భారత్‌లో కొత్తగా 16,156 కరోనా కేసులు .. 3.42 కోట్లకు చేరిన మొత్తం సంఖ్య
భారత్‌లో (corona cases in india) కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. కొత్తగా 16 వేల కొత్త కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. బుధవారం 12,90,900 మందికి కొవిడ్ నిర్ధారణా పరీక్షలు నిర్వహించగా.. 16,156 మందికి పాజిటివ్‌గా తేలింది.
భారత్‌లో (corona cases in india) కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. కొత్తగా 16 వేల కొత్త కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. బుధవారం 12,90,900 మందికి కొవిడ్ నిర్ధారణా పరీక్షలు నిర్వహించగా.. 16,156 మందికి పాజిటివ్‌గా తేలింది. ఇది ముందురోజు కంటే దాదాపు 3 వేలు అదనం. ఇక వైరస్ వల్ల 733 మంది ప్రాణాలు కోల్పోయారు. తాజా కేసులతో కలిపి దేశంలో ఇప్పటి వరకు 3.42 కోట్ల మందికి వైరస్ సోకగా.. 4,56,386 మంది ప్రాణాలు కోల్పోయారు.
కాగా.. దేశంలో ఇటీవల వైరస్ వ్యాప్తి మందగించింది. ఫలితంగా రికవరీ రేటు, క్రియాశీల రేటు మెరుగవుతున్నాయి. ప్రస్తుతం రికవరీ రేటు 98.20 శాతానికి చేరగా, క్రియాశీల కేసుల రేటు 0.47 శాతానికి తగ్గింది. నిన్న 17,095 మంది కోలుకోగా.. మొత్తంగా 3.36 కోట్ల మంది కరోనాను జయించారు. దేశంలో ప్రస్తుతం 1,60,989 యాక్టీవ్ కేసులు వున్నాయి. బుధవారం దేశంలోని 49,09,254 మంది కరోనా టీకా వేయించుకున్నారు. దీంతో భారత్‌లో ఇప్పటి వరకు పంపిణీ అయిన డోసుల సంఖ్య 104 కోట్లకు చేరింది.
మరోవైపు అత్యంత వేగంగా వ్యాపించే రకంగా చెబుతున్న డెల్టా సబ్ వేరియంట్ (ఏవై.4.2) ఇప్పుడు కర్ణాటకలో కలకలం సృష్టిస్తున్నది. తాజాగా ఒకే రోజు Bengaluruలో మూడు ఈ రకం కరోనా కేసులు నమోదయ్యాయి. ఇప్పటికే Karnatakaలో వేర్వేరు ప్రాంతాల్లో నాలుగు కేసులు రిపోర్ట్ అయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఈ కొత్త Delta Subvariantపై ఆందోళనలు వినిపిస్తున్నాయి. రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ డీ రందీప్ బుధవారం విలేకరులతో ఈ విషయంపై మాట్లాడారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఏడు డెల్టా AY.4.2 వేరియంట్ కేసులున్నాయని వెల్లడించారు. ఇందులో మూడు కేవలం బెంగళూరు నగరంలోనే ఉన్నాయని తెలిపారు. మిగతా నాలుగు రాష్ట్రంలోని వేర్వేరు ప్రాంతాల్లో ఉన్నాయని చెప్పారు. రాష్ట్రంలో కరోనా కట్టడికి ప్రభుత్వం అప్రమత్తంగా ఉన్నదని, ఇప్పటికీ కట్టడి చర్యలు తీసుకుంటున్నదని వివరించారు.
ALso Read:బెంగళూరులో డెల్టా సబ్ వేరియంట్ కేసులు.. కొత్తరకం కరోనాపై రాష్ట్రంలో ఆందోళనలు
అటు యూకేలో గుర్తించిన ఈ కరోనావైరస్ డెల్టా సబ్ వేరియంట్‌పై కేంద్ర ప్రభుత్వమూ స్పందించింది. ఈ సబ్ వేరియంట్‌ను కేంద్ర ప్రభుత్వ నిపుణుల కమిటీ పరిశీలిస్తున్నదని కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవీయా వివరించారు. ఇప్పటికే కర్ణాటక, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌లలో కరోనా కేసులు వెలుగుచూశాయి. దీంతో కేంద్ర ప్రభుత్వమూ అప్రమత్తమయింది. యూకేలో ఈ వేరియంట్ విజృంభిస్తున్నదని న్యూక్యాజిల్‌లోని నార్తంబ్రియా యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్త వివరించారు. గత కొన్ని నెలలుగా దేశంలో ఈ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయని తెలిపారు. గత 28 రోజుల్లో నమోదైన కొత్త కేసుల్లో 63శాతం ఈ సబ్ వేరియంట్ కేసులే ఉన్నాయని చెప్పారు. అయితే, ఈ వేరియంట్‌ను ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళనకారక వేరియంట్‌గా గుర్తించలేదు.
యూకే సహా చైనాలోనూ డెల్టా వేరియంట్ కలకలం రేపుతున్నది. చైనాలో డెల్టా కేసుల సంఖ్య స్వల్పంగా ఉన్నప్పటికీ వేర్వేరు ప్రదేశాల్లో అంటే 11 ప్రావిన్స్‌లలో ఈ కేసులు రిపోర్ట్ అయ్యాయి. మరీ ఆందోళనకర విషయమేమంటే.. కొన్ని టూరిస్టు గ్రూపుల్లో కరోనా వైరస్ కేసులు రిపోర్ట్ అయ్యాయి. దీంతో ఈ కేసులు విస్తారంగా నమోదయ్యే ముప్పు ఉన్నదని స్థానిక అధికారులు హెచ్చరిస్తున్నారు. డెల్టా వేరియంట్ కేసులు నమోదవడంపై కలవరపడుతున్నారు. ఇప్పటికే చాలా చోట్ల కఠిన లాక్‌డౌన్‌ను అమలు చేస్తున్నది.