భారత్‌లోకి దక్షిణాఫ్రికా నుంచి 100కు మించి చిరుత పులులు
దక్షిణాఫ్రికా నుంచి వందకు పైగా చిరుత పులులు మన దేశానికి రాబోతున్నాయి.ఈ మేరకు భారత్‌తో దీర్ఘమైన చర్చల్లో సయోధ్య కుదిరింది. ఏడాదికి 12 పులుల జంతువులను మన దేశానికి తరలించబోతున్నట్టు వివరించాయి.

జోహన్నబర్గ్: భారత దేశంలోకి మళ్లీ చిరుత పులులు రాబోతున్నాయి. 100కు పైగా చిరుత పులులను భారత దేశానికి ఇవ్వాలని సౌతాఫ్రికా ప్రభుత్వం సంకల్పించుకుంది. ఈ నిర్ణయాన్ని ప్రజలకు వెల్లడించింది. వచ్చే నెలలో 12 చిరుత పులులను భారత్‌కు తీసుకెళ్లుతామని ఎన్విరాన్‌మెంట్ మినిస్ట్రీ పేర్కొంది. గతేడాది సెప్టెంబర్‌లో నమీబియా దేశం నుంచి 8 చిరుత పులులను భారత్‌కు తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. అంతేకాదు, ప్రతి ఏడాది 12 చిరుతు పులులను భారత్‌కు అప్పగించాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. ఇలా వచ్చే ఎనిమిది నుంచి పది సంవత్సరాల వరకు ఏడాదికి 12 చిరుత పులులను తింటారు.
Also Read: జార్ఖండ్లో నరభక్షక చిరుత కలకలం.. హైదరాబాదీ వేటగాడు నవాబ్ షఫత్ అలిఖాన్ సాయం కోరిన అటవీశాఖ...
ఒకప్పుడు ఇండియాలో ఏసియాటిక్ చీతాహ్ ఉండేది. కానీ, అవి 1952 నాటికే ఈ పులులు కనుమరుగయ్యాయని, వాటి నివాస స్థావరాలు ధ్వంసం కావడమే కాదు.. వేట కారణంగా ఈ సింహాల జనాభా క్రమంగా తగ్గి కనుమరుగైంది. అయితే, సుప్రీంకోర్టు 2020లో ఓ తీర్పు వెలువరిస్తూ అఫ్రికన్ చీతాహ్‌లను దేశంలోకి తీసుకురావాలని ఆదేశించింది. అయితే, వాటిని మన దేశంలో పెంచాల్సిన లొకేషన్లను జాగ్రత్త’గా గుర్తించాలని తెలపారు.
పులులను భారత్‌లోకి తీసుకురావడానికి చాలా సమయం పట్టింది. ఆ సమయంలో పులులను కరోనా నుంచి కాపాడటానికి ముందు జాగ్రత్తగా క్వారంటైన్‌లో వేసినట్టు వివరించారు.