భూకంపం చోటుచేసుకున్న టర్కీ దేశానికి భారత్ నుంచి ఎన్‌డీఆర్ఎఫ్ బృందాలు, వైద్య బృందాలు బయల్డేరుతున్నాయి. రిలీఫ్ మెటీరియల్, ఎక్విప్‌మెంట్లు కూడా వెళ్లుతున్నాయి.  

న్యూఢిల్లీ: తీవ్ర భూకంపం సంభవించిన టర్కీ దేశానికి సహాయం చేయడానికి భారత ప్రభుత్వం ముందడుగు వేసింది. భూకంప ప్రభావిత ప్రాంతంలో సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్స్ చేపట్టడానికి ఇక్కడి నుంచి ఎన్‌డీఆర్ఎఫ్ బృందాలు వెళ్లుతున్నాయి. చికిత్స అందించడానికీ మెడికల్ టీమ్‌లు వెళ్లుతున్నాయి. అంతేకాదు, అవసరమైన రిలీఫ్ మెటీరియల్, అవసరమైన ఎక్విప్‌మెంట్లనూ ఈ బృందాలు టర్కీకి తీసుకు వెళ్లుతున్నట్టు ప్రధానమంత్రి కార్యాలయం ఈ రోజు మధ్యాహ్నం ఓ ప్రకటనలో వెల్లడించింది. టర్కీకి అన్ని విధాల సహకరిస్తామని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హామీ ఇచ్చిన తర్వాత ఈ మేరకు నిర్ణయాలు జరిగాయి.

టర్కీకి వీలైన సహకారం అందించాలని ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చిన సూచనల మేరకు టర్కీలో భూకంప బాధితులకు అండగా నిలవడానికి అవసరమైన చర్యలపై చర్చించడానికి ప్రధానమంత్రికి ప్రిన్సిపల్ సెక్రెటరీ డాక్టర్ పీకే మిశ్రా సౌత్ బ్లాక్‌లో ఓ సమావేశం నిర్వహించారు. టర్కీ ప్రభుత్వంతో సమన్వయం చేసుకుని సెర్చ్ అండ్ రెస్క్యూ ఎన్‌డీఆర్ఎఫ్ టీమ్‌లు, మెడికల్ టీమ్‌లు, వారితోపాటు రిలీఫ్ మెటీరియల్‌ను వెంటనే పంపిస్తామని పీఎంవో ఓ ప్రకటనలో వెల్లడించింది. 

Scroll to load tweet…

100 మంది సిబ్బందితో రెండు ఎన్‌డీఆర్ఎఫ్ బృందాలను, ప్రత్యేక శిక్షణ పొందిన కుక్కలు, అవసరమైన ఇతర ఎక్విప్‌మెంట్లు రెడీగా ఉన్నాయని, ఏ క్షణంలోనైనా టర్కీకి ఎగిరెళ్లవచ్చునని ఆ ప్రకటనలో కేంద్రం తెలిపింది. శిక్షణ పొందిన వైద్యులు, పారామెడిక్స్‌లతోపాటు అత్యవసరమైన మెడిసిన్స్‌ను వెంట తీసుకెళ్లనున్నట్టు వివరించింది. టర్కీ ప్రభుత్వం, అంకారాలోని ఇండియన్ ఎంబసీ, ఇస్తాంబుల్‌లోని కాన్సులేట్ జనరల్ ఆఫీసు సమన్వయంలో వీటిని త్వరలోనే పంపించబోతున్నట్టు తెలిపింది. 

Also Read: టర్కీ, సిరియా భూకంపం మృతులకు ప్రధాని మోడీ సంతాపం.. ఈ విషాదం ఎంతో బాధ‌ను క‌లిగించింద‌ని వ్యాఖ్య

ఈ సమావేశంలో క్యాబినెట్ కార్యదర్శి, హోం వ్యవహారాల శాఖ, ఎన్‌డీఎంఏ, ఎన్‌డీఆర్ఎఫ్, డిఫెన్స్ శాఖ, విదేశాంగ వ్యవహారాల శాఖ, పౌర విమానయాన శాఖ, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖల ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.