న్యూఢిల్లీ:గత 24 గంటల్లో  మరోసారి లక్షలోపు కరోనా కేసులు ఇండియాలో నమోదయ్యాయి దేశంలో 92,596 కరోనా కేసులు రికార్డయ్యాయి. వరుసగా దేశంలో రెండో రోజు కరోనా కేసులు లక్షకు దిగువన నమోదయ్యాయి. అయితే నిన్నటితో పోలిస్తే కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి.కరోనాతో  2,219 మంది మరణించారు. దేశంలో ఇప్పటివరకు 29,089,069 కేసులు నమోదైనట్టుగా కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ గణాంకాలు చెబుతున్నాయి.

కరోనాతో దేశంలో ఇప్పటివరకు 3,58,,528 మంది మరణించారు. తమిళనాడు రాష్ట్రంలో గత 24 గంటల్లో 18,023 కేసులు రికార్డయ్యాయి. కేరళలో15,567 కేసులు, మహారాష్ట్రలో 10,891 , ఆంద్రప్రదేశ్ లో 7796 కేసులు , ఢిల్లీలో 816, పశ్చిమబెంగాల్ లో 8427 కేసులు రికార్డయ్యాయి. మహారాష్ట్రలో ఇప్పటివరకు 58,52,891 కేసులు, కర్ణాటకలో 27,17,289, కేరళలో 26,57,962 కేసులు, తమిళనాడులో 22,74,704 కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య తగ్గుతున్నాయి. అయితే అదే సమయంలో రికవరీ కేసుల సంఖ్య పెరగడం కూడ ఊరట నిస్తోంది. కరోనా యాక్టివ్ కేసుల రేటు 4.50 శాతానికి చేరింది. రికవరీ రేటు 94.29 శాతానికి చేరింది.