న్యూఢిల్లీ: ఇండియాలో  కరోనా కేసులు  మూడో రోజు లక్షలోపు నమోదయ్యాయి. అయితే బుధవారం నాటితో పోలిస్తే కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. కానీ  దేశంలో కరోనాతో రికార్డు స్థాయిలో మరణాలు చోటుచేసుకొన్నాయి. ఇండియాలో తొలిసారిగా కరోనాతో 6 వేలకు పైగా మరణించడం ఇదే తొలిసారి.

దేశంలో గత 24 గంటల్లో  94,052 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో కరోనా కేసుల సంఖ్య  29,183,121కి చేరుకొన్నాయి. కరోనాతో గత 24 గంటల్లో  6,148 మంది మరణించారు.  దేశంలో కరోనాతో మరణించిన వారి సంఖ్య 3,59,676కి చేరుకొంది. గత 24 గంటల్లో 1.51 లక్షల మంది కరోనా నుండి కోలుకొని ఆసుపత్రుల నుండి డిశ్చార్జ్ అయ్యారు.

also read:ఇండియాలో తగ్గుతున్న కరోనా:రెండో రోజూ లక్షలోపు కోవిడ్ కేసులు

గత 24 గంటల్లో తమిళనాడులో 17,321 కేసులు నమోదయ్యాయి.మహారాష్ట్రలో 19,989, కర్ణాటకలో 10,959, ఆంధ్రప్రదేశ్ లో 8,766, ఢిల్లీలో 337, పశ్చిమ బెండాల్ లో 5,384  కేసులు రికార్డయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ నివేదిక తెలిపింది.మహారాష్ట్రలో 58,63,880, కర్ణాటకలో27,28,248, తమిళనాడులో22,92,025, ఆంధ్రప్రదేశ్ లో17,79,773 కరోనా కేసులు  నమోదయ్యాయని వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది.