అగ్ని-5 క్షిపణి ప్రయోగం సక్సెస్

India successfully test-fires nuclear   capable Agni-5
Highlights

అగ్ని-5 క్షిపణి సక్సెస్

భువనేశ్వర్: అగ్ని-5 ఖండాంతర క్షిపణిని భారత్
విజయవంతంగా ఆదివారం నాడు పరీక్షించింది. 

స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన అగ్ని-5 ఖండాంతర  
క్షిపణిని తయారు చేసింది. ఒడిశాలోని అబ్దుల్‌  కలామ్‌
ద్వీపం నుంచి దీన్ని ప్రయోగించారు. 


అణ్వాస్త్రాలను  మోసుకెళ్లే సామర్థ్యం ఉన్న ఈ క్షిపణి
ఉపరితలం నుంచి ఉపరితలంపై 5 వేల కిలోమీటర్ల
దూరంలోని లక్ష్యాలను ఛేదించగలదు.

ఆదివారం ఉదయం 9.48 నిమిషాలకు ఇంటిగ్రేటెడ్‌ టెస్టు
రేంజ్‌లోని నాలుగో లాంచ్‌ ప్యాడ్‌ నుంచి ఈ క్షిపణిని మొబైల్‌
లాంచర్‌ సాయంతో పరీక్షించినట్లు అధికారులు తెలిపారు. 

loader