Asianet News TeluguAsianet News Telugu

బ్రహ్మోస్ క్షిపణి ప్రయోగం సక్సెస్: డీఆర్‌డీఓ

డీఆర్‌డీఓ అభివృద్ది చేసిన బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్రూయిజ్ క్షిపణిని ఇవాళ భారత్ విజయవంతంగా పరీక్షించింది.అరేబియా సముద్రంలోని లక్ష్యాన్ని ఈ క్షిపణి అత్యంత కచ్చితత్వంతో చేధించినట్టుగా డీఆర్‌డీఓ ప్రకటించింది.

India successfully test fires BrahMos supersonic cruise missile from INS Chennai lns
Author
Chennai, First Published Oct 18, 2020, 2:17 PM IST

న్యూఢిల్లీ: డీఆర్‌డీఓ అభివృద్ది చేసిన బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్రూయిజ్ క్షిపణిని ఇవాళ భారత్ విజయవంతంగా పరీక్షించింది.అరేబియా సముద్రంలోని లక్ష్యాన్ని ఈ క్షిపణి అత్యంత కచ్చితత్వంతో చేధించినట్టుగా డీఆర్‌డీఓ ప్రకటించింది.

also read:శత్రుదేశాలకు చుక్కలు: రుద్రం -1 క్షిపణి ప్రయోగం సక్సెస్

 

బ్రహ్మోస్ క్షిపణులు 400 కి.మీ. దూరంలోని లక్ష్యాలను కూడ సులువుగా చేధిస్తాయి. ఇవాళ ప్రయోగానికి వినియోగించిన ఐఎన్ఎన్ చెన్నై 2016 నుండి తన సేవలను అందిస్తోంది.

ఇండియన్ నేవీ ప్రాజెక్టు 15 ఏ లో భాగంగా ఈ క్షిపణిని స్వదేశీ టెక్నాలజీతో అభివృద్ధి చేశారు.164 మీటర్ల పొడవు, 7500 టన్నుల బరువున్న ఐఎన్ఎన్ చెన్నై రెండు మల్టీరోల్ కాంబాబ్ హెలికాప్టర్లను మోసుకెళ్లే సామర్ధ్యం ఉంది. ఇది 30 నాటికల్ మైళ్ల వేగంతో దూసుకుపోతోంది.
 

Follow Us:
Download App:
  • android
  • ios