భారతీయ వ్యాపారి నుంచి రూ. 4 కోట్లను దోచుకున్న హమాస్.. ఎలాగంటే?

పశ్చిమ ఢిల్లీకి చెందిన ఓ బిజినెస్ మ్యాన్ నుంచి రూ. 4 కోట్ల విలువైన క్రిప్టో కరెన్సీ హమాస్ ఉగ్రవాదస సంస్థ దోచుకుందని తెలిసింది.  భారత్‌లో హమాస్ తొలి చర్య తాజాగా వెలుగులోకి వచ్చింది.
 

indian businessman loses around rs 4 crore worth crypto currency by hamas kms

న్యూఢిల్లీ: భారత్‌కు సంబంధించి హమాస్ చేసిన తొలి దుశ్చర్య వెలుగులోకి వచ్చింది. భారతీయ వ్యాపారి నుంచి రూ. 4 కోట్ల విలువైన క్రిప్టో కరెన్సీని సైబర్ ఫ్రాడ్ ద్వారా సొమ్ము చేసుకుంది. ఈ విషయాన్ని ఢిల్లీ పోలీసులు తెలిపారు. ఇజ్రాయెల్ అనుకూల దేశాల్లోని వ్యక్తులను లక్ష్యంగా చేసుకుని హమాస్ ఫండ్ రైజ్ చేస్తున్నట్టు తెలుస్తున్నది. ఈ కుట్రకు మన దేశంలో నుంచి తొలి బాధితుడిగా ఢిల్లీకి చెందిన బిజినెస్ మ్యాన్ నిలిచాడు. హమాస్ సైబర్ టెర్రరిజం వింగ్ ఈ దోపిడీకి పాల్పడినట్టు తేలిందని పోలీసులు వివరించారు.

2021లో ఈ వ్యవహారం మొదలైంది. క్రిప్టో దొంగతనాల నుంచి వెళ్లిన సొమ్ము ఏ వ్యాలెట్లకు వెళ్లుతున్నాయో ఢిల్లీ పోలీసులు గుర్తించడం మొదలు పెట్టారు. ఇదే సందర్భంలో ఇజ్రాయెల్ నిఘా సంస్థ మొస్సాద్ భారత నిఘా ఏజెన్సీకి కొన్ని ఇన్‌పుట్లు ఇచ్చింది. కొన్ని అనుమానిత వ్యాలెట్లు టెర్రరిస్టు సంస్థలు నిధుల సేకరణ కోసం ఏర్పాటు చేసినట్టుగా ఉన్నాయని తెలిపింది.

Also Read: ఆదివారం పవిత్రదినం.. ఓట్ల లెక్కింపు తేదీని మార్చండి.. ఎన్నికల సంఘానికి పార్టీల విజ్ఞప్తి

అప్పుడు భారత సెక్యూరిటీ ఏజెన్సీలు ఈ విషయాన్ని తేల్చారు. ఢిల్లీ నుంచి క్రిప్టో కరెన్సీలు చోరీకి గురై కొన్ని వ్యాలెట్ల గుండా చివరికి అల్ ఖాస్సమ్ బ్రిగేడ్స్ అనే సైబర్ టెర్రరిజం హమాస్ వింగ్ ఖాతాలోకి వెళ్లినట్టు గుర్తించారు. అల్ ఖాస్సమ్ బ్రిగేడ్స్‌తో లింక్ ఉన్న అనేక అనుమానిత వ్యాలెట్ల వివరాలు దర్యాప్తులో తేలిందని పోలీసు అధికారులు తెలిపారు.

సీజ్ చేసిన వ్యాలెట్లలో గాజాలోని నాసీర్ ఇబ్రహీం అబ్దుల్లాకు చెందిన, గాజాలోని అహ్మద్ మర్జూక్‌లకు చెందినవి ఉన్నాయి. హమాస్ ఆపరేటివ్ అహ్మద్ క్యూహెచ్ సఫీ వ్యాలెట్ కూడా దర్యాప్తులో తేలిందని పోలీసులు వివరించారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios