Asianet News TeluguAsianet News Telugu

ట్రంప్ పర్యటన లైవ్ అప్డేట్స్: ఢిల్లీ చేరుకున్న ట్రంప్ దంపతులు, నేరుగా ఐటీసీ మౌర్యకు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దంపతులు దేశ రాజధాని ఢిల్లీకి చేరుకున్నారు. ఆగ్రాలో తాజ్‌మహాల్‌ను సందర్శించి అనంతరం ఎయిర్‌ఫోర్స్ వన్ విమానంలో ఆయన ఢిల్లీలోని పాలెం విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడ భారత దౌత్యాధికారులు ట్రంప్ దంపతులకు ఘనస్వాగతం పలికారు. ఎయిర్‌పోర్ట్ నుంచి అమెరికా అధ్యక్షుడి కాన్వాయ్ నేరుగా ఐటీసీ మౌర్య హోటల్‌కు చేరుకోనుంది. 

Trump India Visit: Live Updates...
Author
Ahmedabad, First Published Feb 24, 2020, 12:00 PM IST

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దంపతులు దేశ రాజధాని ఢిల్లీకి చేరుకున్నారు. ఆగ్రాలో తాజ్‌మహాల్‌ను సందర్శించి అనంతరం ఎయిర్‌ఫోర్స్ వన్ విమానంలో ఆయన ఢిల్లీలోని పాలెం విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడ భారత దౌత్యాధికారులు ట్రంప్ దంపతులకు ఘనస్వాగతం పలికారు. ఎయిర్‌పోర్ట్ నుంచి అమెరికా అధ్యక్షుడి కాన్వాయ్ నేరుగా ఐటీసీ మౌర్య హోటల్‌కు చేరుకోనుంది. 

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దంపతుల ఆగ్రా పర్యటన పూర్తయ్యింది. భార్య మెలానియా, కుమార్తె ఇవాంక, అల్లుడు కుష్నర్‌తో కలిసి చారిత్రక తాజ్‌మహల్‌ను సందర్శించిన ట్రంప్.. దేశ రాజధాని ఢిల్లీకి బయల్దేరారు.

ఢిల్లీలోని పాలెం విమానశ్రయం నుంచి ఆయన నేరుగా ఐటీసీ మౌర్యా హోటల్‌కు డొనాల్డ్ ట్రంప్ చేరుకోనున్నారు. దీంతో హోటల్ పరిసరాలను సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు, ఎన్ఎస్‌జీ, ఎస్పీజీ కమాండోలు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. 

ఆగ్రా ఎయిర్ ఫోర్స్ బేస్ నుంచి ట్రంప్ నేరుగా తాజ్ మహల్ చేరుకున్నారు. అక్కడ సందర్శకుల పుస్తకంలో ఆయన తన మెసేజ్ రాసిన తరువాత తాజ్ మహల్ పర్యటన మొదలుపెట్టారు. 

గైడ్ నితిన్ సింగ్ ఆ ప్రేమ చిహ్నం గురించి వివరిస్తుండగా... ట్రంప్ బృందం ఆ అందాలను ఆస్వాదిస్తూ మునిగిపోయారు. అక్కడి నుండి వారు నేటి రాత్రికి ఢిల్లీ చేరుకుంటారు. రేపు ఉదయం ట్రంప్ బిజీ బిజీగా గడపనున్నారు. 

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మొతేరా స్టేడియం లో నమస్తే ట్రంప్ ఈవెంట్ లో పాల్గొని అక్కడినుండి నేరుగా ఎయిర్ ఫోర్స్ వన్ విమానంలో ఆగ్రా బయల్దేరి వెళ్లారు. ఆగ్రాలో ట్రంప్ కు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సాదర స్వాగతం పలికారు. 

ఆగ్రా ఎయిర్ ఫోర్స్ బేస్ నుంచి తాజ్ మహల్ వరకు 12 కిలోమీటర్ల దూరాన్ని ట్రంప్ తన కారు బీస్ట్ లో చేరుకోనున్నారు. అహ్మదాబాద్ మాదిరిగానే ఇక్కడ కూడా రోడ్డుకు ఇరువైపులా జనాలు ట్రంప్ ను చూసేందుకు భారీ సంఖ్యలో తరలి వచ్చారు. 

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తన మూడు గంటల అహ్మదాబాద్ పర్యటనను ముగించుకొని ఆగ్రాకు బయల్దేరాడు. మొతేరా స్టేడియంలో నమస్తే ట్రంప్ ఈవెంట్ లో పాల్గొన్న అమెరికా అధ్యక్షుడు భారత్, అమెరికాల మధ్య స్నేహం ఎప్పటికి కొనసాగాలని ఆయన ఆకాంక్షించారు. 

ట్రంప్, మోడీల ఉపన్యాసం మొతేరా స్టేడియంలో ముగిసింది. అక్కడ ట్రంప్, మోడీలు తమ మధ్య ఉన్న పర్సనల్ బాండ్ గురించి మాట్లాడారు. మోడీ ట్రంప్ గొప్పతనం గురించి  ట్రంప్ మోడీ భారత్ లో ఎం చేసాడో చెప్పాడు. 

నమస్తే ట్రంప్ ఈవెంట్ ప్రారంభమైంది. ట్రంప్, అతని భార్య మేలేనియ మోడీ వేదికమీదికి తీసుకొని వచ్చారు. ట్రంప్ వేదిక మీదకు రాగానే... ఒక్కసారిగా అరుపులు కేకలతో దద్ధరిల్లింది. 

సబర్మతి ఆశ్రమం నుంచి బయల్దేరిన ట్రంప్ నేరుగా మొతేరా స్టేడియానికి చేరుకున్నారు. గత నాలుగు రోజులుగా అహ్మదాబాద్ లోనే ఉంటూ ట్రంప్ పర్యటన కోసం అన్ని ఏర్పాట్లను చేస్తున్న హోమ్ మంత్రి అమిత్ షాని మోడీ ట్రంప్ దంపతులకు పరిచయం చేసారు. 

అక్కడ ట్రంప్ కి స్వాగతం పలికేందుకు లక్షకుపైగా జనాలు అక్కడ ఉదయం నుండే సందడి చేయడం మొదలుపెట్టారు. నూతనంగా కట్టిన మొతేరా స్టేడియంలో నమస్తే ట్రంప్ అనే ఈవెంట్ లో మోడీతో కలిసి ఉపన్యసించనున్నారు. 

ట్రంప్ దంపతులు సబర్మతి ఆశ్రమంలో గాంధీ మాహాత్ముని చరఖాతో నూలు ఒడికారు. వారికి అక్కడి సహాయకులు ఎలా రాట్నం తిప్పారో నేర్పించారు. చరఖా గురించి అక్కడున్నవారిని ట్రంప్ దంపతులు అడిగి తెలుసుకున్నారు. 

సబర్మతి ఆశ్రమంలోని కుర్చీలపై ట్రంప్ దంపతులు కాసేపు కూర్చున్నారు. ఆ తర్వాత సబర్మతి ఆశ్రమాన్ని పరిశీలించారు. ప్రధాని నరేంద్ర మోడీ వారికి సబర్మతి ఆశ్రమ ప్రత్యేకతను వివరించారు.

 

అమెరికా అధ్యక్షుడు డోనాల్ట్ ట్రంప్ సబర్మతి ఆశ్రమానికి చేరుకున్నారు. సబర్మతి ఆశ్రమంలో ఆయన కండువా కప్పి స్వాగతం చెప్పారు. ఆయనతో పాటు ఆయన సతీమణి మెలానియా ట్రంప్ కూడా ఉన్నారు.

 

ట్రంప్, మోడీలు బయల్దేరారు. వారి వాహనాల కాన్వాయ్ బయల్దేరింది.

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ రెండు రోజుల పర్యటన నిమిత్తం భారత్ చేరుకున్నారు. ట్రంప్ తో పాటు ఆయన భార్య మెలేనియ ట్రంప్, కూతురు ఇవాంక, జారెడ్ కుష్ణర్ లతో కూడిన బృందంతో భారత్ లో దిగారు. ఆయన నేరుగా వాషింగ్టన్ నుండి బయల్దేరి అహ్మదాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగారు. 

దాదాపుగా 11.45 గంటలకు ట్రంప్ అహ్మదాబాద్ చేరుకోవలిసిఉన్నప్పటికీ.... అనుకున్న సమయం కన్నా ముందే ట్రంప్ విమానం ఎయిర్ ఫోర్స్ వన్ అహ్మదాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని చేరుకుంది. 

ట్రంప్ రాక కోసం అహ్మదాబాద్ నగరాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. నగర సుందరీకరణకు భారీగా ఖర్చు చేసారు. ట్రంప్ అహ్మదాబాద్ లో ఉండే మూడు గంటల కోసం దాదాపుగా 85 కోట్ల రూపాయలను వెచ్చించారు.

ట్రంప్, మోడీలు విమానాశ్రయం నుంచే మొతేరా క్రికెట్ స్టేడియం కి వెళ్లే దారిలో ఉండే మురికివాడల ప్రాంతంలో 4 అడుగుల గోడను మునిసిపల్ అధికారులు నిర్మించారు. 

దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు చెలరేగిన విషయం తెలిసిందే. ట్రంప్, మోడీ లు వెళ్లే దారిలో ఉండే మురికివాడలను దాచేయడానికే ఇలా గోడను కట్టారని ప్రతిపక్షాలు ఆరోపించాయి. ప్రభుత్వం మాత్రం ఇది గతంలో ట్రంప్ పర్యటన ఖరారు కాకముందే తీసుకున్న నిర్ణయమని, ఫుట్ పాత్ ను కబ్జాలకు గురికానీయకుండా ఈ చర్యలను చేపట్టినట్టు అధికారులు తెలిపారు. 

Follow Us:
Download App:
  • android
  • ios