Asianet News TeluguAsianet News Telugu

భారత్‌లో అదుపులోనే కరోనా.. కొత్తగా 8,954 కేసులు, ఒమిక్రాన్‌పై కొనసాగుతున్న నిఘా

భారత్‌లో మంగళవారం 11,08,467 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 8,954 మందికి వైరస్ పాజిటివ్‌గా తేలినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ (corona cases in india) ప్రకటించింది. కొత్త కేసులు 10వేలకు దిగువనే ఉన్నప్పటికీ.. ముందురోజు కంటే పెరిగాయి. గడిచిన 24 గంటల్లో 10,207 మంది కొవిడ్ నుంచి కోలుకున్నారు. 

india reports 8,954 new corona cases
Author
New Delhi, First Published Dec 1, 2021, 11:36 AM IST

దేశంలో కోవిడ్ మహమ్మారి వ్యాప్తి కట్టడిలోనే ఉన్నట్లుగా తెలుస్తోంది. కొత్త కేసులు అదుపులోనే ఉండటంతో పాటు క్రియాశీలక కేసులు గణనీయంగా తగ్గుముఖం పట్టాయి. తాజాగా అవి లక్ష దిగువకు చేరడంతో ప్రభుత్వ వర్గాలు ఊపీరి పిల్చుకుంటున్నాయి. ఈ మేరకు బుధవారం కేంద్ర ఆరోగ్య శాఖ గణాంకాలను వెల్లడించింది. దీనికి సంతోషిస్తున్నప్పటికీ.. ప్రపంచవ్యాప్తంగా ఒమిక్రాన్ వేరియంట్ కలకలం నేపథ్యంలో కేంద్రం ఆందోళన చెందుతోంది. ఈ సమయంలో ప్రజలు ఏ మాత్రం అలసత్వం ప్రదర్శించకుండా జాగ్రత్తలు పాటించాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. 

మంగళవారం 11,08,467 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 8,954 మందికి వైరస్ పాజిటివ్‌గా తేలినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ (corona cases in india) ప్రకటించింది. కొత్త కేసులు 10వేలకు దిగువనే ఉన్నప్పటికీ.. ముందురోజు కంటే పెరిగాయి. గడిచిన 24 గంటల్లో 10,207 మంది కొవిడ్ నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో యాక్టీవ్ కేసులు సంఖ్య 99,023(0.29 శాతం)కి చేరింది.  

ALso Read:Omicron : జబల్ పుర్ లో అధికారులను కంగారు పెట్టిన బోట్స్ వానా మహిళ.. చివరికి..

దేశవ్యాప్తంగా 3.45 కోట్ల మందికి కరోనా సోకగా.. అందులో 3.40 కోట్ల మంది డిశ్చార్జ్ అయ్యారు. దేశంలో ప్రస్తుతం రికవరీ రేటు 98.36 శాతానికి పెరిగింది. గతేడాది మార్చి నుంచి ఇదే అత్యధికం. 24 గంటల వ్యవధిలో 267 మంది ప్రాణాలు (corona deaths in india) కోల్పోయారు. అత్యధికంగా కేరళలో మరణాల సంఖ్య 177గా ఉంది. మొత్తంగా 4,69,247 మంది దేశంలో కోవిడ్ వల్ల కన్నుమూశారు. నిన్న 80,98,716 మంది టీకా వేయించుకున్నారు. దీంతో దేశంలో ఇప్పటివరకు 124 కోట్లకు పైగా డోసులు పంపిణీ అయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. 

మరోవైపు కరోనా Omicron variant వ్యాపించిన ఆఫ్రికా దేశాల నుంచి భారత్ కు వచ్చేవారిపై గట్టి నిఘా, పర్యవేక్షణ కొనసాగుతోంది. ఈ క్రమంలో Boatswanaకు చెందిన మహిళ ఇటీవల మధ్యప్రదేశ్ లోని జబల్ పుర్ కు వచ్చిందన్న సమాచారం రావడంతో స్థానిక అధికారులకు ఓ రోజంతా కునుకు కరువయ్యింది. బోట్స్ వానా ఆర్మీలో కెప్టెన్ గా పనిచేస్తున్న 34 యేళ్ల ఒరీమెట్సో లిన్ ఖుమో ప్రస్తుతం అధికారిక పర్యటన మీద భారత్ లో ఉంది. 

ఈ నెల 18న ఢిల్లీ నుంచి Jabalpurలోని ఆర్మీ కాలేజ్ ఆఫ్ మెటీరియల్ మేనేజ్ మెంట్ కు వచ్చింది. కోవిడ్ ప్రొటోకాల్ లో భాగంగా విదేశీయుల పర్యటన వివరాలను రాష్ట్రాలతో పంచుకుంటున్న కేంద్రం.. ఆమె పర్యటన సమాచారాన్ని రెండు రోజుల క్రితం మధ్యప్రదేశ్ రాష్ట్ర అధికారులకు చేరవేసింది. అయితే ఆమె ఎవరు? ఏ పనిమీద వచ్చింది? అన్న వివరాలు చెప్పలేదు. అప్రమత్తమైన జబల్ పుర్ అధికారులు ఆమె ఆచూకీ కోసం ఆదివారంవెతుకులాట ప్రారంభించారు. ఎట్టకేలకు సోమవారం స్థానిక Army Collegeలో ఆచూకీ గుర్తించారు. వెంటనే వెళ్లి కోవిడ్ పరీక్షలు నిర్వహించగా నెగటివ్ వచ్చింది. పూర్తిస్థాయిలో వ్యాక్సినేషన్ జరిగిన ఆమె సంపూర్ణ ఆరోగ్యంతో ఉండటం చూసి అంతా స్థిమితపడ్డారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios