం మేధావులు ప్రభావవంతంగా ఒక అభిప్రాయాన్ని రూపొందించగలిగారు. అప్పుడు దావనలంలా వ్యాపిస్తున్న ఇస్లామోఫోబియా నష్టాన్ని కొంతమేరకైనా నివారించగలిగారు. 

వారంతా వాస్తవమైన ఇస్లాం స్ఫూర్తిని చాటిచెప్పడం ప్రారంభించారు. అది శాంతియుతమైనదని, ఉదారమైనదని వారు తెలియజేశారు. ఈ నెరేటివ్ నిర్మించడం ద్వారా అల్ ఖైదా, ఐఎస్ఐఎస్ వంటి హింసను ప్రేరేపించే వారి నుంచి నిజమైన ముస్లింలను వేరు చేయగలిగింది. పశ్చిమ దేశాల ముస్లిం మేధావులు నిర్మించిన ఈ నెరేటివ్ ప్రజల్లో అవగాహనగా మారడానికి 20 ఏళ్లు పట్టింది. వారు చేసిన ఈ కృషి మతోన్మాద కుదుపును చాలా వరకు నివారించగలిగింది. ఇప్పుడు వారు శాంతియుతంగా జీవనం సాగించడానికి ఉపకరించింది.

ఇక్కడ చెప్పొచ్చేదేమిటంటే.. భారత ముస్లింలు పశ్చిమ దేశాల ముస్లింల అనుభవాల నుంచి నేర్చుకోవాల్సి ఉన్నది. స్వాతంత్ర్యం పొందినది మొదలు ఇప్పటి వరకు భారత ముస్లింలు బాధితులమనే అభిప్రాయాన్నే నిర్మించుకుంది. అంతేకానీ, ఒక పార్టిసిపేటరీ నెరేటివ్ రూపొందించడంలో వారు విఫలమయ్యారు. అలా చేస్తే నేడు వారి స్థితిగతులు చాలా మెరుగ్గా ఉండేవి.

ఇప్పుడు చరిత్ర పుస్తకాల్లో లిఖించబడిన కొందరు ముస్లింలు హింసకు పాల్పడ్డ చర్యలు మొత్తం ముస్లిం సమాజానికి నష్టం చేశాయి. నేటికీ కొందరు మత పెద్దలు ఇస్లాంను హింసతో కలిపి చూస్తున్నారు. వారు ఆత్మాహుతి దాడులకు సంతాపం తెలుపుతారు. ఇలాంటి ఆలోచనలే ఇస్లాంలో నిషేధమైనప్పటికీ వారు అలా నడుచుకుంటారు.

స్వాతంత్ర్యం తర్వాత మన దేశంలో ఎప్పుడైనా ముస్లింలు బాధితులుగా నిలిచినప్పుడు నేతలు, మేధావులు ముందుకు వచ్చి అండగా నిలిచారు. ఇది తప్పేమీ కాదు. కానీ, సమస్య ఏమిటంటే.. ఉలేమాలు, ముస్లిం మేధావులు మాత్రం బాధితులమనే అభిప్రాయం నుంచి బయటకు రాలేదు. దాని ద్వారా వారు కేవలం ముస్లింలపై అరాచకాలు జరిగినప్పుడు మాత్రమే మాట్లాడుతారనే అభిప్రాయం ఏర్పడింది.

Also Read: బక్రీద్‌కు కొత్త రకం కుర్బానీ.. ముస్లిం సత్యశోధక్ మండల్ సైంటిఫిక్ అప్రోచ్

నేడు మౌలానాలు పాలస్తీనాలో ముస్లింలపై జరుగుతున్న ఆగడాల గురించే ఎందుకు గొంతెత్తుతారు? అధికారంలో ఏ ప్రభుత్వం ఉన్నా జాతీయ ప్రాధాన్యత ఉన్న అంశాలపై వీరి గళం ఎందుకు వినిపించదు? వీరేమైనా ఇతర భారతీయుల కంటే తక్కువనా? కేవలం ముస్లింలు ప్రమాదంలో ఉన్నప్పుడు మాత్రమే వారు మాట్లాడుతారనే అభిప్రాయం ఎలా వచ్చింది? దీనికి సమాధానంగా భారత ముస్లింల గురించి గొంతెత్తేవారు ఇక్కడ ఎవరూ లేరనే సమాధానం రావొచ్చు. కానీ, ఈ స్థితిలో మార్పు రావాలంటే మైండ్‌సెట్ మారాలి.

భారత ఉలేమాలు పాలస్తీనాలో అఘాయిత్యాలు జరిగినప్పుడు మాట్లాడుతారు గానీ పాకిస్తాన్‌లో హిందువులపై ఆగడాల గురించి ఎందుకు గళం విప్పరు? పొరుగువారితో సౌఖ్యంగా ఉండాలని, సక్రమంగా నడుచుకోవాలని ఇస్లాం చెబుతున్నది.

మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి ఒకసారి ఇలా అన్నాడు. పొరుగువారిని మీరు మార్చలేరు. కాబట్టి, వారితో పెట్టుకునే సంబంధాల్లో మీరే జాగరూకతగా మెలగాలి. ఆయన పాకిస్తాన్‌ను ఉద్దేశించి ఈ మాటలు అన్నారు.

భారత్‌లోని హిందువులు మనకు అతిదగ్గరగా ఉండే పొరుగువారు. ముస్లిం సమాజం కోసం గళమెత్తాలని ఇస్లాం చెబుతున్నది. అయితే, అదే ఇస్లాం పొరుగువారితోనూ మంచి సంబంధాలను ఏర్పరుచుకోవాల్సిన ప్రాధాన్యతను అంతే ముఖ్యమైందిగా చెబుతుంది.

---అతిర్ ఖాన్