భారత్ లో రెండో కరోనా వైరస్ కేసు: భారత్ సంచలన ఆదేశాలు
భారత్ రెండో కరోనా వైరస్ కేసు నమోదైంది. కేరళలోని ఓ విద్యార్థికి కరోనా వైరస్ సోకినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. చైనాలోని వూహన్ విశ్వవిద్యాలయం నుంచి వచ్చిన విద్యార్థిని ఐసోలేషన్ వార్డులో చేర్చారు.
న్యూఢిల్లీ: భారతదేశంలో రెండో కరోనా వైరస్ కేసు నమోదైంది. కేరళ రాష్ట్రంలో ఒకరికి కరోనావైరస్ సోకినట్లు నిర్ధారణ అయింది. వూహన్ విశ్వవిద్యాలయం నుంచి జనవరి 24వ తేదీన తిరిగి వచ్చిన విద్యార్థికి పరీక్షలు నిర్వహించగా కరోనా వైరస్ సోకినట్లు నిర్ధారణ అయినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. అలప్పుజాలోని ప్రభుత్వ వైద్య కళాశాలలోని ఐసోలేషన్ వార్డులో అతన్ని చేర్చారు.
రోగి పరిస్థితి నిలకడగా ఉందని, ఆస్పత్రిలోని ఐసోలేషన్ వార్డులో అతనిపై తగిన దృష్టి కేంద్రీకరిస్తున్నారని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. జాతీయ వైరాలజీ సంస్థ నుంచి ఇంకా నివేదిక రావాల్సి ఉందని ఆరోగ్య శాఖ మంత్రి కె. కె. శైలజ చెప్పారు.
Also Read: కరోనా వైరస్ దెబ్బకు చైనా స్టాక్ మార్కెట్లు విలవిల
కరోనా వైరస్ విస్తృతంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం తాజాగా సంచలన ఆదేశాలు జారీ చేసింది. చైనా దేశాన్ని కరోనా వైరస్ వణికిస్తున్న నేపథ్యంలో ఆ దేశంలో నివాసం ఉంటున్న విదేశళీయులకు, చైనావాసులవకు ఈ - వీసాల జారీ నిలిపేయాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది.
గత నెల 15వ తేదీ నుంచి చైనా నుంచి భారతదేశానికి వచ్చినవారిని నిర్బంధించి ఆస్పత్రుల్లోని ఐసోలేషన్ వార్డులకు తరలిస్తోంది. చైనావాసులకు, చైనాలో నివసిస్తున్న విదేశీయులకు ఆదివారం నుంచి వీసాల జారీని తాత్కాలికంగా నిలిపివేయాలని ఆదేశిలంచింది.
See video: కరోనా వైరస్ : చైనాలోని భారతీయులు తిరిగి సొంతగూటికి..
ఇప్పటి వరకు 445 విమానాల ద్వారా 58,658 మంది ప్రయాణికులు భారతదేశానికి వచ్చారు. కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో భారత ప్రభుత్వం 24 గంటలు పనిచేసే విదంగా హెల్ప్ లైన్ ను ప్రారంభించింది. చైనా నుంచి వచ్చినవారిలో 142 మందికి కరోనా వైరస్ లక్షలున్నాయని తేలిది. కేరళలోని ఇద్దరికి కరోనా వైరస్ సోకినట్లు నిర్ధారణ అయింది.