గుజరాత్ సముద్ర తీరంలోని భారత జలాల్లోకి 11 కిలో నాటికల్ మైల్స్ దూరం చొచ్చుకొని వచ్చిన పాక్ బోట్ ను ఇండియన్ కోస్ట్ గార్డ్ సిబ్బంది పట్టుకున్నారు. బోట్ తో పాటు 10 మంది సిబ్బందిని అధికారులు అదుపులోకి తీసుకున్నారు.
భారతదేశానికి చెందిన సముద్ర జలాల్లో ఉన్న పాక్ బోట్ ను ఇండియన్ కోస్ట్ గార్డ్ ((ICG) పట్టుకొంది. గుజరాత్ తీరంలో భారత జలాల్లో 10 మంది సిబ్బందితో కూడిన పాకిస్థాన్ పడవను ఇండియన్ కోస్ట్ గార్డ్ (ICG) పట్టుకున్నట్లు రాష్ట్ర రక్షణ ప్రతినిధి ఆదివారం తెలిపారు.
భారత సముద్ర సరిహద్దు తీరం నుంచి 11 కిలోమీటర్ల దూరంలోకి ఈ యాసిన్ అనే బోట్ వచ్చింది అయితే దీనిని ఇండియన్ కోస్ట్ గార్డ్ సిబ్బంది చూశారు. ఆ బోట్ వైపు కోస్ట్ గార్డ్ షిప్ వెళ్తుండగానే ఆ బోట్ పారిపోవడానికి ప్రయత్నించింది. అయితే ఆలోపే దానిని నిలువరించారు. ‘‘ జనవరి 08న రాత్రిపూట అరేబియా సముద్రంలో 10 మంది సిబ్బందితో యాసిన్ అనే బోట్ వచ్చింది. దానిని ఇండియన్ కోస్ట్ గార్డ్ షిప్ అంకిత్ పట్టుకుంది. తదుపరి విచారణ కోసం బోటును పోర్ బందర్‌కు తీసుకువచ్చాం’’ అని ఆ అధికారి తెలిపారు.
గత ఏడాది సెప్టెంబర్ 15వ తేదీన ఇండియన్ కోస్ట్ గార్డ్ ((ICG) ఇదే విధమైన ఆపరేషన్‌లో 12 మంది సిబ్బందితో కూడిన పాకిస్తాన్ బోట్‌ను గుజరాత్ తీరంలో భారత జలాల్లో పట్టుకుంది. అలాగే గతేడాది డిసెంబర్ 20వ తేదీన గుజరాత్ రాష్ట్ర యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్‌తో కలిసి ఇండియన్ కోస్ట్ గార్డ్ ((ICG) జాయింట్ ఆపరేషన్ నిర్వహించింది. ఇందులో సుమారు రూ. 400 కోట్ల విలువైన 77 కిలోల హెరాయిన్, ఆరుగురు సిబ్బందితో కూడిన పాకిస్తాన్ ఫిషింగ్ బోట్‌ను పట్టుకున్నారు. అయితే ఇలా బోట్ ల ద్వారా పాకిస్తాన్ నుంచి అక్రమంగా మాదకద్రవ్యాలను ఇండియాకు తీసుకువస్తున్నారు. ఇటీవల ఇలాంటి కేసులు పెరిగాయి.
