Asianet News TeluguAsianet News Telugu

జార్ఖండ్లో నరభక్షక చిరుత కలకలం.. హైదరాబాదీ వేటగాడు నవాబ్ షఫత్ అలిఖాన్ సాయం కోరిన అటవీశాఖ...

ఝార్ఖండ్ లో ఓ చిరుత కలకలం సృష్టిస్తోంది. నరభక్షణకు అలవాటు పడిన ఆ చిరుత ఇప్పటికే నలుగురు చిన్నారులను పొట్టన పెట్టుకుంది. దీన్ని వేటాడేందుకు హైదరాబాదీ వేటగాడు నవాబ్ షఫత్ అలిఖాన్ సాయం చేయనున్నారు. 

Hyderabadi hunter to catch Man-eating cheetah that killed 4 kids in Jharkhand
Author
First Published Jan 2, 2023, 9:51 AM IST

ఝార్ఖండ్ : జార్ఖండ్లో ఓ నరభక్షక చిరుత కలకలం సృష్టిస్తోంది. పలామూ డివిజన్లోని యాభై గ్రామాల ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. నరభక్షణకు అలవాటుపడిన చిరుత అటవీ అధికారులు దొరకకుండా.. పరిసర గ్రామాల ప్రజలను భయాందోళనలకు గురి చేస్తోంది. ఈ నరభక్షక చిరుతపులిని వేటాడడానికి జార్ఖండ్ రాష్ట్ర అటవీ శాఖ నడుంబిగించింది. ఈ నరభక్షక చిరుత గత 20 రోజుల్లో50 గ్రామాల పరిసరాల్లో..  6-12యేళ్ళ వయసున్న నలుగురు చిన్నారులను హతమార్చింది. ఎక్కడినుండో మాటువేసి.. హఠాత్తుగా దాడిచేసి పొట్టన పెట్టుకుంటోంది. 

ఈ నరభక్షక చిరుత సంచారంతో.. జాగ్రత్తగా ఉండాలని.. చీకటి పడిన తరువాత ప్రజలెవరూ బయటకు రావద్దని అధికారులు ఈ గ్రామాల్లో హెచ్చరికలు జారీ చేశారు. ఈ హెచ్చరికతో గ్రామాల్లో సాయంత్రం అవ్వగానే కర్ఫ్యూ వాతావరణం కనిపిస్తోంది. ఈ చిరుతను  పట్టుకునేందుకు అధికారులు ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తున్నారు.  ట్రాప్ కెమెరాలు, డ్రోన్ లు ఏర్పాటు చేశారు. అటవీ శాఖా పరంగా అన్ని చర్యలు తీసుకున్నారు. 

నేడు ధర్నా చౌక్ వద్ద కాంగ్రెస్ నిరసన.. టీపీసీసీ చీఫ్‌ రేవంత్ రెడ్డి హౌస్ అరెస్ట్..

ప్రస్తుతం అటవీశాఖ అధికారులు ప్రముఖ వేటగాడిగా పేరొందిన హైదరాబాదీ నవాబ్ షఫత్ అలిఖాన్ ను ఈ చిరుతను వేటాడేందుకు  సాయం కోరారు. ఈ మేరకు అటవీశాఖ అధికారులు ఆదివారం సమాచారం తెలిపారు. దీనిమీద అ జార్ఖండ్ రాష్ట్ర చీఫ్ వైల్డ్ లైఫ్ వార్డన్ శశికర్ సమంత వివరాలు తెలుపుతూ… సాధ్యమైనంతవరకు చిరుతను బంధించేందుకు ప్రయత్నిస్తామని.. దీనికోసం మత్తు ఇంజెక్షన్లు ఉపయోగిస్తామని తెలిపారు. వీటి ద్వారా కూడా ప్రయోజనం లేకపోయినట్లయితే..  తప్పనిసరి పరిస్థితుల్లో.. చివరి అవకాశంగా చిరుతను చంపేస్తామని తెలిపారు. 

ఇందుకోసం చిరుత వేటలో నిపుణుడైన  ప్రముఖ వేటగాడు నవాబ్ షఫత్ అలీఖాన్ ను సంప్రదించాలని తెలిపారు. చిరుతను వేటాడడానికి కావలసిన అత్యాధునిక సామాగ్రి అతని దగ్గర ఉన్నట్లు సమంత తెలిపారు. జనవరి మొదటి వారంలో జార్ఖండ్ కు నవాబ్ అలీఖాన్ వస్తారని  చెప్పుకొచ్చారు. పిటిఐ వార్తా సంస్థతో మాట్లాడుతూ షఫత్ అలీఖాన్ కూడా ఈ విషయాన్ని ధ్రువీకరించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios