ఆర్ధిక మోసాలు:100కి పైగా చైనా వెబ్ సైట్లపై బ్యాన్‌ కోసం చర్యలు

భారతీయులను లక్ష్యంగా  చేసుకొని  మోసాలకు పాల్పడుతున్న చైనా వెబ్ సైట్లపై  కేంద్రం  ఫోకస్ పెట్టింది.ఈ వెబ్ సైట్లను నిషేధించే ప్రక్రియపై  కేంద్రం  చర్యలు ప్రారంభించింది.

    India to ban over 100 Chinese-operated websites in crackdown on investment scams lns

న్యూఢిల్లీ: భారతీయులను లక్ష్యంగా  చేసుకొని  మోసాలకు పాల్పడుతున్న  100కి పైగా చైనా వెబ్ సైట్లను  నిషేధించే  ప్రక్రియను కేంద్రప్రభుత్వం ప్రారంభించింది.  పెట్టుబడులకు సంబంధించి  మోసాలకు పాల్పడుతున్న వెబ్ సైట్లను  కేంద్రం  చర్యలను ప్రారంభించింది. చైనా కు చెందిన వెబ్ సైట్లు  ఆర్ధిక మోసాలకు పాల్పడుతున్నందున కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. హోం మంత్రిత్వ శాఖ కేంద్ర ఐటీ శాఖను ఈ మేరకు  కొన్ని చైనాకు చెందిన వెబ్ సైట్లను బ్లాక్ చేయాలని కోరింది.

గత కొన్ని సంవత్సరాలుగా  భారత ప్రభుత్వం  దాదాపు 250 చైనా యాప్ లను కేంద్రం నిషేధించాలని ఆదేశించింది. భారతదేశ సార్వభౌమాధికారం, సమగ్రతకు, భారతదేశ రక్షణకు  ఈ వెబ్ సైట్లు విఘాతం కల్గిస్తాయని కేంద్రం భావిస్తుంది.

టిక్ టాక్, గ్జైండర్,  కామ్ స్కానర్  వంటి యాప్ లు దేశంలో  విస్తృతంగా  ఉపయోగిస్తున్నారు.  ఈ యాప్ లను  మిలియన్ల మంది డౌన్ లోడ్ చేస్తున్నారు.

ఈ యాప్ లు  వినియోగదారుల  సున్నిత డేటాను  సేకరిస్తున్నాయని ప్రభుత్వ అధికారులు చెబుతున్నారు. కీలక మైన సమాచారాన్ని శత్రు దేశంలోని సర్వర్లు ఈ డేటాను తీసుకుంటున్నాయని  అదికారులు  అభిప్రాయపడుతున్నారు. ఇటీవలనే  పబ్జీ గేమ్ ను  గూగుల్ ప్లే స్టోర్ నుండి  యాపిల్ స్టోర్ నుండి  తీసివేసిన విషయం తెలిసిందే. మరో వైపు బాటిల్ రాయల్ గేమ్ భారత్ లో చాలా ప్రజాదరణ పొందింది.  ఏడాదిలోనే వంద మిలియన్ల మంది వినియోగదారులు  ఈ గేమ్ ను డౌన్ లోడ్ చేసుకున్నారు.
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios