అహ్మదాబాద్: అమెరికా, ఇండియా సంబంధాలు గతం కంటే బలపడతాయని ప్రధాని మోడీ అభిప్రాయపడ్డారు.  యావత్ దేశం మీకు స్వాగతం పలుకుతోందని ఆయన చెప్పారు.  

మొతేరా స్టేడియంలో నిర్వహించిన నమస్తే ట్రంప్ కార్యక్రమంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్, భారత ప్రధాని మోడీలు పాల్గొన్నారు.గతంలో హౌడీ మోడీ కార్యక్రమం జరిగిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఈ కార్యక్రమానికి కొనసాగింపుగానే  నమస్తే ట్రంప్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టుగా మోడీ ప్రకటించారు. 

సబర్మతి ఆశ్రమం నుండి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ దంపతులు మొతెరా క్రికెట్ స్టేడియానికి చేరుకొన్నారు. స్టేడియం నిర్వాహకులతో ట్రంప్ దంపతులు కొద్దిసేపు ముచ్చటించారు. 

read more   ట్రంప్ పర్యటనలైవ్ అప్డేట్స్: జాతీయగీతంతో ప్రారంభమైన నమస్తే ట్రంప్....

మొతేరా స్టేడియం వేదికపైకి వచ్చిన వెంటనే ప్రధాని మోడీ, అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌లు ఆత్మీయంగా ఆలింగనం చేసుకొన్నారు.  వేదికపై చుట్టూ తిరిగి ప్రజలకు అభివాదం చేశారు.ఆ తర్వాత రెండు దేశాల జాతీయ గీతాలను ఆలపించారు. 

ఈ సందర్భంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు ఆహ్వానిస్తూ మోడీ స్వాగతం పలికారు. ఇవాళ మొతేరా స్టేడియంలో కొత్త చరిత్ర సృష్టించిందని  ప్రధాని మోడీ చెప్పారు.  హౌస్టన్‌లో హౌడీ మోడీ కార్యక్రమాన్ని మోడీ గుర్తు చేసుకొన్నారు.

భారత పర్యటనను అమెరికా అధ్యక్షుడు ట్రంప్  అహ్మదాబాద్  నుండి ప్రారంభించారు.  అమెరికా నుండి నేరుగా ట్రంప్ అహ్మదాబాద్‌కు చేరుకొన్నారని ఆయన చెప్పారు. సబర్మతి ఆశ్రమాన్ని కూడ ఆయన సందర్శించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. 

read more  భారత్ శక్తి సామర్థ్యాలు వెలకట్టలేనివి: మోడీపై ట్రంప్ ప్రశంసలు

భారత్ అమెరికా మధ్య స్నేహ బంధం పరిఢవిల్లాలని  మోడీ  ఆకాంక్షను వ్యక్తం చేశారు.నమస్తే అనే పదం సంస్కృతం నుండి వచ్చిన విషయాన్ని మోడీ గుర్తు చేశారు.  రెండేళ్ల క్రితం ఇవాంకా ఇండియాలో పర్యటించిన విషయాన్ని మోడీ గుర్తు చేశారు.