తెలుగు రాష్ట్రాలకు కేంద్రం ‘ఉక్కు’ పంచ్

First Published 13, Jun 2018, 4:59 PM IST
Indian government shock to telugu states
Highlights

తెలుగు రాష్ట్రాలకు కేంద్రం ‘ఉక్కు’ పంచ్

తెలుగు రాష్ట్రాల ఉక్కు ఆశలపై కేంద్రం నీళ్లు చల్లింది. తెలంగాణలో ఏర్పాటవుతుందని భావిస్తున్న బయ్యారం ఉక్కు కార్మాగారంతో పాటు.. ఆంధ్రప్రదేశ్‌లోని కడప జిల్లాలో ప్రతిపాదించబడిన ఉక్కు కర్మాగారం ఏర్పాటు సాధ్యం కాదని కేంద్రప్రభుత్వం తేల్చి చెప్పింది. ఈ మేరకు సుప్రీంకోర్టులో అఫిడవిట్‌ దాఖలు చేసింది. సాధ్యాసాధ్యాలు పరిశీలించాలని మాత్రమే విభజన చట్టంలో ఉందని.. కేంద్రం పేర్కొంది.. తొలి ఆరు నెలల్లో సాధ్యం కాదని చెప్పినా.. పరిశీలన జరిపి నిర్ణయం తీసుకోవాలని సూచనలు రావడంతో.. చట్టంతో పాటు మరికొన్ని అంశాలను పరిగణనలోనికి తీసుకున్న తర్వాత రెండు రాష్ట్రాల్లో ఉక్కు కర్మాగారాలు ఏర్పాటు చేయలేమని కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. 

loader