Asianet News TeluguAsianet News Telugu

డ్రాగన్ దేశ ఉగ్రదాడులను తిప్పికొట్టే వ్యూహాలు.. సరిహద్దులో మౌలిక సదుపాయాల కల్పన..  భారీగా ..

భారత వాస్తవ సరిహద్దు వెంబడి  చైనా,పాకిస్తాన్‌ల ఆగడాలు రోజురోజుకు తీవ్రమవుతున్నాయి. భారత్ కూడా శత్రుదేశాలకు దీటుగా ఎదురిస్తుంది. ఉగ్రదాడులను సమర్థవంతంగా తిప్పికొడుతోంది. ఈ నేపథ్యంలో డ్రాగన్ సైన్యం చర్యలను ముందుగానే కట్టడి చేయడానికి  భారత్.. ఉత్తర సెక్టార్ నుండి తూర్పు సెక్టార్ వరకు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్ల చేస్తూ మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేస్తోంది. 

Indian Army can reach key mountainous passes at LAC even before Chinese ground troops
Author
First Published Dec 3, 2022, 12:11 PM IST

భారత వాస్తవ సరిహద్దు వెంబడి  చైనా,పాకిస్తాన్‌ల ఆగడాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఉగ్రదాడులు చేస్తూ.. తన కుటిల నీతి బహిర్గతం చేస్తున్నాయి. భారత్ కూడా తగ్గదేలే అన్నట్టు శత్రుదేశాలకు దీటుగా సమాధానం ఇస్తుంది.  ఉగ్రదాడులను సమర్థవంతంగా తిప్పికొడుతోంది. నియంత్రణ రేఖ వెంబడి చైనా అతిక్రమణలకు పాల్పడుతున్న నేపథ్యంలో.. ఉత్తర సెక్టార్ నుండి తూర్పు సెక్టార్ వరకు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లను చేసింది.  హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లలోని  మిడిల్ సెక్టార్‌లో సైనికులను మోహరించడం, మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం వంటి కీలక పనులను భారత ప్రభుత్వం చేపట్టింది.

 ప్రధానంగా ఉత్తరాఖండ్‌లోని బారహోతి ప్రాంతంలో చైనా ఉగ్రఘటనలు జరిగినప్పటి నుంచి భారత్ అప్రమత్తమైంది. భద్రత బలగాల సమాచారం ప్రకారం.. గాల్వాన్ వ్యాలీ ముఖాముఖి దాడి తర్వాత.. అక్కడ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. సరిహద్దుల్లోని పలు సున్నిత ప్రాంతాల్లో భారత్ కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాటు చేసింది. ప్రస్తుతం సరిహద్దులోని ప్రతీ ప్రాంతంపై భారత్ గట్టి పట్టు సాధించింది. సెంట్రల్ సెక్టార్ ఎల్లప్పుడూ స్థిరసరిహద్దుగా పరిగణించబడుతుంది. కానీ, మే 2020 లో చైనా సైన్యం తూర్పు లడఖ్‌లోని భారత భూభాగాన్ని స్వాధీనపరచుకున్న తర్వాత పరిస్థితులు మారిపోయాయి. లడఖ్ లాంటి క్లిష్ట ప్రాంతంలో దాడులు జరిగినప్పుడూ శీఘ్రంగా దాడి చేయడానికి ఏర్పాటు చేస్తోంది.భారత ప్రభుత్వం ఆ ప్రాంతంలో మౌళిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యతనిచ్చింది, ముఖ్యంగా ఉత్తరాఖండ్‌లోని బారహోతితో ప్రారంభమయ్యే నాలుగు లోయలతో  ఇప్పటికే మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేసింది భారత ప్రభుత్వం. 

పలు ప్రాంతాల్లోని వాస్తవ స్వాధీనం రేఖ వెంబడి రోడ్లు,వంతెనల నిర్మాణంతో సహా అనేక మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను  భారత ప్రభుత్వం  వేగంగా నిర్మిస్తోంది. ఈ సరిహద్దు ప్రాంతంలోకి చైనీస్ గ్రౌండ్ ట్రూప్‌లు చేరుకోక ముందే.. మన దళాలు చేరుకునే మౌళిక సదుపాయాలను ఏర్పాటు చేసినట్టు అధికారులు తెలిపారు. హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ మధ్య సరిహద్దు ప్రాంతం వెంబడి 20కి పైగా పాస్‌లు ఉన్నాయి. ఆ పాస్ లలో రహదారి మౌలిక సదుపాయాలను వేగంగా నిర్మించడం వల్ల ఇది సాధ్యమవుతోందని తెలిపారు. 

భారతదేశం, చైనాలు లడఖ్‌లోని ఉత్తర సెక్టార్ నుండి అరుణాచల్ ప్రదేశ్‌లోని తూర్పు సెక్టార్ వరకు 3,488-కిమీ-పొడవున సరిహద్దును పంచుకుంటున్నాయి. వీటిలో 545-కిమీ-పొడవు LAC మిడిల్ సెక్టార్ కిందకు వస్తుంది. మిడిల్ సెక్టార్‌లో సాయుధ వాహనాల మోహరింపు తూర్పు లడఖ్‌లో నేర్చుకున్న పాఠం ఫలితమే.. మధ్య సెక్టార్‌లో భారతదేశం , చైనాలు 'వివాదాలు'గా పరిగణించబడుతున్న ఏకైక ప్రాంతం బారహోతి. ఈ వివాదం ఇంకా పరిష్కరించబడలేదు.ఉత్తర, తూర్పు సెక్టార్‌లో మరో ఏడు వివాదాస్పద ప్రాంతాలు ఉన్నాయి. 

ఇదిలాఉంటే.. భారత్‌, చైనా సరిహద్దులోని వాస్తవ నియంత్రణ రేఖ (ఎల్‌ఏసీ) సమీపంలో భారత్‌, అమెరికా కలిసి సైనిక విన్యాసాలు నిర్వహిస్తున్నాయి. ఇరు దేశాలు ‘యుధ్ అభ్యాస్’ పేరిట 18వ ఎడిషన్ సైనిక విన్యాసాలు ఉత్తరాఖండ్‌లో రెండు వారాలు జరిగాయి. ఇది వాస్తవ నియంత్రణ రేఖకు 100 కిమీ దూరంలో ఉంది, దీనికి చైనా పరిపాలన అభ్యంతరం తెలిపింది. శాంతి పరిరక్షణ, విపత్తు సహాయక చర్యల్లో ఇరు దేశ సైన్యాల మధ్య పరస్పర సహకారం, నైపుణ్యాన్ని అందిపుచ్చుకునేందుకు సంయుక్త ఆర్మీ డ్రిల్‌ జరిగింది.

దీనికి చైనా పరిపాలన అభ్యంతరం తెలిపింది. భారత్-చైనా సరిహద్దుకు 100కిలోమీటర్ల దూరంలో సైనిక బలగాలను ప్రదర్శించడం 1993, 1996 నాటి సరిహద్దు ఒప్పందాల స్ఫూర్తిని ఉల్లంఘించడమేనని చైనా పేర్కొంది. ఔలీలో జరిగిన యుధ్ అభ్యాస్‌కు 1993లో ఎలాంటి సంబంధం లేదని భారత్ పేర్కొంది. ఈ ఒప్పందాలను ఉల్లంఘించిన చైనా 2020 మేలో లడఖ్‌లోని గాల్వాన్‌ లోయ వద్ద భారీగా సైనికులను మోహరించిందని భారత్ సమాధానమిచ్చింది. 

Follow Us:
Download App:
  • android
  • ios