చమురు ఉత్పత్తులకు భారత్ ఆకర్షణీయమైంది: వేదాంత రీసోర్సెస్ చైర్మన్ అనిల్ అగర్వాల్
ప్రధాని మోడీ ఇండియా ఎనర్జీ వీక్‌లో మాట్లాడటంపై ప్రముఖ పారిశ్రామిక వేత్తలు స్పందించారు. ప్రధాని మోడీ సమావేశం అద్భుతమైనదని వివరించారు. గ్యాస్ ఉత్పత్తి, అన్వేషణలో భారత్ ఎంతో ఆకర్షణీయమైన ప్రాంతం అనే విషయంలో సందేహమే అక్కర్లేదని అన్నారు.

బెంగళూరు: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ రోజు బెంగళూరులో ఇండియా ఎనర్జీ వీక్ 2023ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎనర్జీకి సంబంధించి కీలక విషయాలను మాట్లాడారు. స్థూలంగా గైడ్‌లైన్స్, రోడ్ మ్యాప్‌ను ప్రపంచ పారిశ్రామిక వేత్తల ముందు ఉంచారు. దీనిపై ఆ పారిశ్రామిక వేత్తలు ఎంతో ఉత్తేజితులైనట్టు తెలుస్తున్నది. మీడియాతో వారు మాట్లాడుతూ తమ అభిప్రాయాలు చెప్పుకొచ్చారు.
ప్రముఖ కంపెనీ వేదాంత రీసోర్సెస్ చైర్మన్ అనిల్ అగర్వాల్ మాట్లాడుతూ ఈ రోజు నిర్వహించిన ప్రధాని మోడీ సమావేశం అద్భుతమైనదని వివరించారు. ఇండియా ఎనర్జీ వీక్ ఈవెంట్‌లో ఆయన తమను ఉద్దేశించి మాట్లాడారని తెలిపారు. ఆయిల్, గ్యాస్ ఉత్పత్తి, అన్వేషణలో భారత్ ఎంతో ఆకర్షణీయమైన ప్రాంతం అనే విషయంలో సందేహమే అక్కర్లేదని అన్నారు.
జీ 20 అధ్యక్షతను భారత్ తీసుకున్న తర్వాత ప్రపంచానికి చాలా ముఖ్యమైన సందేశాన్ని ఇస్తున్నదని పెట్రోనాస్ ప్రెస్ అండ్ గ్రూప్ సీఈవో టీఎం తౌఫిక్ అన్నారు. ఎనర్జీ మార్పులపై ఎలా వ్యవహరించాలో ప్రధాని మోడీ బలమైన గైడ్‌లైన్స్‌ను చేశారని పేర్కొన్నారు. ఆయన కాన్సెప్ట్‌ను విస్తృతం చేయడం, ఎనర్జీ జస్టిస్ కోసం పోరాటంలో ఆయన సామర్థ్యంపై తనకు అచంచల విశ్వాసం ఉన్నదని అన్నారు.
Also Read: భారత్ ప్రకాశాన్ని ఏ మహమ్మారి, ఏ యుద్ధమూ ఆపలేదు.. : ఇండియా ఎనర్జీ వీక్ లో ప్రధాని మోడీ
ప్రధాని మోడీని కలుసుకోవడం బాగుందని, హైడ్రోకార్బన్స్ అవసరం ఉన్నదని, ఆ ఎనర్జీని అందరికీ అందుబాటులోకి తేవాలనే గుర్తించడం ప్రశంసనీయం అని టెల్లురియన్ ఇంక్ ప్రెస్ అండ్ సీఈవో ఒక్టావియో సిమోస్ వివరించారు.
ప్రధాని నరేంద్ర మోడీ కర్ణాటక పర్యటనలో ఉన్నారు. ఈరోజు (ఫిబ్రవరి 6, సోమవారం) కర్ణాటకలోని బెంగళూరులో జరిగిన ఇండియా ఎనర్జీ వీక్‌ను ప్రారంభించిన సందర్భంగా ప్రధాని మోడీ మాట్లాడుతూ బెంగళూరు సాంకేతికత, ప్రతిభ-ఆవిష్కరణలతో నిండిన నగరమని పేర్కొన్నారు. తనలాగే, మీరు కూడా ఇక్కడి యువశక్తిని ముందుకు నడుపుతుండాలని అన్నారు. భారతదేశ G-20 ప్రెసిడెన్సీ క్యాలెండర్‌లో ఇది మొదటి ప్రధాన శక్తి ఈవెంట్ గా అభిర్ణించారు.