బీజింగ్ లో  (beijing) జరిగే వింటర్ ఒలింపిక్స్ (winter olympics) ప్రారంభోత్సవానికి కానీ, ముగింపు వేడుకలకు కానీ భారత్​ తరఫున రాయబారి హాజరుకాబోరని కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి అరిందమ్​ బాగ్చి (arindam bagchi) ​ చెప్పారు. 2

బీజింగ్ లో (beijing) జరిగే వింటర్ ఒలింపిక్స్ (winter olympics) ప్రారంభోత్సవానికి కానీ, ముగింపు వేడుకలకు కానీ భారత్​ తరఫున రాయబారి హాజరుకాబోరని కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి అరిందమ్​ బాగ్చి (arindam bagchi) ​ చెప్పారు. 2022 వింటర్ ఒలింపిక్స్ కు గాల్వాన్ సైనికుడిని టార్చ్ బేరర్‌గా చైనా తయారు చేస్తుందన్న నివేదికల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. ఒలింపిక్స్ ను రాజకీయం చేయడానికి చైనా ఎంచుకోవడం విచారకరం అన్నారు. అటు దూరదర్శన్ కూడా వింటర్ ఒలింపిక్స్ ప్రారంభ, ముగింపు వేడుకలను ప్రసారం చేయబోమని ప్రకటించింది. 

గతేడాది తూర్పు లడఖ్‌లో ఉన్న గల్వాన్‌ లోయలో భారత్‌, చైనా ఆర్మీల మధ్య ఘర్షణ‌‌లో (Galwan clash) 20 మంది భారతీయ సైనికులు అమరులైన సంగతి తెలిసిందే. గడ్డకట్టే ఉష్ణోగ్రతల్లో భారత బలగాలను చైనా దొంగదెబ్బ తీయడంతో ఘర్షణ చోటుచేసుకుంది. ఈ క్రమంలోనే చైనా బలగాలను భారత సైనికులు ధీటుగా ఎదుర్కొన్నారు. ఈ ఘర్షణలో తెలంగాణకు చెందిన కర్నల్ సంతోష్ బాబుతో సహా 20 మంది భారత సైనికకులు వీరమరణం పాందారు. మరోవైపు ఈ ఘటనపై చైనా తమ సైనికుల మరణాలపై ప్రకటన చేయకుండా దుర్బుద్దిని ప్రదర్శించింది. అయితే ఎట్టకేలకు గల్వాన్ ఘటనలో తమ సైనికులు మరణించినట్టుగా గతేడాది ఫిబ్రవరిలో అంగీకరించింది. ఘర్షణలో మరణించిన నలుగురు సైనికులకు పతకాలను ప్రకటించింది. ఇక, గల్వాన్ ఘర్షణ తర్వాత సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు పెరిగిపోయాయి. 

అయితే ఈ ఘర్షణలో చైనా వైపు భారీగానే ప్రాణ నష్టం జరిగిందనే వార్తలు పెద్ద ఎత్తున వచ్చాయి. తాజాగా ఇందుకు సంబందించి ఆస్ట్రేలియాకు చెందిన వార్తపత్రిక The Klaxon.. పరిశోధనాత్మక కథనాన్ని ప్రచురించింది. జూన్ 15-16 మధ్య జరిగిన యుద్ధం యొక్క ప్రారంభ దశలో చీకటిలో గాల్వాన్ నదిని దాటడానికి ప్రయత్నించినప్పుడు కనీసం 38 మంది చైనా సైనికులు మునిగిపోయారని పేర్కొంది.

చైనీస్ బ్లాగర్లు, ఘటన జరిగిన ప్రాంతానికి చెందిన చైనీస్ పౌరుల నుంచి పొందిన సమాచారం, చైనా అధికారులు తొలగించిన మీడియా నివేదికల ద్వారా పేరులేని సోషల్ మీడియా పరిశోధకుల బృందం నిర్వహించిన పరిశోధన ఆధారంగా నివేదిక ప్రచురితమైంది. 

Australian newspaper నివేదిక ప్రకారం.. జూన్ 15 రాత్రి చైనా ఆక్రమణను తొలగించడానికి భారత సైనికులు గాల్వాన్ లోయలోని వివాదాస్పద ప్రాంతానికి వెళ్లారు. చైనాకు చెందిన కల్నల్ క్వి ఫాబావో, 150 మంది చైనా సైనికులు భారత సైన్యాన్ని కలుసుకున్నారు. వారు భారత సైనికులతో సమస్యపై చర్చించడానికి బదులుగా యుద్ధానికి దిగారు. ఫాబావో దాడి చేసిన వెంటనే అతనిని భారత ఆర్మీ దళాలు చుట్టుముట్టాయి. అతనిని రక్షించడానికి, PLA బెటాలియన్ కమాండర్ చెన్ హాంగ్‌జున్, సైనికుడు చెన్ జియాంగ్రాన్ ఉక్కు పైపులు, కర్రలు, రాళ్లను ఉపయోగించి భారత సైనికులతో భౌతిక ఘర్షణకు దిగారు (ముగ్గురు చైనీస్ సైనికులు చనిపోవడంతో). దీంతో చైనా సైనికులు భయాందోళనకు గురయ్యారు. 

చైనా సైనికుడు వాంగ్ జురాన్ తన సహచరులకు సాయం చేయడానికి ముందుకు వచ్చాడు. వారికి కనీసం వాటర్ ప్యాంట్ ధరించడానికి కూడా సమయం లేదు. వాంగ్ జురాన్ నేతృత్వంలో చైనా సైనికులు చీకటి మంచుతో నిండిన నీటిని దాటాలని నిర్ణయించుకున్నారు. అయితే నది అకస్మాత్తుగా ఉప్పొంగడంతో గాయపడిన సైనికులు కొట్టుకుపోవడం ప్రారంభమైంది. ఇక, అనేక మంది Weibo వినియోగదారులను ఉటంకిస్తూ.. ఆ రాత్రి వాంగ్‌తో పాటు కనీసం 38 మంది చైనా సైనికులు కొట్టుకుపోయి మునిగిపోయారని నివేదిక పేర్కొంది. చైనా వాస్తవాలను దాచిపెట్టిందని ఆ నివేదిక వెల్లడించింది. వాస్తవంగా ఏం జరిగిందనేది, వాగ్వాదానికి దారితీసిన పరిస్థితుల గురించి చాలా వాస్తవాలను దాచిపెట్టిందని పేర్కొంది. చైనా ప్రపంచానికి చెప్పినవి కల్పిత కథలు అని తెలిపింది. 

Scroll to load tweet…