భారత్‌లో కరోనా మహమ్మారి కలకలం కొనసాగుతుంది. రోజురోజుకు నమోదవుతున్న కొత్త కేసుల సంఖ్య భారీగా పెరుగుతుంది. మరోవైపు Omicron కేసుల సంఖ్య కూడా భారీగా పెరుగుతుంది. 

భారత్‌లో కరోనా మహమ్మారి కలకలం కొనసాగుతుంది. రోజురోజుకు నమోదవుతున్న కొత్త కేసుల సంఖ్య భారీగా పెరుగుతుంది. గడిచిన 24 గంటల్లో భారత్‌లో కొత్తగా 2,64,202 మందికి covid పాజిటివ్‌గా నిర్దారణ అయింది. అది కిందటి రోజు నమోదైన కేసులతో పోలిస్తే 4.87 శాతం అధికం. ఇక, తాజాగా కరోనాతో 315 మరణించారు. దీంతో దేశంలో మొత్తం కరోనా మృతుల సంఖ్య 4,85,350కి చేరింది. నిన్న కరోనా నుంచి 1,09,345 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటివరకు కోలుకున్నవారి సంఖ్య 3,48,24,706కి చేరింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ శుక్రవారం ఉదయం బులిటెన్ విడుదల చేసింది.

ప్రస్తుతం దేశంలో 12,72,073 కరోనా యాక్టివ్ కేసుల ఉన్నాయి. కరోనా కేసుల పెరుగుదలతో దేశంలో రోజువారీ కరోనా పాజిటివిటీ రేటు కూడా పెరుగుతుంది. ప్రస్తుతం ఇది 14.78 శాతంగా ఉంది. మరోవైపు వీక్లీ పాజిటివిటీ రేటు 11.83 శాతంగా ఉంది. ప్రస్తుతం దేశంలో రికవరీ రేటు.. 95.20 శాతంగా, యాక్టివ్ కేసులు.. 3.48 శాతంగా ఉన్నాయి.

దేశంలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా కొనసాగుతుంది. నిన్న దేశంలో 73,08,669 డోసుల వ్యాక్సిన్ పంపిణీ జరిగింది. దీంతో ఇప్పటివరకు పంపిణీ చేసిన డోసుల సంఖ్య 1,55,39,81,819కి చేరింది. 

మరోవైపు దేశంలో ఒమిక్రాన్ కేసులు కూడా పెరుగుతున్నాయి. దేశంలో ఇప్పటివరకు 5,753 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వివరాలు వెల్లడించింది.