Asianet News TeluguAsianet News Telugu

119.38 కోట్ల డోసుల మార్క్ ను దాటిన జాతీయ కొవిడ్‌-19 టీకా కార్యక్రమం...

ఈ రోజు ఉదయం 7 గంటల వరకు ఉన్న తాత్కాలిక సమాచారం ప్రకారం, గత 24 గంటల్లో ఇచ్చిన 90,27,638 డోసులతో కలిపి, 119.38 కోట్ల డోసులను ( 1,19,38,44,741 ) టీకా కార్యక్రమం అధిగమించింది. 1,23,73,056 సెషన్ల ద్వారా ఇది సాధ్యమైంది.

India s Cumulative COVID-19 Vaccination Coverage exceeds 119.38 Cr
Author
Hyderabad, First Published Nov 25, 2021, 2:08 PM IST

భారతదేశ జాతీయ కొవిడ్‌-19 టీకా కార్యక్రమం119.38 కోట్ల డోసులను దాటి పోయింది. గడిచిన 24 గంటల్లో 90.27 లక్షల కంటే ఎక్కువ మోతాదులు వ్యాక్సినేట్ చేయబడ్డాయి. దీంతో దేశంలో కరోనా వ్యాప్తి అదుపులోనే ఉంది. వరుసగా రెండో రోజు 9వేల పై చిలుకు కొత్త కేసులు నమోదయ్యాయి. కేంద్రం-రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల నిరంతర, సహకార ప్రయత్నాల కారణంగా, వరుసగా 151వ రోజు కూడా 50,000 కంటే తక్కువ రోజువారీ కొత్త కేసులు నమోదయ్యాయి.

గత 62 రోజులలో వీక్లీ పాజిటివిటీ రేటు (0.90%) 2% కంటే తక్కువగానే నమోదవుతూ వస్తోంది. ఈ రోజు ఉదయం 7 గంటల వరకు ఉన్న తాత్కాలిక సమాచారం ప్రకారం, గత 24 గంటల్లో ఇచ్చిన 90,27,638 డోసులతో కలిపి, 119.38 కోట్ల డోసులను ( 1,19,38,44,741 ) టీకా కార్యక్రమం అధిగమించింది. 1,23,73,056 సెషన్ల ద్వారా ఇది సాధ్యమైంది.

ఈరోజు ఉదయం 7 గంటల వరకు అందుబాటులో ఉన్న తాత్కాలిక నివేదికల ప్రకారం టీకాలు తీసుకున్న వారి వివరాలు ఇలా విభజించారు. 

- ఆరోగ్య సిబ్బందిలో  మొదటి డోసు 1,03,82,870పూర్తి కాగా, రెండో డోసు 94,36,705మందికి పూర్తయ్యింది.

- ఫ్రంట్‌లైన్‌ సిబ్బందిలో మొదటి డోసు తీసుకున్నవారు 1,83,77,133మంది ఉండగా,  రెండో డోసు కూడా పూర్తయినవారు 1,63,83,806గా ఉన్నారు. 

- ఇక దేశవ్యాప్తంగా  18-44 ఏళ్ల వారి విషయానికి వస్తే..  మొదటి డోసు 44,85,35,082 మంది పూర్తయ్యింది. రెండో డోసు 20,36,38,734 పూర్తయ్యింది. 

- 45-59 ఏళ్ల వారిలో మొదటి డోసు 18,22,43,827మందికి పూర్తవగా,  రెండో డోసు 11,46,46,368 మందికి పూర్తయ్యింది. 

ఇండియాలో పెరిగిన కరోనా రోగుల రికవరీ: మొత్తం కేసులు 3,45,35,763కి చేరిక

-  60 ఏళ్లు పైబడినవారిలో మొదటి డోసు 11,41,31,257 పూర్తయ్యింది.  7,60,68,959 మందికి రెండో డోసు కూడా పూర్తయ్యింది. ఈ మేరకు మొత్తం వ్యాక్సిన్ తీసుకున్నవారి సంఖ్య 1,19,38,44,741కు చేరుకుంది. 

ఇక గత 24 గంటల్లో 10,264 మంది రోగులు కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో, మహమ్మారి ప్రారంభమైనప్పటి నుంచి కోలుకున్న వారి సంఖ్య 3,39,67,962 కు పెరిగింది. అలాగే దేశవ్యాప్త రికవరీ రేటు 98.33 శాతానికి చేరింది.

క్రియాశీల కేసులు 2 లక్షల కంటే తక్కువగా, 1,09,940 వద్ద ఉన్నాయి. పాజిటివ్ కేసుల శాతం కూడా (0.32) 2020 మార్చి నుంచి కనిష్ట స్థాయి. దేశవ్యాప్తంగా కరోనా పరీక్షల సామర్థ్యాన్ని పెంచుతూనే ఉన్నారు. గత 24 గంటల్లో మొత్తం 11,50,538 పరీక్షలు చేశారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 63.59 కోట్లకు పైగా ( 63,59,24,763 ) పరీక్షలు నిర్వహించారు.

వారపు పాజిటివిటీ రేటు 0.90 శాతంగా ఉంది. గత 62 రోజులుగా 2 శాతం కంటే తక్కువగా నమోదవుతోంది. రోజువారీ పాజిటివిటీ రేటు 0.79 శాతంగా ఉంది. రోజువారీ పాజిటివిటీ రేటు గత 52 రోజులుగా 2 శాతం కంటే తక్కువగా, 87 రోజులుగా 3 శాతం కంటే తక్కువగా నమోదవుతోంది. 

ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 3.45 కోట్లకు చేరగా,  4,66,980మంది ప్రాణాలు కోల్పోయారు. ఒక్క కేరళలో 4,280 కొత్త కేసులు, 308 మరణాలు నమోదయ్యాయి. ఈ మేరకు గురువారం కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. మహమ్మారి వ్యాప్తి కట్టడిలోనే ఉండటంతో క్రియాశీల కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టి 539 రోజుల కనిష్టానికి చేరింది. 

దీంతో కరోనా బాధితుల సంఖ్య 1,09,940కి తగ్గింది. నిన్న 10,264 మంది కోలుకున్నారు. ఇప్పటివరకు మొత్తం 3.39 కోట్ల మంది కోవిడ్ నుంచి బయటపడ్డారు. క్రియాశీల రేటు 0.32 శాతానికి తగ్గగా.. రికవరీ రేటు 98.33 శాతానికి పెరిగింది. మరోపక్క నిన్న 90 లక్షల మందికి పైగా టీకా వేయించుకున్నారు. ఇప్పటివరకు మొత్తం డోసుల పంపిణీ 119కోట్ల మార్కు దాటినట్లు కేంద్రం వెల్లడించింది. 

Follow Us:
Download App:
  • android
  • ios