యాసిన్ మాలిక్ శిక్షను వ్యతిరేకించిన ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్‌ కు భారత్ చివాట్లు పెట్టింది. ప్రపంచం అంతా ఉగ్రవాదానికి వ్యతిరేకంగా శూన్య సహనాన్ని కోరుకుంటోందని తెలిపింది. యాసిన్ మాలిక్ ను సమర్థించడం సరికాదని చెప్పింది. 

యాసిన్ మాలిక్ కేసులో కోర్టు నిర్ణయాన్ని ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్ విమర్శించడంపై భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. OIC వ్యాఖ్య‌లు ఆమోద్య‌యోగ్యం కాద‌ని మండిప‌డింది. ఈ విషయమై భారత విదేశాంగ శాఖ ఒక ప్రకటన విడుదల చేస్తూ.. కోర్టులో ఇచ్చిన సాక్ష్యాలు, సాక్ష్యాధారాల ఆధారంగా యాసిన్ మాలిక్‌కు శిక్ష విధించినట్లు పేర్కొంది. 

మనవరాలిమీద లైంగిక వేధింపులు.. కోడలు ఫిర్యాదు.. మనస్తాపంతో మాజీ మంత్రి ఆత్మహత్య....

ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్న యాసిన్ మాలిక్ శిక్ష విధించ‌డం ప‌ట్ల ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్ మానవ హక్కుల కమిషన్ సానుభూతి వ్యక్తం చేసింది. దానికి స్పందించిన భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ఓ ప్ర‌క‌ట‌న‌ను విడుద‌ల చేస్తూ తీవ్రంగా ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. ప్రపంచం ఉగ్రవాదం పట్ల శూన్య సహనాన్ని కోరుకుంటోందని తెలిపింది. కాబట్టి యాసిన్ మాలిక్ ను ఏ విధంగానూ సమర్థించరాదని తాము OICని కోరుతున్నామ‌ని ప్ర‌క‌ట‌న తెలిపింది. 

ఉగ్రవాదానికి నిధులు సమకూర్చిన కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) కోర్టు బుధవారం జమ్మూ కాశ్మీర్‌కు చెందిన ఉగ్రవాది యాసిన్ మాలిక్‌కు జీవిత ఖైదు విధించింది. NIA కోర్టు మాలిక్‌కు జీవిత ఖైదు విధిస్తూ.. రూ. 10 లక్షల జరిమానా కూడా క‌ట్టాల‌ని ఆదేశించింది. 

మ‌ద‌ర్సాలో పిల్ల‌ల‌పై చిత్ర‌హింస‌లు.. గొలుసుల‌తో బంధించి, బెత్తంతో కొట్టి.. వీడియో వైర‌ల్..

అయితే ఈ తీర్పుపై గురువారం రోజు ఇస్లామిక్ గ్రూప్ మానవ హక్కుల విభాగం యాసిన్ మాలిక్‌కు శిక్ష విధించడాన్ని ఖండించింది. ఈ తీర్పు కాశ్మీరీ ముస్లింలపై క్రమబద్ధమైన భారత పక్షపాతం, హింసను ప్రతిబింబిస్తోందని పేర్కొంది. భారతదేశంలో నకిలీ విచారణ తర్వాత కల్పిత ఆరోపణలపై ప్రముఖ కాశ్మీరీ రాజకీయ నాయకుడు యాసిన్ మాలిక్‌ను అక్రమంగా శిక్షిస్తోంద‌ని ఆరోపించింది. అమాయక కశ్మీరీలపై ఇలాంటి మానవ హక్కుల ఉల్లంఘన చర్యలు కాశ్మీరీల స్వయం నిర్ణయాధికారం, చట్టబద్ధమైన హక్కును హరించే లక్ష్యంతో ఉన్నాయని తెలిపింది. ఇది భారత న్యాయాన్ని అపహాస్యం చేయడమే కాకుండా ప్రజాస్వామ్య వాదనలను కూడా బహిర్గతం చేస్తుంద‌ని చెప్పింది. 

Monsoon Rains: రాబోయే 2-3 రోజుల్లో కేరళకు నైరుతి రుతుపవనాలు: IMD

యాసిక్ మాలిక్ ఒక కాశ్మీర్ వేర్పాటు వాది. ఆయ‌న కాశ్మీర్ లోయలో ఉగ్రవాదానికి నిధులు సమకూర్చడం, ఉగ్రవాదాన్ని వ్యాప్తి చేయడం, వేర్పాటువాద కార్యకలాపాలకు పాల్పడినట్లు ద‌ర్యాప్తులో తేలింది. దీంతో మాలిక్ పై చట్టవిరుద్ధ కార్యకలాపాల నిరోధక చట్టం (UAPA), ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్లు 120-బి (నేరపూరిత కుట్ర), 124-ఏ (దేశద్రోహం) కింద అభియోగాలను ఎదుర్కొన్నాడు. మే 10 న మాలిక్ తన నేరాన్ని అంగీకరించాడు. తాను ఎలాంటి ఆరోపణలను సవాలు చేయబోనని కోర్టుకు తెలిపారు. అయితే మే 25న కోర్టు అత‌డికి శిక్ష‌ను ఖ‌రారు చేసింది.