ఇండియాపై కరోనా దెబ్బ: 24 గంటల్లో 1,396 కేసులు, మొత్తం 27,896కి చేరిక
దేశంలో కరోనా కేసుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతున్నాయి. సోమవారం నాడు ఉదయానికి దేశంలో కరోనా కేసుల సంఖ్య27,892కి చేరుకొన్నాయి. వీటిలో 20,835 కేసులు యాక్టివ్ కేసులు.
న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతున్నాయి. సోమవారం నాడు ఉదయానికి దేశంలో కరోనా కేసుల సంఖ్య27,892కి చేరుకొన్నాయి. వీటిలో 20,835 కేసులు యాక్టివ్ కేసులు.
కరోనా సోకి ఆసుపత్రుల్లో చికిత్స పొంది 6,184 మంది ఆసుపత్రుల నుండి డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటివరకు 892 మంది మరణించారు. మరణించిన వారిలో ఒక వలసకూలీ కూడ ఉన్నాడు.గత 24 గంటల్లో 1396 కొత్త కేసులు నమోదయ్యాయి. 48 మంది చనిపోయారు. 381 మంది ఆసుపత్రుల నుండి డిశ్చార్జ్ అయ్యారని కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది.
దేశంలో అత్యధికంగా మహారాష్ట్రలో కరోనా కేసులు నమోదయ్యాయి. సోమవారం నాడు ఉదయానికి కరోనా కేసుల సంఖ్య 8,068 చేరుకున్నాయి. మహారాష్ట్ర తర్వాతి స్థానంలో గుజరాత్ రాష్ట్రంలో అత్యధిక కేసులున్నాయని కేంద్రం తెలిపింది.గుజరాత్ రాష్ట్రంలో 3,301 కేసులు నమోదయ్యాయి. గుజరాత్ తర్వాతి స్థానంలో ఢిల్లీ నిలిచింది. ఢిల్లీలో 2,918 కేసులు నమోదైనట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.
కరోనా సోకి కోలుకొన్న రోగుల శాతం 22గా ఉందని కేంద్రం తెలిపింది. ఇతర దేశాలతో పోలిస్తే ఇండియాలో కోలుకొంటున్న రోగుల శాతం బాగా ఉందని ఆరోగ్య గణాంకాలు చెబుతున్నాయి.ఇప్పటి వరకు 5,913 మంది ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యారు.
దేశంలో 280 జిల్లాల్లో కొత్తగా కరోనా కేసులు నమోదు కాలేదు. ఇందులో గత వారం రోజులుగా అరవై నాలుగు జిల్లాల్లో ఒక్క కేసు కూడా నమోదు కాలేదని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.
అదేవిధంగా 45 జిల్లాలో గత 14 రోజులుగా ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. 21 రోజులుగా ముప్పై మూడు జిల్లాల్లో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. ఇక 28 రోజులుగా 18 జిల్లాల్లో ఒక్క కేసు కూడా నమోదు చేయాలని కేంద్ర ప్రభుత్వం తేల్చి చెప్పింది.
బీహార్‌లో కరోనా కేసుల సంఖ్య 291కి చేరుకొంది. కొత్తగా ఎనిమిది మంది స్త్రీలకు ఐదుగురు పురుషులకు కరోనా సోకింది.బెంగాల్ రాష్ట్రంలో ఇంటర్ మినిస్టీరియల్ టీం క్షేత్రస్థాయిలో ఇవాళ్టి నుంచి పర్యటిస్తుంది. కోల్ కత్తాలోని బిఎస్ఎఫ్ ఆఫీస్ నుంచి తన పర్యటన ప్రారంభించింది టీమ్. అయితే ఈ టీమ్ కు రాష్ర్ట ప్రభుత్వం నుండి ఎలాంటి ఎస్కార్ట్ ఇవ్వలేదు.
ఆగ్రాలో క్వారంటైన్ లో ఉన్న ఒక రోగి సరైన సదుపాయాలు లేవని షేర్ చేసిన వీడియో పై పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.కోటా లో చిక్కుకున్న విద్యార్థులు తమ స్వగ్రామానికి చేరుకునేందుకు అస్సాం రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేపట్టింది.
ఢిల్లీలోని 39మంది హెల్త్ వర్కర్స్ ను అంబేద్కర్ హాస్పిటల్ లో క్వారంటైన్ కి తరలించారు. 30 మంది సిబ్బందికి కరోనా సోకడంతో 39 మందిని క్వారంటైన్ కు తరలించారు. జగ్జీవన్ రామ్ ఆసుపత్రిలో పనిచేసే 58 మంది హెల్త్ వర్కర్స్ కూడా కరోనా సోకింది. ఈ రెండు ఆసుపత్రుల్లో పనిచేసే 88 హెల్త్ వర్కర్స్ కు కరోనా సోకిందని అధికారులు నిర్ధారించారు.
also read:నూతన వధూవరులకు కరోనా: గ్రామంలో ప్రతి ఒక్కరికి పరీక్షలు
మైక్రో బాక్టీరియం వ్యాక్సిన్ ట్రయల్స్ ను త్వరలో ప్రారంభం కానున్నట్టు చండీగఢ్ లోని పీజీఐఎంఈఆర్ సంస్థ ప్రకటించింది కరోనాతో చనిపోయిన రెండు పోలీస్ కుటుంబాలకు రూ. 50 లక్షల పరిహారాన్ని అందించనున్నట్టుగా మహారాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.