పెళ్లి కోసం 850 కి.మీ. సైకిల్‌పై: ఇంటికి చేరకుండానే క్వారంటైన్‌కి
పెళ్లి కోసం స్వంత గ్రామానికి చేరుకోవాలని భావించిన సోనూ కుమార్ అనే యువకుడు సైకిల్ 850 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేశాడు. 150 కిలోమీటర్లు ప్రయాణం చేస్తే స్వగ్రామానికి చేరుకొనేవాడు. అయితే తమ గ్రామానికి సమీపంలోనే పోలీసులు అతడిని ఆపి క్వారంటైన్ కి తరలించారు.
న్యూఢిల్లీ: పెళ్లి కోసం స్వంత గ్రామానికి చేరుకోవాలని భావించిన సోనూ కుమార్ అనే యువకుడు సైకిల్ 850 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేశాడు. 150 కిలోమీటర్లు ప్రయాణం చేస్తే స్వగ్రామానికి చేరుకొనేవాడు. అయితే తమ గ్రామానికి సమీపంలోనే పోలీసులు అతడిని ఆపి క్వారంటైన్ కి తరలించారు.
ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని మహారాజ్‌గంజ్ జిల్లాలోని పిప్రా రసూల్ పుర గ్రామం.ఈ నెల 15 వ తేదీన సోనూ పెళ్లి చేయాలని పెద్దలు నిర్ణయం తీసుకొన్నారు.
సోనూకుమార్ ఉపాధి కోసం పంజాబ్ రాష్ట్రంలోని లూథియానా టెక్స్‌టైల్స్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్నాడు. అయితే లాక్ డౌన్ కారణంగా బస్సులు, రైళ్లు నడవడం లేదు.
అయితే పెద్దలు నిర్ణయించిన ముహుర్తానికే పెళ్లి చేసుకోవాలని సోనూ భావించాడు. దీంతో సైకిల్ పై పంజాబ్ రాష్ట్రంలోని లూథియానా నుండి తన స్వంత గ్రామానికి వెళ్లాలని భావించాడు.
తనకు తోడుగా ఇద్దరు స్నేహితులను తోడుగా తీసుకొని సైకిల్ పై బయలుదేరాడు. పంజాబ్ నుండి ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రానికి సైకిల్ బయలుదేరాడు. 850 కిలోమీటర్లు సైకిల్ పై ప్రయాణం చేశాడు.
తన స్వగ్రామానికి 150 కిలోమీటర్ల దూరంలో సోనూను పోలీసులు నిలిపివేశారు. తాను పెళ్లి చేసుకోనేందుకు స్వంత గ్రామానికి సైకిల్ పై వస్తున్నట్టుగా పోలీసులకు వివరించారు. తనను గ్రామానికి వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని కోరాడు. కానీ పోలీసులు అనుమతి ఇవ్వలేదు. తొలుత క్వారంటైన్ కి వెళ్లాల్సిందేనని పోలీసులు తేల్చి చెప్పారు. ఆయనతో పాటు ఆయన ఇద్దరు మిత్రులను క్వారంటైన్ కు తరలించారు.
also read:లాక్‌డౌన్ ఎఫెక్ట్: ఏడు కి.మీ నడిచి డెంటల్ ఆసుపత్రిలో ప్రసవం