న్యూఢిల్లీ:దేశంలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. సోమవారం నాడు ఉదయానికి కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 17,265కి చేరుకొన్నాయి. ఇందులో 14,175 యాక్టివ్ కేసులు ఉన్నట్టుగా ప్రభుత్వం ప్రకటించింది.

కరోనా వైరస్ సోకి ఆసుపత్రుల్లో చికిత్స పొందిన వారిలో 2546 మంది ఆసుపత్రుల నుండి డిశ్చార్జ్ అయ్యారు. గత 24 గంటల్లో 1,553 మంది కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అంతేకాదు 36 మంది మరణించారు.ఇప్పటివరకు  సుమారు 543 మంది చనిపోయినట్టుగా కేంద్రం ప్రకటించింది.

మహారాష్ట్రలో ఇప్పటివరకు 3651 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ రాష్ట్రంలో ఇప్పటివరకు 211 మంది మరణించారు. ఆ తర్వాతి స్థానంలో ఢిల్లీ రాష్ట్రం నిలిచింది. ఈ రాష్ట్రంలో 2000 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 45 మంది మరణించారు.

దేశంలో ఏప్రిల్ 19వ తేదీ నాటికి దేశంలో 4,01,586 మంది శాంపిల్స్ సేకరించినట్టుగా ఐసీఎంఆర్ ప్రకటించింది. బీహార్ రాష్ట్రంలో 96 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇందులో 52 యాక్టివ్ కేసులు. ఈ వైరస్ సోకిన వారిలో 42 మంది రికవరీ అయ్యారు. ఇప్పటివరకు రాష్ట్రంలో ఇద్దరు మృతి చెందారు.

also read:పెళ్లి కోసం 850 కి.మీ. సైకిల్‌పై: ఇంటికి చేరకుండానే క్వారంటైన్‌కి

ఇక రాజస్తాన్ రాష్ట్రంలో 17 కొత్త కేసులు నమోదయ్యాయి. కొత్తగా 8 కేసులు  జైపూర్ పట్టణానికి చెందినవే.రాష్ట్రంలో 1,495 కేసులు నమోదయ్యాయి.ఒడిశాలో గత 24 గంటల్లో ఒక్క కేసు కూడ నమోదు కాలేదు. రాష్ట్రంలో ఇప్పటికి 68 కేసులు నమోదయ్యాయి. 24 మంది ఈ వ్యాధి నుండి కోలుకొన్నారు. ఒక్కరు మృతి చెందారు.

కేరళ రాష్ట్రంలోని 14 జిల్లాల్లో 88 స్థానిక సంస్థలు హాట్ స్పాట్స్ గా గుర్తించినట్టుగా ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. బెంగాల్ రాష్ట్రంలో 150 మంది లాక్ డౌన్ నిబంధనలను ఉల్లంఘించినందుకు గాను అరెస్ట్ చేసినట్టుగా ఆ రాష్ట్ర పోలీసులు ప్రకటించారు.యూపీ రాష్ట్రంలోని నోయిడాలో 24 గంటల్లో రెండు కొత్త కేసులునమోదయ్యాయి.దీంతో రాష్ట్రంలో కేసుల సంఖ్య 97కి చేరుకొన్నాయి.