సీ-295 ట్రాన్స్‌పోర్ట్ ఎయిర్‌క్రాఫ్ట్‌ను స్పెయిన్ నుంచి స్వీకరించిన భారత వైమానిక దళం
స్పెయిన్ నుంచి తొలి సీ-295 విమానాన్ని భారత వైమానిక దళం బుధవారం రిసీవ్ చేసుకుంది. స్పెయిన్‌లోని సివిల్లి నగరంలో ఈ విమానాన్ని స్వీకరించింది. గతేడాది కుదిరిన డీల్‌లో భాగంగా మన దేశానికి అందించనున్న 56 విమానాల్లో తొలి విమానాన్ని చీఫ్ ఆఫ్ ఎయిర్ స్టాఫ్ ఎయిర్ చీఫ్ మార్షల్ వీఆర చౌదరి స్వీకరించారు.

న్యూఢిల్లీ: భారత వైమానిక దళానికి తొలి సీ-295 ట్రాన్స్‌పోర్ట్ ఎయిర్‌క్రాఫ్ట్ స్పెయిన్ నుంచి స్వీకరించింది. రూ. 21,935 కోట్ల ప్రాజెక్టు కింద 56 సీ-295 విమానాల ఒప్పందాన్ని భారత్ చేసుకుంది. ఇందులో భాగంగా 56 విమానాల్లొ తొలి సీ-295 ట్రాన్స్‌పోర్ట్ ఎయిర్‌క్రాఫ్ట్‌ను ఎయిర్ బస్ అండ్ స్పేస్ డెలివరీ చేసింది. రెండేళ్ల క్రితమే ఈ ఒప్పందం కుదరగా.. ఇప్పుడు తొలి విమానాన్ని స్పెయిన్‌లోని సెవిల్లి నగరంలోని ఎరోస్పేస్ మేజర్ ప్రొడక్షన్ ఫెసిలిటీ వద్ద చీఫ్ ఆఫ్ ఎయిర్ స్టాఫ్ ఎయిర్ చీఫ్ మార్షల్ వీఆర చౌదరి స్వీకరించారు.
ఈ డీల్ కింద 16 ఎయిర్ క్రాఫ్ట్‌లు ఎగిరే స్థితిలో భారత్‌కు అందిస్తుంది. 2025లోపు ఈ విమానాలను భారత్‌కు అందిస్తుంది. మిగిలిన 40 విమానాలను మన దేశంలో టాటా అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్ మ్యానుఫ్యాక్చరింగ్, అసెంబ్లీంగ్ చేస్తుంది. ఈ రెండు కంపెనీల మధ్య ఈ మేరకు ఒప్పందం కుదిరింది.
వడోదరలో 295 విమానాలను తయారు చేయడానికి ఓ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీకి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గతేడాది అక్టోబర్‌లో శంకుస్థాపన చేసిన సంగతి తెలిసిందే. భారత్‌లో తొలిసారిగా మిలిటరీ విమానాన్ని ఒక ప్రైవేట్ కన్సార్షియం తయారు చేయనుంది.
Also Read: ఫ్లైట్‌లో టాయిలెట్‌లో శృంగారం.. డోర్ ఓపెన్ చేయగానే ప్రయాణికులు షాక్.. వీడియో వైరల్
ఆరు దశాబ్దాల క్రితం భారత వైమాని దళంలోకి వచ్చిన యావ్రో-748 విమానాల స్థానంలో వీటిని తీసుకోబోతున్నారు. సీ-295 విమానాలు ట్రాన్స్‌పోర్ట్ కోసం పనికి వస్తాయి. 50 పారాట్రూపర్లు లేదా 71 ట్రూపులను ఈ ఎయిర్‌క్రాఫ్ట్ మోసుకెళ్లగలదు. సరిహద్దులు, సముద్ర జలాల్లో కాపలా కాయడంతోపాటు విపత్తులు, ప్రమాదాల్లోనూ రవాణా కోసం ఈ విమానాలను ఉపయోగించుకోవచ్చు.